=''/>

8, ఏప్రిల్ 2010, గురువారం

మా ఊరి లైబ్రెరీ {ఆల్ ఇన్ వన్}



ఈమద్యే చేయించుకున్న కొత్త పల్లకీలొ మా సీతా రాము ల ను మాఊరి వీదులలో ఊరెగిస్తున్న మా ఊరి జనులు .





ఇదే మా ఊరి లైబ్రెరీ .

దీనిని మాఊరు ఏర్పడిన కొత్తలో( సుమారు ఏభైయేళ్ళ క్రితం ) ఊరిమధ్యలో ఖాళీస్థలములో కట్టించుకున్నారు .
అప్పట్లో వాళ్ళు ఎప్పుడైనా పేపర్ చదవాలంటే మా పక్కనున్న ఊరికి వెళ్లాల్సి వచ్చేది.అందుకని మాఊరివాళ్లంతా కలసి దీనిని ఏర్పాటు చేసుకుని పేపర్లు పుస్తకాలు తెప్పించేవారట. .. తరువాత తరువాత అందరికీ పేపర్లు రావడం మొదలయ్యక లైబ్రెరీని సరిగా పట్టించుకోక పోవడముతో , పుస్తకాలు అవీ పోయి ప్రస్తుతం అది ఖాళీగా ఉంటుంది.

అది ఇప్పుడు ఒక గ్రంధాలయం లాగా ఉపయోగపడకపొయినా కానీ , మాఊళ్లొ ప్రస్తుతం లైబ్రెరీ అంటే ఆల్ ఇన్ వన్ అన మాట . . మాది మైనర్ పంచాయితీకావడంతో ,మాఊళ్ళో పంచాయితీకూడా ఉండదు. అది ఊరి మధ్యలో ఉండంతో ,అందరూ సమావేసాలవ్వాలన్నా ,ఏవైనా తగువులు తీర్చాలన్న అదే వేదిక. మాతాత గారు వాళ్ళంతా రొజూ సాయంత్రాలు అక్కడ కాలక్షేపం చేసేవారు .టీవీ లు వచ్చాక చాలా తగ్గింది . ఇదివరకు సాయంత్రా లు అక్కడికి చేరి ఊరి విశేషాలన్నీ చర్చించు కునేవారు.
మా ఊరిలో గీతాసమాజముంది. వాళ్లు ప్రతీ శుకృవారం బగవద్గీత అక్కడే చదువుతారు .అలాగే దసరాకి దేవీని నిలబెట్టి తొమ్మిదిరోజులూ అక్కడే పూజలు కూడా చేస్తారు .

మాఊరి లో శ్రీ రామనవమి,వినాయక చవితి చాలా బాగా జరుపుకుంటాము .అవికూడా అక్కడే చేస్తారు . మా చిన్నప్పుడు శ్రీ రామనవమి ఐదు రొజులూ హరికథ ,బుర్రకథ ,సినిమాలు ఇలా వేసేవారు . ఈలైబ్రీ ముందే వేసేవారు .
ఇప్పుడైనా ఒకటో ,రెండో వేస్తె ఇక్కడే వేస్తారు .


ఇలా అన్నిటికీ మా లైబ్రీ ఉపయోగపడుతుంది .లైబ్రీ , అదేనండి లైబ్రెరీ ని మా ఊరిలో ఇలాగే పిలవడం పిల్లా జెల్లా అందరికీ అలవాటై పోయింది . ఇదం డీ మా లైబ్రీ కథ .

6 కామెంట్‌లు: