=''/>

3, సెప్టెంబర్ 2010, శుక్రవారం

అనావృష్టి ,అతివృష్టి





నీరు పెట్ట లేక ఊడ్చిన వరిచేనుని అలా వదిలేసా రు. .




నిరుడు ఈ రోజులలో వర్షాలు సరిగా లేక వరి చేలకు నీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడ్డారు .మాది మెట్ట ప్రాంతం అవటంతో ,మా వైపు ఎక్కువగా బోర్లు నుండి వచ్చే నీళ్ళ తోనే వ్యవసాయంచేస్తారు.వర్షాలు సకాలంలో పడకపోతే బోర్ నీళ్ళ తో ఎంతని వ్యవసాయం చేస్తారు .


ఈ ఏడు వానలు చాలా ఎక్కువగా పడుతున్నాయి .ఈ సంవత్సరం జూన్ మొదటి వారంలోనే ఋతుపవనాల రాకతో మొదలైన ఎడతెరిపిలేని వర్షాలవలన అప్పుడే ఈ ఏడు సాదారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతమే నమోదైనదంటున్నారు. సాదారణంగా అక్టోబర్,నవంబర్ నెలల మధ్యలో ఏర్పడే వాయుగుండా ల వలన గానీ,తుఫాన్ల వలన కానీ నదులు ,కాలువలు ,చెరువులు నిండి వరదలు అవీ వస్తూ ఉంటా యి కదా .మాకు ఈ వర్షాల వలన ఎర్రకాలువ(ఈ ఎర్రకాల్వ మా పొలం పక్క నుండి వెళుతుంది . ) నిండి చేలకు నష్టాన్ని కలిగిస్తాయి .రెండు సంవత్సరాల క్రితం ఐతే ఈ వరదలకు, కోతకు వచ్చిన వరిచేను వారం రోజులు నీట మునిగి పోయి పంట చేతికి రాకుండా పోయింది .అప్పుడు కాల్వకు గండి పడిరైతులకు బాగా నష్టం వచ్చింది . ఇది చెరువనుకున్తున్నారా?కాదు మా వరిచేనే .వరదనీటిలో మునిగి ఇలా చెరువు ను తలపిస్తుంది .


ఆ గండి ని పుడ్చక పోవటం వలన క్రిందటి నెలలో కురిసిన వానలకు వచ్చిన వరదకు మా చేను ఒక్క రోజు మునిగి పోయింది .మళ్ళీ పది, పదిహేను రోజులనుండి కురుస్తున్న వర్షాలకు ఎర్రకాల్వ లోకి బాగా వరద నీరు వచ్చి చేను మునిగి పోయి మూడు రోజులుంది.కానీనీళ్ళలో మునిగింది మూడు రోజులే కావడం, ఇంకా కంకులు వేయక పోవడంతో నష్ట మేమీ ఉండదంట.

వరద నీటికి ఎలా పడిపోయిందో చుడండి . ప్రస్తుతం చేలో నుండి వరద పోయింది .ఒక వారం పొతే నెమ్మిదిగా చేనంతా తేరుకుంటా దంట .( మందులు బాగా వేస్తారేమో )

అయినా ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగానే పడతాయం టున్నారు .ఇంకా ఎన్ని సార్లు వరదలొస్తాయో ఏమిటో? రైతులకు ఏంటో ఎంత కష్ట పడుతున్నా ఎప్పుడూ అతివృష్టి ,అనావృష్టి ఏదో ఒకరూపంలో నష్టాన్ని కలిగిస్తూనే ఉంటాయి . .

7 కామెంట్‌లు:

  1. hmm..బాధనిపిస్తుంది .. ఈ పంట భూమి మీద మాత్రమే ఆధారపడిన రైతులకి ఇంక అప్పే?

    రిప్లయితొలగించండి
  2. just because of these nature's twists and the lack of any support from govt. we sold our lands and soul, settled in cities...living artificial life minus soul.

    రిప్లయితొలగించండి
  3. ఈ ప్రకృతి సమస్యలను అరికట్టే శక్తి ఇంక మనకు లేనట్లే ఉంది.

    రిప్లయితొలగించండి
  4. అవునండి పల్లెలే పట్టుకొమ్మలంటారు రైతే వెన్నెముక అంటారు. కాని ఆ రైతుకు మాత్రం ఎప్పుడూ వెన్ను విరగటమే. పొలం పండటం దగ్గర నుంచి వాటిని ఇంటీకి తరలించే వరకు ఎన్ని ఇబ్బందులండీ. ఒకప్పుడు రైతు కుటుంబాలని చెప్పుకోవటమే మేము. ఆ వ్యవసాయం దెబ్బ తట్టుకోలేక పొలాలు అమ్ముకుని వలసలొచ్చేసాము. :-(

    రిప్లయితొలగించండి
  5. @ కృష్ణ ప్రియ,నిజమేనండి .రెండు మూడు రకాల పంటలు పండించే మాలాంటి వాళ్ళు పరవాలేదు .చిన్న రైతులకు పాపం అప్పులే కదా?ధన్యవాదాలు
    @అజ్ఞాత గారు ,బాగా చెప్పారు .థాంక్స్ అండి .
    @విజయ్ మొహన్గారు అంతేకదా .
    @జయ గారు ,అవునండి
    భావనగారు నిజంగానా చాలా భాదగాఉంది .మీ కామెంట్ చూస్తే .థాంక్స్ అండి .మీ కామెంట్ కి

    రిప్లయితొలగించండి