చాలా మంది తెలుగమ్మయిలు లానే నాకు వాలుజడ,పొడవు జడ అంటేచాలా ఇష్టం..
కానీ వాలుజడ కాకపోయినా దానిలో సగమైనా ఉందిలే(పదిసంవత్సరాల క్రితం వరకూ) పరవాలేదు అనుకునేదానిని. .ఇప్పుడు ఆ సగములో సగం కుడా లేకుండా పిలకైపోయింది :( .
రోడ్ మీద ఎవరైనా పొడవు జడమ్మాయి వెళుతుంటే ఆ అమ్మాయి వెళ్ళే వరకూ కళ్ళార్పకుండా ఆ జడ నే .......అలా చుస్తూ ఉండి పోతాను.(ఆ జడకు నా దిష్టి తగిలి పాపం తరువాత ఎలా అయిపోయేదో?) .. .పక్కన ఎవరైనా ఉండి పిలిస్తే సరే లేకపోతె ఆ అమ్మాయి వెళ్ళేవరకూ అంతే.... అంత పిచ్చనమాట జడంటే......
పొనీ మా పాప జడైనా........... పెద్ద జడ అవుతుందేమో అనుకున్నాను కానీ ,ఏదో ఓ మోస్తరు గా ఉంటుందంతే.... ఆ జడని కాస్తా హాస్టల్ లో జాయిన్ చేసినప్పుడు కత్తిరించేసాను.(ఆ కత్తిరించిన జుట్టుతో సవరం కట్టించేననుకోండి.తరువాత ఎలాగూ అవసరమవుతుందని .నాక్కాదండోయ్ తనకే ...... పెళ్ళిళ్ళకి ,ఫంక్షన్స్ కి లంగా ఓణి వేసుకుంటే ,పొడవుజడ...జడకుప్పెలూ ఉండాలికదా.. ). అసలే హాస్టల్లో ఉంటుంది నాలుగైదేళ్ళు పొతే ఇప్పుడున్న జడ కుడా ఉండదేమో .
సర్లే మా జడల గోడవెందుక్కానీ.........
ఇక్కడ చూడండి విదేశాలలో కుడా చక్కగా పొడవు జడ తో అమ్మాయిలు బలే ఉన్నారు .... అంతంత జడ లని వాళ్ళెలా మైంటైన్ చేస్తున్నారో.......
మీ బ్లాగు చదివాను, బాగుంది, కానీ, పదాలకు అక్కడక్కడా, దీర్ఘాలూ, వత్తులూ, వుండట్లేదు, తప్పుగా అనుకోకండి, ఇంకా బాగుండాలని ఈ సలహా. ముఖ్యంగా సీరియళ్ళ గూర్చిన బ్లాగు లో రాధా, మధూ ..వీటిలికి వత్తుల్లేవు. అంతే కాక వాలు జడ అంటే, వదులుగా వేసుకునే జడ గానీ, పొడవు జడ కాదు...
రిప్లయితొలగించండి:)
రిప్లయితొలగించండి'రాధాగోపాళం' లో పాట గురించి అనుకున్నానండీ.. బాగున్నాయి జడ కబుర్లు..
రిప్లయితొలగించండిsame pinch :) :)
రిప్లయితొలగించండిbaagunnayi mee jada kaburulu
రిప్లయితొలగించండినాకూ వాలు జడ అంటే ఎంత ఇష్టమో ! ఇప్పుడు నాదీ పొట్టిజడైపోయింది . సో నేనూ మీలాగే రోడ్ మీద పెద్ద జడల వాళ్ళని అలా కన్నార్పకుండా చూస్తూ వుంటాను :))
రిప్లయితొలగించండిnaku potti jada plus vaalu jada rendu ishtam. rendu kavalani korukunta potti jada ayithe cut cheste 1 min. lo potti jada ayipotadi kani valu jada kavalantene kashtam konni months wait cheyali ade problem. vaalu jada kuda okka min lo kakapoyina okka roju lo perigithe entha baguntundo.
రిప్లయితొలగించండిee madya cut cheyinchukovadani decide ayya endukante juttu peragadam ledu :( ma amma ayithe ippudu evvaru chusina poni vesukuntunaru nuv kuda ala cheyinchuko antadi naku rendu ishtam ani cheptanu
జుట్టు మీద మోజు లేని వారెవ్వరు చెప్పండీ. కానిదానికోసం కష్ట పడటం అమ్మో ఆ మోజునుకాస్తా చంపేస్తుంది కదా. :-) బాగుంది వీడియో.
రిప్లయితొలగించండిమీ సలహాలకి ,సుచనలకి ధన్యవాదాలు శ్రీ గారు.
రిప్లయితొలగించండిశిశిరగారు,మురళిగారు ,ధన్యవాదాలండి.
@పరిమళ ధన్యవాదాలు.
@భాను,ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@మాలాకుమార్,ఐతే మీరూ నా టైపే నన్నమాట .
@స్వప్న గారు ,మీరన్నట్టు ఒక్క రోజులో పొడవు జడైపోతే ఎంతబాగుంటుందో కదా!
భావన గారు,మీరన్నది నిజమేనండి. వీడియో నచ్చినందుకు థాంక్సండి.
రాధిక గారూ,
రిప్లయితొలగించండిపొడుగు జడ తో బాధలు బోల్డున్నాయండీ. తలంటు పోయాలి, ఆరబెట్టాలి, మా అమ్మాయికి ఒకటిన్నరడుగుల ఒత్తైన జడ. (నాది పిలకే లెండి). దానికి చిక్కులు తీసి, నూనె రాసి జడలు వేసి స్కూల్ కి పంపటానికి నాకు రోజూ 15 నిమిషాలు పడుతుంది. పైగా.. ఒక పూట సరదాకి విరబోసుకుందా.. నా పని అయ్యింది. చిక్కులు తీసి ఒక కొలిక్కి తెచ్చేటప్పటికి పని అయిపోతుంది.
ఒక పెద్ద రహస్యం చెప్తాను వినండి. కాస్త పెద్దయ్యాక జుట్టు తెల్లబడిందా? జుట్టు రంగుకోసం అయినా అప్పుల పాలవక తప్పదు :-)
అందుకని హాయిగా పిలక జుట్టే బెస్ట్! (అందని ద్రాక్ష పుల్లన)
నాది సేం బాధ అండీ.... మొన్నటిదాకా పొడవుగా ఉన్న జుట్టుని వెంట్రుకలు చిట్లుతున్నాయని కట్ చేయిద్దామని పార్లర్ కి వెళితే..ఆ దేవత సగం కట్ చేసి ఇక పో! అంది...ఏడుపొచ్చింది నా జుట్టు చూసుకుని....ఆ రాక్షసి ని తిట్టే టైం లేక వచ్చెసా!!! కాని మళ్ళి అంత జుట్టు రావాలంటే కష్టమేమో... :( సో నేను మీలాగే పొడుగు జుత్తు ఉన్న అమ్మయిలని చూస్తూ ఉండిపొవాలేమో!!
రిప్లయితొలగించండి@కృష్ణప్రియ,మా అమ్మాయిది ఒత్తైన జుట్టేనండి.హాస్టల్ నుంచి ఇంటికొస్తేసేం మీ కష్టాలే నావీను.ధన్యవాదాలండి.
రిప్లయితొలగించండిఅయ్యయ్యో ఇందుగారు . .
రాధికా జుట్టు గురించినపోస్ట్లు చదువుతుంటే ఏడుపొచ్చేస్తుంది..ఇంత పొడవు జుట్టు ఎలా మాయం అయిపోయిందో ఏమో ... పిలక జుట్టు జడ అల్లుకోలేను ,ముడివేయలేను ...
రిప్లయితొలగించండిkrishna priya గారు మీ అందని ద్రాక్ష బాగుందండోయ్ ..అలా అనుకుని సంతృప్తిపడతా ..ఏం చేస్తాం
ప్రస్తుతం నా పరిస్తితీ అదేకదా:( ...నేస్తం గారు బాధపడకండి :).ధన్యవాదాలండి .
రిప్లయితొలగించండి