మాపాప స్కూల్ లో ,వాళ్ల హౌస్ కాంపిటిషన్లో పాడిన పాట ఇది .దీనికి వాళ్ళకి మొదటి బహుమతి వచ్చింది .ఈపాట నాకు బాగా నచ్చింది .మాపాప వాళ్ళు పాడిన సీడీని సంపాదించి ఈపాటను అందరికోసం బ్లాగ్లో పెట్టాను . మీకు కూడా నచ్చుతుందని భావిస్తున్నాను .
చెక్కర కలిపిన తీయని కమ్మని తోడుపెరుగు తెలుగు
చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల మెలగు
చెక్కర కలిపిన తీయని కమ్మని తోడుపెరుగు తెలుగు
చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల మెలగు
నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగూ
నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగూ
చదువులతల్లికి సుమదుర శైలికి పుట్టినిల్లు తెలుగూ
చెక్కర కలిపిన తీయని కమ్మని తోడుపెరుగు తెలుగు
చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల మెలగు
గమపా..గమసా ..గమనీ ..సగరిసా ..
గమపా..గమసా ..గమనీ ..సగరిసా ..
హిమగిరి జలనిది పదముల అమరిన జిలుగు వెలుగు తెలుగూ
హిమగిరి జలనిది పదముల అమరిన జిలుగు వెలుగు తెలుగూ
ప్రణయతిప్రాసతో రసమయి శ్వాసగ కవితలల్లు కొలువూ
ప్రణయతిప్రాసతో రసమయి శ్వాసగ కవితలల్లు కొలువూ
చెక్కర కలిపిన తీయని కమ్మని తోడుపెరుగు తెలుగు
చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల మెలగు
గమపా..గమసా ..గమనీ .. సగరిసా..
గమపా..గమసా ..గమనీ .. సగరిసా..
అల్లసాని అల్లికల జిగిబిగిని అమృతధార తెలుగూ
అల్లసాని అల్లికల జిగిబిగిని అమృతధార తెలుగూ
శ్రీ నాధుని కవితా సుధారలో అలల గంగ పరుగూ
శ్రీ నాధుని కవితా సుధారలో అలల గంగ పరుగూ
రాయల కల్పనలో రామ కృష్ణుని శిల్పములో
రాయల కల్పనలో రామ కృష్ణుని శిల్పములో
రసధారయై ధృవతారయై రసధారయై ధృవతారయై
రసధారయై ధృవతారయై రసధారయై ధృవతారయై
మన దేశ భాషలకు లెస్స యై దేశ భాషలో చెలిమి చేయు
మన దేశ దేశ ముల వాశికెక్కినది
చెక్కర కలిపిన తీయని కమ్మని తోడుపెరుగు తెలుగు
చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల మెలగు
గమపా..గమసా ..గమనీ .. సగరిసా..
గమపా..గమసా ..గమనీ .. సగరిసా..
అక్షరాలతీరూ మల్లెపాదు కుదురూ
మన అక్షరాల తీరూ మల్లెపాదు కుదురూ
భాష పాల కడలీ రాగం మధు మురళీ
భాష పాల కడలీ రాగం మధు మురళీ
ప్రశస్త పదముల అలంకృతం మన భాషామృత చరితం
ప్రశస్త పదముల అలంకృతం మన భాషామృత చరితం
రాయల భాషా భారతి నుదుట తెలుగు భాష తిలకం
చెక్కర కలిపిన తీయని కమ్మని తోడుపెరుగు తెలుగు
చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల మెలగు
నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగూ
నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగూ
చదువులతల్లికి సుమదుర శైలికి పుట్టినిల్లు తెలుగూ
చెక్కర కలిపిన తీయని కమ్మని తోడుపెరుగు తెలుగు
చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల మెలగూ
|
****************************
gud..........
రిప్లయితొలగించండిఈ పాట చిన్నప్పుడు రేడియో లో వినేవాళ్లం అండీ...బావుంటుంది. మేము కూడా పాడుకునేవాళ్ళం. మంచి పాటని గుర్తు చేసారు.
రిప్లయితొలగించండిఈ పాట ఎవరు రాసారో తెలీదండీ, తెలిస్తే చెప్పారూ ?
రిప్లయితొలగించండిఈ పాట మీ దగ్గర ఉంటే ఇస్తారా, plz plz?
రిప్లయితొలగించండినేను నా చిన్నప్పుదు Dooradarshan లొ బాలానందం లొ విన్నాను ఈ పాట..మల్లీ ఈ పాట విందాం అంటె దొరకలేదు నాకు.Thanx for sharing ,చెక్కర కలిపిన పెరుగు లాంటి తియ్యని తెలుగు పాట
రిప్లయితొలగించండిఈ పాటా జొన్నవిత్తుల వారిదండి. ఇక్కడ (http://www.telugubhakti.com/telugupages/Telugu/Toranam/Chekkara.htm) చూపిన పాటకీ మీరు ప్రకటించిన పాటకి కొంత వ్యత్యాసం కనిపిస్తున్నది.
రిప్లయితొలగించండి@వినయ్ చక్రవర్తి , ధన్యవాదాలు .
రిప్లయితొలగించండి@సౌమ్య http://www.esnips.com/doc/5793b265-57f1-4233-b2e9-8f62371fd51f/telugu నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు .
@ మంజు,ధన్యవాదాలు .@ఊకదంపుడు ,జొన్నవిత్తుల వారిదని తెలియదండి.పాట నచ్చి పెట్టాను.తెలిపినందుకు ధన్యవాదాలు.
వచ్చేనెల మేము చేసే వేడుకకి మంచిపాట కావాలని వెదుకుతుంటే, ఇది దొరికింది..నేను నడిపే బడి పిల్లలతో పాడిస్తాను. థాంక్స్.
రిప్లయితొలగించండి