=''/>

15, ఏప్రిల్ 2010, గురువారం

వేసవిలో వానజల్లు (మీ అభిప్రాయాలు )

నిన్న మా ఊళ్ళో వర్షం పడింది .వేసవికాలంకదా .ఈకాలంలో వర్షంపడితే ఉక్కబొత ,వేడితోనూ సతమతమవుతున్న వాళ్ళము కొద్దిగా చల్లబడతాము . అలాగే వర్షం పడుతుంటే వచ్చే గాలి మట్టివాసనొస్తూ చాలా బాగుంటుంది.నాకు చాలాఇష్టం .వర్షపడుతుంటే ఆవాసన పీలుస్తూ నాబావాలను ఏదొ నాకు తోచినట్టు ఇలారాసాను.
వర్షం పడుతుంటే మా ఇంటి ముందు ఇలా క్లిక్ మనిపించాను .




అరుణారుణ కిరణాలతో తన ప్రతాపాన్ని

చూపిన సూరిడు మెల్లగా చల్లబడుతున్నాడు .

గువ్వలునెమ్మిదిగా తమగూళ్లకు చేరుతున్నవేళలో ..

చల్లని పిల్ల గాలి తెమ్మెరలామొదలై
మనసుకి ,దేహానికి హాయినిస్తూ పయనిస్తున్న

చిరుగాలి ఉన్నట్టుండి సుడిగాలిలామారింది.

కారుమబ్బుల తో నిండిన ఆకాశం నుండి

ఉరుములు ,మెరుపుల అలజడితో..

ఈవేసవిలో కురిసిన "పన్నీటిజల్లులో"

తడిసిన మట్టి ఎంత సుగందభరితమైన
సువాసననిస్తుందీ...
మైమరచిపోయా గుండెలనిండా ఆ వాసనపీలుస్తూ.

7 కామెంట్‌లు:

  1. నాగేస్రావ్15 ఏప్రిల్, 2010 7:28 PMకి

    మీ చిత్తరువుని చూస్తుంటే నిజంగానే మట్టి వాసనొచ్చిందండీ।

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగుంది వేసవిలో వాన వర్ణన।

    రిప్లయితొలగించండి
  3. chala baga rastunnaru kadaa, maLLi inspration lanTi pedda maaTalemduku ..

    రిప్లయితొలగించండి
  4. వర్షం లో మీ ఊరు చాలా బాగుందండీ

    రిప్లయితొలగించండి
  5. @ నాగేశ్వర్రావుగారు,రాకేశ్వరరావుగారు, హనుగారు,వినయ్ గారు,
    ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి