=''/>

29, ఆగస్టు 2010, ఆదివారం

నేడు మన మాతృభాషా దినోత్సవం

గిడుగు రామ్మూర్తి పంతులు గారి 147 వ జయంతైన ఈ రోజు ని మనం " మాతృ భాషా దినోత్సవం" గా జరుపుకుంటున్నాము.

శిష్ఠ వ్యవహారికం పేరిట వాడుక భాషలో బోధనకు ఆయన చాలా కృషి చేసారు .

శ్రీకాకుళం జిల్లాలో పర్వతాల పేటలో ఆయన 1863ఆగష్టు 29న వీర్రాజు ,వెంకమ్మ దంపతులకు జన్మించారు .

1896 లో బి.ఎ డిస్టింక్షన్ ఆయన చదువు పూర్తి చేసారు .గజపతి మహారాజా కాలెజీ లో అధ్యాపకుడిగా పనిచేశారు.తెలుగుభాషా బోధనను వ్యావహారికంలో చేయాలని ఆయన ఆలోచనకు జే.ఎ.యేట్స్ అనే ఆంగ్లేయాదికారి నుండీ మద్దతు లభించింది .అప్పటి ఏవీ ఎన్ కాలెజీ ప్రదాన అధ్యాపకుడు శ్రీనివాస అయ్యంగార్ ,గురజాడ అప్పారావు,యేట్స్ , రామప్ప పంతులు గారూ కలిసి వ్యావహారిక భాషలో బోధనోద్యమానికి కృషి చేసారు .వీరి కృషి కారణంగా 1912 -13 స్కూల్ ఫైనల్ తెలుగు పరీక్షను గద్యంలో లేదా వ్యావహారిక భాషలో రాయొచ్చని ఆదేశాలు జారీ చేసారు . అప్పటినుండి స్కూల్,కాలేజీ పాఠ్య పుస్తకాలు వ్యావహారిక భాషలో వెలువడటం మొదలుపెట్టాయి .ఆయన సేవలను గుర్తించిన అప్పటి బ్రిటిష్ ప్రభుత్వము రావ్ బహుద్దూర్ బిరుదు ప్రదానం చేసింది .వ్యవహారిక భాషకు ఇంత సేవచేసిన ఆయన 1940 ,జనవరి 22వ తెదీ న మరణించారు .

మన తెలుగు భాషకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆయన జయంతిని మనమంతా ఈ రోజు "తెలుగు భాషా దినోత్సవం" గా జరుపుకుంటున్నాము..

.



.

1 కామెంట్‌:

  1. గిడుగు రామ్మూర్తి పంతులు గారి గురించి తెలియ చేసినందుకు చాల అభినంద నీయులు. ఆయన జన్మ దినం తెలుగు భాష దినోస్త్సవం గా జరుపుకోవటం చాల విశేషం

    రిప్లయితొలగించండి