=''/>

26, ఏప్రిల్ 2010, సోమవారం

ప్రస్తుతం నేను వర్క్ చేస్తున్న చీర


ఇప్పుడు ఎక్కువగా చీరలపై పాచ్ వర్క్ చేస్తున్నారు . బెనారస్ ,కలంకారీ,జూట్ ఇలా ఏ రకమైన క్లాతనైనా తీసుకుని చీర అంచు కుట్టి,పువ్వులు అప్లిక్ వర్క్ చేస్తారు. దానినే పాచ్ వర్క్ అనికూడా అంటారు .


కలంకారీ క్లాత్ తో అంచు, పువ్వులు,బ్లౌజ్ పీస్ విడిగానే షాప్స్ లో సెట్స్ ఉంటున్నాయి .అవి తీసుకుని చీర పై పాచ్ వర్క్ చేస్తున్నాను. ఇది కాటన్ చీర .కలంకారీ క్లాత్ తో వర్కుకి ,సూపర్ నెట్ కానీ కాటన్ కానీ బాగుంటుంది .

ఇలా పాచ్ వర్క్ చీరలు షాప్స్ లో ఉంటాయి కానీ ఒక్కో సారి మనకు నచ్చిన రంగు దొరకదు అటువంటప్పుడు ,ఇలా కలంకారీ సెట్స్ ,మనకు నచ్చిన రంగు చీర తీసుకుని వర్కు లు చేసే వారికిచ్చి చేయించుకోవచ్చు. బెనారస్ తో పాచస్ ,బోర్డర్ ఐతే క్రేప్ కానీ పట్టు కానీ బాగుంటాయి . ఇవైనా అంతే మనకు నచ్చిన బెనారస్ క్లాత్ ,మాచింగ్ చీర తీసుకొని చేయించుకో వచ్చు . కలంకారీ , బెనారస్,వేరే క్లాత్ లేవైనా కానీప్రింటెడ్ చీరలకు కూడా బోర్డర్ లాగా వేయించుకోవచ్చు . మనము ఒకటి రెండు సార్లు కట్టిన చీరలకైనా ఇలా బోర్డర్ లా వేయించుకుంటే చీరలకు కొత్త లుక్ వస్తుందికదా . అందుకే ఎప్పుడైనా బోర్ కొడుతుంటే కాలక్షేపం కోసమైన ఇలా చీరలకు ఏవో ఒక మెరుగులు దిద్దుతూ వుంటాను.



నేను ఈ పాచ్ వర్క్ చేయడం ఎక్కడా నేర్చు కోలేదు కానీ ,చూసి చేయడం మొదలు పెట్టాను . నేను ఇదివరకే ఈవర్క్ చేసుకున్నాను. ఇది మాచిన్నక్క చీర. ఎలా ఉందో చెప్పండేమరి .

23, ఏప్రిల్ 2010, శుక్రవారం

అన్దరూ వినదగ్గ కమ్మని తెలుగు పాట


మాపాప స్కూల్ లో ,వాళ్ల హౌస్ కాంపిటిషన్లో పాడిన పాట ఇది .దీనికి వాళ్ళకి మొదటి బహుమతి వచ్చింది .ఈపాట నాకు బాగా నచ్చింది .మాపాప వాళ్ళు పాడిన సీడీని సంపాదించి ఈపాటను అందరికోసం బ్లాగ్లో పెట్టాను . మీకు కూడా నచ్చుతుందని భావిస్తున్నాను .





చెక్కర కలిపిన తీయని కమ్మని తోడుపెరుగు తెలుగు
చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల మెలగు

చెక్కర కలిపిన తీయని కమ్మని తోడుపెరుగు తెలుగు
చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల మెలగు

నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగూ
నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగూ

చదువులతల్లికి సుమదుర శైలికి పుట్టినిల్లు తెలుగూ

చెక్కర కలిపిన తీయని కమ్మని తోడుపెరుగు తెలుగు
చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల మెలగు

గమపా..గమసా ..గమనీ ..సగరిసా ..
గమపా..గమసా ..గమనీ ..సగరిసా ..


హిమగిరి జలనిది పదముల అమరిన జిలుగు వెలుగు తెలుగూ
హిమగిరి జలనిది పదముల అమరిన జిలుగు వెలుగు తెలుగూ

ప్రణయతిప్రాసతో రసమయి శ్వాసగ కవితలల్లు కొలువూ
ప్రణయతిప్రాసతో రసమయి శ్వాసగ కవితలల్లు కొలువూ

చెక్కర కలిపిన తీయని కమ్మని తోడుపెరుగు తెలుగు
చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల మెలగు

గమపా..గమసా ..గమనీ .. సగరిసా..
గమపా..గమసా ..గమనీ .. సగరిసా..

అల్లసాని అల్లికల జిగిబిగిని అమృతధార తెలుగూ
అల్లసాని అల్లికల జిగిబిగిని అమృతధార తెలుగూ

శ్రీ నాధుని కవితా సుధారలో అలల గంగ పరుగూ
శ్రీ నాధుని కవితా సుధారలో అలల గంగ పరుగూ

రాయల కల్పనలో రామ కృష్ణుని శిల్పములో
రాయల కల్పనలో రామ కృష్ణుని శిల్పములో

రసధారయై ధృవతారయై రసధారయై ధృవతారయై
రసధారయై ధృవతారయై రసధారయై ధృవతారయై

మన దేశ భాషలకు లెస్స యై దేశ భాషలో చెలిమి చేయు
మన దేశ దేశ ముల వాశికెక్కినది

చెక్కర కలిపిన తీయని కమ్మని తోడుపెరుగు తెలుగు
చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల మెలగు

గమపా..గమసా ..గమనీ .. సగరిసా..
గమపా..గమసా ..గమనీ .. సగరిసా..

అక్షరాలతీరూ మల్లెపాదు కుదురూ
మన అక్షరాల తీరూ మల్లెపాదు కుదురూ

భాష పాల కడలీ రాగం మధు మురళీ
భాష పాల కడలీ రాగం మధు మురళీ

ప్రశస్త పదముల అలంకృతం మన భాషామృత చరితం
ప్రశస్త పదముల అలంకృతం మన భాషామృత చరితం

రాయల భాషా భారతి నుదుట తెలుగు భాష తిలకం

చెక్కర కలిపిన తీయని కమ్మని తోడుపెరుగు తెలుగు
చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల మెలగు

నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగూ
నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగూ

చదువులతల్లికి సుమదుర శైలికి పుట్టినిల్లు తెలుగూ

చెక్కర కలిపిన తీయని కమ్మని తోడుపెరుగు తెలుగు
చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల మెలగూ






Get this widget Track details eSnips Social DNA

****************************

15, ఏప్రిల్ 2010, గురువారం

వేసవిలో వానజల్లు (మీ అభిప్రాయాలు )

నిన్న మా ఊళ్ళో వర్షం పడింది .వేసవికాలంకదా .ఈకాలంలో వర్షంపడితే ఉక్కబొత ,వేడితోనూ సతమతమవుతున్న వాళ్ళము కొద్దిగా చల్లబడతాము . అలాగే వర్షం పడుతుంటే వచ్చే గాలి మట్టివాసనొస్తూ చాలా బాగుంటుంది.నాకు చాలాఇష్టం .వర్షపడుతుంటే ఆవాసన పీలుస్తూ నాబావాలను ఏదొ నాకు తోచినట్టు ఇలారాసాను.
వర్షం పడుతుంటే మా ఇంటి ముందు ఇలా క్లిక్ మనిపించాను .




అరుణారుణ కిరణాలతో తన ప్రతాపాన్ని

చూపిన సూరిడు మెల్లగా చల్లబడుతున్నాడు .

గువ్వలునెమ్మిదిగా తమగూళ్లకు చేరుతున్నవేళలో ..

చల్లని పిల్ల గాలి తెమ్మెరలామొదలై
మనసుకి ,దేహానికి హాయినిస్తూ పయనిస్తున్న

చిరుగాలి ఉన్నట్టుండి సుడిగాలిలామారింది.

కారుమబ్బుల తో నిండిన ఆకాశం నుండి

ఉరుములు ,మెరుపుల అలజడితో..

ఈవేసవిలో కురిసిన "పన్నీటిజల్లులో"

తడిసిన మట్టి ఎంత సుగందభరితమైన
సువాసననిస్తుందీ...
మైమరచిపోయా గుండెలనిండా ఆ వాసనపీలుస్తూ.

10, ఏప్రిల్ 2010, శనివారం

గోదావరి అందాలు

మేము మొన్న రాజమండ్రి బస్సులో వెళుతుంటే ,రోడ్-రైలు వంతెన పై ట్రాఫిక్ జాం ఐంది .వంతెన బాగా పాడైపోయిందని ఈమధ్య బాగుచేస్తున్నారు . ఇలా అప్పుడప్పుడు ట్రాఫిక్ ఆపేస్తున్నారని అన్నారు .


అసలే వేసవికాలం అపైన వుక్కపోత,ట్రాఫిక్ జామైతే ఎలాఉంటుంది. నాతో మాబాబుకూడా ఉన్నాడు.వాడు చెమట్లుపట్టి గొడవ, ఎప్పుడు లైన్ క్లియర్ అవుతుందా అని విసుగ్గా ఎదురుచూస్తూ ఉన్నాము .


అప్పుడు బాగ్ లో కెమేరా ఉన్న విషయం గుర్తుకొచ్చింది .ఇదిగో ఇలా మా గొదావరి అందాలను ఫొటోలు తీస్తూమేము టైం పాస్ చేశాము. ఈలోపు ట్రాఫిక్ క్లియర్ ఐంది .


చూడండి గోదావరి అందాలు



























8, ఏప్రిల్ 2010, గురువారం

మా ఊరి లైబ్రెరీ {ఆల్ ఇన్ వన్}



ఈమద్యే చేయించుకున్న కొత్త పల్లకీలొ మా సీతా రాము ల ను మాఊరి వీదులలో ఊరెగిస్తున్న మా ఊరి జనులు .





ఇదే మా ఊరి లైబ్రెరీ .

దీనిని మాఊరు ఏర్పడిన కొత్తలో( సుమారు ఏభైయేళ్ళ క్రితం ) ఊరిమధ్యలో ఖాళీస్థలములో కట్టించుకున్నారు .
అప్పట్లో వాళ్ళు ఎప్పుడైనా పేపర్ చదవాలంటే మా పక్కనున్న ఊరికి వెళ్లాల్సి వచ్చేది.అందుకని మాఊరివాళ్లంతా కలసి దీనిని ఏర్పాటు చేసుకుని పేపర్లు పుస్తకాలు తెప్పించేవారట. .. తరువాత తరువాత అందరికీ పేపర్లు రావడం మొదలయ్యక లైబ్రెరీని సరిగా పట్టించుకోక పోవడముతో , పుస్తకాలు అవీ పోయి ప్రస్తుతం అది ఖాళీగా ఉంటుంది.

అది ఇప్పుడు ఒక గ్రంధాలయం లాగా ఉపయోగపడకపొయినా కానీ , మాఊళ్లొ ప్రస్తుతం లైబ్రెరీ అంటే ఆల్ ఇన్ వన్ అన మాట . . మాది మైనర్ పంచాయితీకావడంతో ,మాఊళ్ళో పంచాయితీకూడా ఉండదు. అది ఊరి మధ్యలో ఉండంతో ,అందరూ సమావేసాలవ్వాలన్నా ,ఏవైనా తగువులు తీర్చాలన్న అదే వేదిక. మాతాత గారు వాళ్ళంతా రొజూ సాయంత్రాలు అక్కడ కాలక్షేపం చేసేవారు .టీవీ లు వచ్చాక చాలా తగ్గింది . ఇదివరకు సాయంత్రా లు అక్కడికి చేరి ఊరి విశేషాలన్నీ చర్చించు కునేవారు.
మా ఊరిలో గీతాసమాజముంది. వాళ్లు ప్రతీ శుకృవారం బగవద్గీత అక్కడే చదువుతారు .అలాగే దసరాకి దేవీని నిలబెట్టి తొమ్మిదిరోజులూ అక్కడే పూజలు కూడా చేస్తారు .

మాఊరి లో శ్రీ రామనవమి,వినాయక చవితి చాలా బాగా జరుపుకుంటాము .అవికూడా అక్కడే చేస్తారు . మా చిన్నప్పుడు శ్రీ రామనవమి ఐదు రొజులూ హరికథ ,బుర్రకథ ,సినిమాలు ఇలా వేసేవారు . ఈలైబ్రీ ముందే వేసేవారు .
ఇప్పుడైనా ఒకటో ,రెండో వేస్తె ఇక్కడే వేస్తారు .


ఇలా అన్నిటికీ మా లైబ్రీ ఉపయోగపడుతుంది .లైబ్రీ , అదేనండి లైబ్రెరీ ని మా ఊరిలో ఇలాగే పిలవడం పిల్లా జెల్లా అందరికీ అలవాటై పోయింది . ఇదం డీ మా లైబ్రీ కథ .