నిన్న మా ఊళ్ళో వర్షం పడింది .వేసవికాలంకదా .ఈకాలంలో వర్షంపడితే ఉక్కబొత ,వేడితోనూ సతమతమవుతున్న వాళ్ళము కొద్దిగా చల్లబడతాము . అలాగే వర్షం పడుతుంటే వచ్చే గాలి మట్టివాసనొస్తూ చాలా బాగుంటుంది.నాకు చాలాఇష్టం .వర్షపడుతుంటే ఆవాసన పీలుస్తూ నాబావాలను ఏదొ నాకు తోచినట్టు ఇలారాసాను.
వర్షం పడుతుంటే మా ఇంటి ముందు ఇలా క్లిక్ మనిపించాను .

అరుణారుణ కిరణాలతో తన ప్రతాపాన్ని
చూపిన సూరిడు మెల్లగా చల్లబడుతున్నాడు .
గువ్వలునెమ్మిదిగా తమగూళ్లకు చేరుతున్నవేళలో ..
చల్లని పిల్ల గాలి తెమ్మెరలామొదలై
మనసుకి ,దేహానికి హాయినిస్తూ పయనిస్తున్న
చిరుగాలి ఉన్నట్టుండి సుడిగాలిలామారింది.
కారుమబ్బుల తో నిండిన ఆకాశం నుండి
ఉరుములు ,మెరుపుల అలజడితో..
ఈవేసవిలో కురిసిన "పన్నీటిజల్లులో"
తడిసిన మట్టి ఎంత సుగందభరితమైన సువాసననిస్తుందీ...
వర్షం పడుతుంటే మా ఇంటి ముందు ఇలా క్లిక్ మనిపించాను .
అరుణారుణ కిరణాలతో తన ప్రతాపాన్ని
చూపిన సూరిడు మెల్లగా చల్లబడుతున్నాడు .
గువ్వలునెమ్మిదిగా తమగూళ్లకు చేరుతున్నవేళలో ..
చల్లని పిల్ల గాలి తెమ్మెరలామొదలై
మనసుకి ,దేహానికి హాయినిస్తూ పయనిస్తున్న
చిరుగాలి ఉన్నట్టుండి సుడిగాలిలామారింది.
కారుమబ్బుల తో నిండిన ఆకాశం నుండి
ఉరుములు ,మెరుపుల అలజడితో..
ఈవేసవిలో కురిసిన "పన్నీటిజల్లులో"
తడిసిన మట్టి ఎంత సుగందభరితమైన సువాసననిస్తుందీ...
మైమరచిపోయా గుండెలనిండా ఆ వాసనపీలుస్తూ.
మీ చిత్తరువుని చూస్తుంటే నిజంగానే మట్టి వాసనొచ్చిందండీ।
రిప్లయితొలగించండిచాలా బాగుంది వేసవిలో వాన వర్ణన।
రిప్లయితొలగించండిpic chaala baagundi andi..............
రిప్లయితొలగించండిchala baga rastunnaru kadaa, maLLi inspration lanTi pedda maaTalemduku ..
రిప్లయితొలగించండివర్షం లో మీ ఊరు చాలా బాగుందండీ
రిప్లయితొలగించండి@ నాగేశ్వర్రావుగారు,రాకేశ్వరరావుగారు, హనుగారు,వినయ్ గారు,
రిప్లయితొలగించండిధన్యవాదాలు
chala bagundi priya
రిప్లయితొలగించండి