=''/>

10, ఆగస్టు 2010, మంగళవారం

నేను వేసిన పైంట్లు ,నేను తయారుచేసినవి .




ఇది శెకుంతల గ్లాస్ పైన్టింగ్ .

ఇది "నిబ్ పైన్టింగ్" .లైన్స్ నిబ్,రౌండ్ నిబ్ అని ఉంటాయి .వాటితో వేస్తారు.ఆయిల్ పైంట్ తోనే వేస్తారు .
ఇవి నా డిగ్రీ అయ్యాక రాజమండ్రిలో నేర్చుకున్న పైన్టింగ్స్.

కింద వన్నీ నేను సొంతం గా తయారు చేసినవి.
ఇది ,సోలార్ వుడ్ అని ఒక మెటీరియల్ ఉంటుంది. దానిని ఇలా వివిధ షేప్ లలో కత్తిరించి ,అంటించి తయారు చేసిన నెమలి ..

ఇది దర్మోకాల్ తో చేసిన జపాను అమ్మాయి.ధర్మో కాల్ పైన డిజైన్ గీసుకుని ,కట్ చేసి పైన ముకమల్ క్లాత్ అంటించి ,చిప్స్ ఇంకా మనకు ఎలా కావాలంటే అలా అంటించుకో వచ్చు.
పాత చాకు ను వేడి చేసి ,కట్ చేస్తే దర్మోకాల్ చాలా తేలికగా కట్ అవుతుంది .


ఇది పాట్ పైంట్ .ఫెవికాల్ లో చాక్ పౌడర్ కలిపి ఇలా తీగలు గా చేసి పాట్ కు అంటించి కలర్స్ వేసేను.


దీనికి చాలా చాలా రకాలు అంటించాను.డైమండ్ షేపులో అంటించినవి చిన్న చిన్న నత్త గుల్లలు .పచ్చ,ఎరుపు రంగు లు ,మెత్తని ఇసుకలో కలిపి ఆరాక అంటించాను .పైన రౌండ్ షేపులకి,బియ్యం రంగులో కలిపి వేసాను. ఇంకా అద్దాలు ,గురువింద గింజలు అంటించాను .అక్కడక్కడా ఊడిపోయాయి.ఇవి చేసి పన్నెండేల్లు అవుతుంది.అందుకే కొంచెం డల్ గా ఉన్నాయి . .
ఇంకా చాలా చేసాను కానీ అవన్నీ పాడైపోయాయని పెట్టలేదు .బియ్యానికి కలర్స్ వేసి స్వాగతం అనిరాసి ఒకటిచేసాను .బాగుండేది కానీ కిందపడి పడి పోయి పోయింది .

8 కామెంట్‌లు:

  1. WoW! Radhika garoo.. Simply superb! ఫోటోలు కొంచెం షేక్ అయినట్టున్నాయి గానీ, మీ ఆర్ట్ మాత్రం అద్భుతం గా ఉంది. మీ శకుంతలని ఎత్తుకొచ్చేయ్యాలనిపిస్తోంది. ;-)

    రిప్లయితొలగించండి
  2. అబ్బా!!! రాధిక గారూ, ఎంత బాగున్నాయో చెప్పలేను. ఇంత మంచి ఆర్ట్ చూసినప్పుడల్లా మనసు హాయిగా ఉంటుంది. Congrats.

    రిప్లయితొలగించండి
  3. చాలా బాగున్నాయి .ఏమనుకోకపోతే కొంచెం తెలుగు తప్పులపై శ్రద్ధ పెట్టగలరు.

    రిప్లయితొలగించండి
  4. చాలా బావున్నాయండి, మీకు ఓపిక ఎక్కువనుకుంటా.

    రిప్లయితొలగించండి
  5. మీ వర్క్ చాలా నీట్‌గా ఉంది. ఎంతో శ్రద్ధగా చేసినట్లున్నారు. ఇల్లు చాలా చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  6. @మదురవాణి ,@జయ ధన్యవాదాలు.
    విజయ్ మోహన్ గారు ,మీ సూచనను థాంక్సండి .మిరన్నాక సరిచేసానండి .
    బద్రిగారు,స్వప్నగారు ,గీతిక గారు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి