=''/>

13, ఆగస్టు 2013, మంగళవారం

తాటి కాయలు - తాటి రొట్టె

ఈ రోజుల్లో తాటి  చెట్ల క్రింద  ఎక్కడ చూసినా తాటి పళ్ళు రాలి పడుంటాయి.  


మా పొలాల్లో  ఐతే అవలా రాలి పోయి పోవాలి లేదా పాలేళ్ళన్నా పట్టుకుపోవాలి  కానీ ఎప్పుడూ పెద్ద శ్రద్ద  ఇంటికి తీసుకురారు . మేం చెప్పగా చెప్పగా తెస్తారు. 





మొన్న మా  సాయి , చరణ్ (చెల్లి కొడుకు) పొలం వెళ్ళినప్పుడు తాటి చెట్ల క్రింద అలా రాలి పడిన తాటి పళ్ళను చూసి వాసన బాగుంది  ,కాయలు కూడా బాగున్నాయి ,ఏమి చేస్తారు వీటితో అని మా నాన్నగారిని  యక్ష ప్రశ్నలన్నీ వేసారట.  పిల్లలు ఇంటికి వస్తూ వాటిని కూడా ఇంటికి తెచ్చారు .

మా చిన్నప్పుడు  జేజమ్మ  తాటి పళ్ళను   కుంపట్లో   కాల్చి ఇచ్చేది.కాయంతా కుంపట్లో పెట్టి ,గుండ్రంగా కాలేవరకు తిప్పుతూ కాల్చేది.బాగా కాలిపోయాక  పైతొక్క తీసేసి  లోన టెంకకున్న గుంజు కోసం  పీచును పళ్ళతో పీకుతూ తింటుంటే భలే తమాషాగా ఉండేది . రుచైతే  ఇక చెప్పక్కర్లేదు.అమ్మ  తాటి రొట్టె ఎక్కువగా చేసేది. 




పిల్లలు  తెచ్చినందుకైనా  వాటితో  ఏదోకటి చెయ్యాలని కుంపట్లో కాల్చడమైతే కుదురుతుందో లేదో అని  నేనూ ,చెల్లీ  తాటి రొట్టె  చేయాలని డిసైడయ్యాం .




కానీ ఆ కాయలనుండి  గుజ్జు తియ్యడం పెద్ద పని.గుజ్జు తీసాక దానిలో సరిపడా వరి నూక ,కాస్త వరి పిండి ,కొద్దిగా బెల్లం కలిపి నాలుగైదు గంటలు నాన బెట్టుకుని ,చిన్న మంటపై  మూకుడులో  రొట్టెల్లా  వేసేం   .


ఇదే మొదటిసారి నేను (మేం)  తాటి రొట్టె చేయడం .ఎవరి సలహాలు,సూచనలు లేకుండా అమ్మ ఎలా చేసేదో గుర్తుతెచ్చుకుని చేసేం . .అమ్మ చేసినట్టే వుంది రుచి అని నాన్నగారి మెచ్చుకోలుతో చాలా సంతోషం.మొదటి సారైనా  బాగా వచ్చిందని రుచి చూడమని   అందరికి తలోముక్క పంపేసేం .. 


ఇంతకీ ఇంటికి తాటి పళ్ళు మోసుకొచ్చిన పిల్లలకి మాత్రం  పెద్ద నచ్చలేదట .పైగా వాసన చాలా బాగుంది కానీ తినడానికి అంత బాగోలేదని కామెంట్లు!



మరి చూడటానికి ఎలా ఉంది ??

32 కామెంట్‌లు:

  1. మీ బ్లాగు చూస్తే మా ఊరిని మిస్సవుతున్నానన్న బెంగే ఉండదు రాధిక గారూ. :)

    రిప్లయితొలగించండి
  2. చూడటానికి బాగుందండీ. మా పల్లెటూరు తోలేరు (ప. గో. జిల్లా) ను గుర్తు చేశారు.

    రిప్లయితొలగించండి
  3. మా నాయనమ్మ బాగా చేసేది ఇవి. ఇప్పటికీ మాకు తాటి కుడుములు..బూరెలు చేస్తారు. పండిన తాటి కాయ తిని ఎన్ని సంవత్సరాలయిందో! తినేటప్పుడు బాగానే ఉండేది..తర్వాత ఆ గుజ్జంతా పళ్లల్లో ఇరుక్కుని తీసుకోవటానికి నానా ఇబ్బందులూ పడేవాళ్ళం:)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తాటి కుడుములు ,బురె లు మాకు చేస్తారు , ఎవరినన్నా అడిగి ఈసారి తెచ్చినప్పుడు ట్రై చెయ్యాలి.అవునండి అలా పళ్ళల్లో ఇరుకున్న పీచు తీసుకోవడం పెద్దపని లా ఉండేది .ధన్యవాదాలు

      తొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  5. మొన్ననెపుడో నేను రాద్దామనుకుని మరిచిపోయాను. బాగా రాశారు. రొట్టె తింటే అరగడం కష్టం. గుజ్జు తినేస్తే బాగుంటుంది :)

















    రిప్లయితొలగించండి
  6. మంచి దోరగా బాగా కాలింది రొట్టె,రాధిక గారు నోరూరిపోతుంది .ఇప్పటి పిల్లలకు నచ్చడంలేదు .5starsకు కుర్ కురే లకు అలవాటుపడిిపోయారు .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా రొట్టె మీకు నచ్చినందుకు ధన్యవాదాలు...అవునండి వాళ్ళను తినమని బ్రతిమలాడి లాడి అలసిపోయి మేమే తినేసేం ......:))

      తొలగించండి
  7. ఫోటోలు రొట్టె కూడా భలే కలర్ ఫుల్ గా ఉన్నాయండీ.. నా చిన్నప్పటి రోజులుని గుర్తు చేశారు, మా ఇంట్లో బూరెలు చేసేవారనుకుంటా నాకు సరిగా గుర్తులేదు కానీ ఇవి కాల్చుకుని తినడం, కొన్ని బుర్రలతో బండి కట్టడం చేసేవాళ్ళం అవి మాత్రం గుర్తున్నాయ్.

    రిప్లయితొలగించండి
  8. భలే గుర్తు చేసారు.
    మా చిన్నప్పుడు అమ్మమ్మగారింటికి పేరుపాలెం వెళ్ళినపుడు తినేవాళ్ళం. మాకైతే ఇదో పనిష్‌మెంట్‌లా ఉండేది. కొంచెం వగరుగా, అదో రకమైన రుచి. ఇక తాటిపండు తినడమంటే ఇంకా కష్టం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. :) ఇష్టపడి తినేవాళ్ళకు బాగా నచ్చుతుంది కానీ చాలా మందికి ఆ రుచి పెద్దగా నచ్చదు .ఈ రోజుల్లో పిల్లలైతే చెప్పక్కర్లేదు.ఆరోజుల్లో పొలంలో పడిన తాటి పండును అలాగే పగల గోట్టుకుని తినేసేవాళ్ళం చిన్నప్పుడు అని.మా తాతగారు అస్తామాను అంటారు .......ధన్యవాదాలండి

      తొలగించండి
  9. ఆహా, చూడటానికి భలేగా వుంది,
    ఇలాంటివి తిని ఎరుగను, కనీసం చూడను కుడా లేదు..(మా ఊరి చుట్టుపక్కల తాటి చెట్లు లేకపోవడమే కారణమేమో)
    అంచేత, నాకు ఒక నాలుగు పార్సెల్ పంపండి ప్లీస్ :))

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజ్జంగానా ?? పల్లెటూర్లలో ఉండే అందరూ చేసుకుంటారిలా అనుకుంటున్నాను.మీ ఊళ్ళలో తాటి చెట్లే ఉండవా??తప్పకుండా పంపుతా పార్సిల్ నాలుగు చాలా :)) మీరు ఇండియా కి వస్తే ఈ రోజుల్లోనే రావాలి మరి ...థాంక్స్ బాబు

      తొలగించండి
    2. నిజ్జంగా నిజం రాధిక గారో, మా ఊరి పరిసర ప్రాంతాల్లో అంటే మాఊరికి 40-50 కి.మీ పరిధిలో తాటి చెట్లు లేవండీ, మా ఊరి వైపు ఈత చెట్లు ఎక్కువ, మీ వైపు తాటి కాయలతో చేసే వెరైటీస్ అన్నీ మా వైపు ఈత కాయలు/చెట్లతో చేస్తారు. అయితే మా ఇంట్లోకి ఈత పదార్థాలు నిషిద్దం, (గోత్రం కాబట్టి) :)

      తొలగించండి
  10. ఏంటి??ఈత పళ్ళ తో కూడా చేసుకుంటారా ??ఏం గోత్రం ఐతే ఆ పళ్ళు తినరా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈత చెట్టు మొదలు లో ఏదో కొబ్బరి లాంటి పదార్ధం ఉంటుందట, తినడానికి రుచికరంగా ఉంటుందని అంటుంటారు. మీవైపు తాటి కల్లులాగా, మావైపు ఈత కళ్ళు వుంటుంది. గోత్రం కాదు కానీ, ఎందుకో మేము ఈత బుట్టలు, చాపలు, వాడరు, ఈతకాయలు కుడా తినకూడదు (అని పెద్దోళ్ళు చెబుతుంటారు, కారణం అడిగితే ఏవో చెబుతారు). ఎప్పుడో చిన్నప్పుడు దొంగగా తిన్న ఈత పల్లె :))

      తొలగించండి
  11. నేను ఇంతవరకు ఇలాంటి రొట్టె ఉంటుందని వినలేదండి . మా వూర్లో వేస్ట్ గా పారేస్తారు పండ్లని. కలర్ ఫుల్ గా , చూస్తుంటేనే నోరూరి పొతుంది . చేసే విధానం చెప్పారు . ప్రయత్నించి చూస్తా ( నాకు వంట అలవాటే లెండి ) !!!

    రిప్లయితొలగించండి
  12. నా చిన్నపుడు తాటి ముంజెలు తినేవాణ్ణి, రుచిగా ఉండేది. అలాగే అది ముదిరిపోయాక, మీరు ఫోటో తీసారు కదా అలాటి తాటి ముంజే ను నిప్పు కొలిమిలో కాల్చి తింటుంటే అబ్బో ఆ రుచి వర్ణనాతీతం. ఇలా రొట్టెలు చేసుకోవచ్చని మీ టపా చూసాకే తెలిసింది

    రిప్లయితొలగించండి
  13. రొట్టె భలే ఉందండి ... దీని గురించి విన్నాను కాని ఎప్పుడు తినలేదు ఇలాంటపుడు మాత్రం మేము గోదావరి వాళ్ళం కాదు కృష్ణ అని తప్పించుకుంటూ ఉంటాను ( అమ్మ కృష్ణ నాన్న గోదావరి కాబట్టి )

    రిప్లయితొలగించండి
  14. :) ఐతే మీరూ మా ప.గో.జిల్లా వారే ! రొట్టె చూడటానికే కాదండి తినటానికి కూడా బాగుంటుంది . ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి