=''/>

24, ఆగస్టు 2010, మంగళవారం

బ్లాగ్ సొదరీ,సోదరులకు రక్షా బంధన్ శుభాకాంక్షలు
ఈ రోజు శ్రావణ పౌర్ణమి .ఈ రోజు అన్నా,చెల్లుళ్ళు ఎంతో ఆనందం గా రాఖీ పండుగను జరుపుకుంటారు .

కానీ ,నాకు చిన్నప్పుడు రాఖీ పండుగ వస్తే కొంచెం విచారం గా ఉండేది .ఎందుకంటే మేము నలుగురుమూ అమ్మాయిలమే . అందరూ చక్కగా వాళ్ళన్నయ లకు,తమ్మూలకూ ఎలా రాఖీ కట్టేము, అన్నయ్య ఏమి గిఫ్ట్ ఇచ్చాడు ,ఇలా అన్నీ చెబుతూ ఉంటే ,నాకూ ఒక "అన్న "కానీ "తమ్ము" కానీ ఉంటే చక్కగా నేనూ రాఖీ కట్టేదాన్నికదా అనుకునేదాన్ని.అందులోనూ నాకు తమ్ముడంటే ఇంకా ఇష్టం . చక్కగా అక్కా ,అక్కా అంటూ తిరుగుతారు అని ,ఇంకా ఏవో చాలా అనుకునేదానిని . ఇప్పుడూ కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది .ఆ ఫీలింగ్ గుర్తు చేస్తూ రాఖీ పండుగ వచ్చేసింది .

అన్నలున్న చెల్లాయిలకు, తమ్ముళ్ళు న్న అక్కయ్యలకు .........

"రాఖీ శుభాకాంక్షలు "

బ్లాగ్ లోకపు అన్నలకూ ,తమ్ముళ్లకూ నా "రాఖీ శుభాకాంక్షలు ."

5 కామెంట్‌లు:

  1. అక్కవో చెల్లాయివో తెలీదు గానీ నీకునూ రాఖీ శుభాకాంక్షలు సోదరీ :))

    రిప్లయితొలగించు
  2. శ్రీనివాస్ థాంక్స్ .నీకూ రాఖీ శుభాకాంక్షలు.
    థాంక్స్ నాగార్జున నీకు కూడా రాఖీ శుభాకాంక్షలు.
    @శివ బండారు,శివప్రసాద్ నిడమానూరి మీకు రాఖీ శుభాకాంక్షలు.ధన్యవాదాలు.

    రిప్లయితొలగించు