=''/>

1, ఆగస్టు 2013, గురువారం

ఎలాగైతే ఈ పిల్లల్ని పట్టేసా!!


 అసలు సెలవలు ఎందుకో కూడా తెలవదు ఈ పిల్లలకి .మొన్నటి వరకూ ఎలక్షన్ సెలవలు .ఇప్పుడు బంద్ వల్ల సెలవలు .

వీళ్ళు  హాయిగా  రోడ్లమీద సైకిల్ పందాలు ,  టైర్లతో పరుగు పందాలు పెట్టుకుంటూ , అల్లరి చేస్తూ ఆడుకుంటున్నారు.

 పిల్లలు అలా టైర్ల తో పరుగులు పెడుతూ ఆడుకుంటుంటే   చూడడం చాలా ఇష్టం నాకు.వాళ్ళని ఫోటో తీయడానికి చాలా సార్లు ట్రై చేశా కానీ  ,వాళ్ళని చూసి లోనికెళ్ళి  కెమేరా తెచ్చేటప్పటికి   వెళ్లిపోయేవాళ్ళు.

 ఈ రోజు వాళ్ళు మా ఇంటి దగ్గరలో  ఆడుకోవడం చూసి  ఎలాగైతే వాళ్ళని నా కెమేరాతో పట్టేసా ...మీ ముందు పెట్టేసా..

















25 కామెంట్‌లు:

  1. మీ ఫోటోలు చాలా బాగున్నాయి రాధిక గారు...మీరు గమనించారో లేదో మీలో ఒక అద్భుతమైన ఫోటో గ్రాఫర్ ఉన్నారు.

    రిప్లయితొలగించండి
  2. బాగున్నాయి రాధిక గారూ !బంగారు బాల్యం .ఏది ఎందుకు జరుగుతుందో తెలియని ,ఆ వయసే ఎంతో హాయి .

    రిప్లయితొలగించండి
  3. బాగున్నాయి రాధిక గారూ !బంగారు బాల్యం .ఏది ఎందుకు జరుగుతుందో తెలియని ,ఆ వయసే ఎంతో హాయి .

    రిప్లయితొలగించండి

  4. ఆనందానికి నిదర్శనంలా ఉన్నారండీ ఆ పిల్లలు!
    ఒకటి మాత్రం నిజం, రాధిక గారు.. ఇంక కనబడవనుకునే ఇలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలనీ, కాలుష్యం పొరలు కప్పని ప్రకృతినీ మీ వల్లనే మళ్ళీ చూడగలుగుతున్నానండీ! థాంక్యూ...

    రిప్లయితొలగించండి
  5. ఆనందానికి నిదర్శనంలా ఉన్నారండీ ఆ పిల్లలు!
    ఒకటి మాత్రం నిజం, రాధిక గారు.. ఇంక కనబడవనుకునే ఇలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలనీ, కాలుష్యం పొరలు కప్పని ప్రకృతినీ మీ వల్లనే మళ్ళీ చూడగలుగుతున్నానండీ! థాంక్యూ...

    రిప్లయితొలగించండి
  6. కూల్ ఫొటోస్ :)
    రెండో ఫోటోలో పింక్ షర్టు అబ్బాయి, మహేష్ బాబు రన్నింగ్ స్టైల్ తో పరిగెడుతున్నాడు :)

    రిప్లయితొలగించండి
  7. హ్హ హ్హ మహేష్ బాబు స్టైల్ లోనా ..నేనూ గమనించలేదండి.మిరన్నాక చూస్తే కాస్త అలా అనిపించింది.చేతులు అలాగే పెట్టి పరిగెట్టేడు కదా .ధన్యవాదాలు హర్షాజి

    రిప్లయితొలగించండి
  8. బాగున్నాయండి ఫోటోలు, మీరు గమనించే ఉంటారు, కింది నుండి రెండో ఫోటోలో ముందున్న అబ్బాయి ఎడమ కాలు ఏమయిపోయిందండి?

    రిప్లయితొలగించండి
  9. అవునండి కాలు టైరులో కలిసిపోయింది ...ధన్యవాదాలండి

    రిప్లయితొలగించండి
  10. ఓహో, కాలు వెనక టైర్ ఉందా..... ఇప్పుడు అర్థం అయింది థాంక్స్

    రిప్లయితొలగించండి
  11. ఎంత హేపీ గా ఉన్నారండీ వీళ్ళు...ఏమీ తెలియని బాల్యం...ఎంత అదృష్టమో కదా...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండి నిర్మలమైన వాళ్ళ మొహాల్లోని ఆ నవ్వులే చెపుతున్నాయి వాళ్ళ ఆనందాన్ని.ధన్యవాదాలు.

      తొలగించండి
  12. మిత్ర దినోత్సవ శుభకామనలు, సాగించండి, బావుంది.

    రిప్లయితొలగించండి
  13. తిరిగి రాని బాల్యం జ్ఞాపకాలే మిగిలాయి .
    ఇలాంటివి చూసినప్పుడు అప్రయత్నం గానే కళ్ళు చెమ్మగిల్లుతాయండి.
    కాకపోతే అప్పుడు మేము సైకిల్ టైర్ తో ఆడే వాళ్లము .
    ఇప్పటి పిల్లలు అభివృద్ధి చెందారు .బైక్ టైర్ లు వాడుతున్నారు .

    రిప్లయితొలగించండి
  14. రోజులుమరాయి కదా! అందుకే ఈ మార్పు :) ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. మీ బ్లాగ్ చూస్తుంటే మనసు బాల్యం లోకి వెళ్ళిపోయింది వారి అనందం అంతే చక్కగా ఫోటోలు తీసిన మీ ప్రతిభ రెండు ముచ్చటగా ఉన్నాయి

    రిప్లయితొలగించండి