=''/>

30, అక్టోబర్ 2013, బుధవారం

మాకు సూర్యోదయం కనిపిస్తుందోచ్ !!

మా ఇంటి ప్రక్కనున్న పొలం లో ,మబ్బు పట్టినప్పుడు  తప్ప మిగిలిన రోజులలోఉదయం ఇటువంటి దృశ్యాలు కనువిందు చేస్తుంటాయి ."ప్రతి దినం నీ దర్శనం "అనుకుంటూ కాసేపు ఆ అందాలను చూస్తే కానీ నా రోజు మొదలవ్వదు !
















ఈ రోజు  సుర్యోదయమిది !



మా ఇంటి ఎదురుగా ఇళ్లుండటంతో సూర్యోదయం ఈ రోజులు వస్తే కానీ కనిపించదు .ఇక ఇప్పటినుండి మార్చి వరకూ ఇలా పొలం నుండి కనిపిస్తుంది .









23, అక్టోబర్ 2013, బుధవారం

సీతాకోకచిలుకలు























9, అక్టోబర్ 2013, బుధవారం

ఈ ఏడు వేసిన కొత్త మొక్కలు

ఈ సంవత్సరం ఎండలు బాగా ఉండి రోజు నీళ్ళు పెడుతూ ఎంత  జాగ్రత్తగా చూసినా చాలా మొక్కలు చని పోయాయి.ప్రతీ ఏడూ  కొత్త మొక్కలేస్తూనే  ఉన్నా ఈ ఏడు ఎక్కువ మొక్కలేసాం. అందులోను మందార మొక్కలు  ఇంకాను .  

వర్షాకాలంలో కడియం నర్సరీ నుండి మొక్కలు తెచ్చి అమ్ముతారు .వాళ్ళ వద్ద కొన్ని కొన్నాం .తెల్ల గన్నేరు ,ఎల్లోబెల్స్,ఇంకా కొన్ని  మొక్కలు కొమ్మలే బ్రతికాయి .అందులో అంజూర్ మొక్క కూడా ఉంది .మందారాలు కూడా రెండు మొక్కలు కొమ్మలే బ్రతికాయి. అలా కొమ్మలు బ్రతికితే  భలే ఆనందగా ఉంటుంది. ఏదైనా కొత్త మొక్క కనిపిస్తే  ,కొమ్మేస్తే  బ్రతుకుద్దేమో అడిగి మొహమాటం లేకుండా తెచ్చేస్తా .

 మారేడు,కదంబం మొక్కలు నర్సరీలో కొన్నవి.



                                                                         తెల్ల గన్నేరు


                                                                       
                                                                        ఎల్లోబెల్స్


















అక్క కొమ్మ పంపితే వేసా .ఈ వర్షాలకి బాగా పెరిగింది .


                                                                 
ఈ మొక్క పేరు తెలీదు.   మా చెల్లి అత్తగారు కాశ్మీరు వెళ్ళినప్పుడు తెచ్చారట.వాళ్ళింటి వద్దనుండి నేతెచ్చా .ఈ  కాశ్మీరు మొక్కని :)  మన వాతావరణాన్ని తట్టుకుని బా పెరిగింది .



                                                          

ఎన్నో ఔషద  గుణాలున్న మారేడు గాలి మంచిది .  పొలంలో చాలా పెద్ద మారేడు మొక్కుంది . దాని మొదలున్న మొక్కలు ఎన్ని సార్లేసినా బ్రతకలేదు .సరే అని ఈ సారి కొని  వేసాం.పెద్దదవుతుందని బయట వేసాం .చుట్టూ కలుపు ఎక్కువుంది  .మొక్కని  బూతద్దంతో చూస్తేనే కానీ కనిపించదు :)







కదంబం మొక్క    చాలా పెద్దగా పెరుగుతుంది . అందుకే  దానికి ఇంట్లో చోటులేదు .పశువులు ,మేకలు స్వాహా చేయకుండా కాస్త బందోబస్తు చేసి పాపం బయట గోడ ప్రక్కన వేయించాం .





  బుల్లిబుల్లి  నేతి బీర కాయలు ! చూడటం ఇదే  మొదటిసారి.మా చెల్లి గుంటూరు జిల్లా నుండి విత్తనాలు  తెచ్చింది .గుత్తి బీర వండటం మొదటిసారి వీటితో ట్రైలేసా  .


                                                                     


ఎప్పటి నుండో ఉసిరి చెట్టు ఇంటివద్ద వేయాలని .ఇప్పటికి కుదిరింది .తొందరగా పెద్దదైపోయి కాయలు కాసేయాలని చూస్తున్నా :)