హాయ్ !అందరూ వినాయక చవితి బాగా జరుపుకున్నారా? బుజ్జి బొజ్జ గణపతికి ఉండ్రాళ్ళు ,కుడుముల నైవేద్యాలన్నీ బోజ్జనిండా పెట్టేరా?
మా ఊరి లోనూ జరుగుతున్న గణేశుని నవరాత్రి ముచ్చట్లూ చదవండి మరి..
ఈ సంవత్సరం మా ఊరి కుర్రాళ్ళు మంచి జోరుగా గణపతి ఉత్సవాలు జరిపించేస్తున్నారు.ఇక ఈ తొమ్మిది రోజులూ మైక్ ఫుల్ సౌండ్ లో పెట్టి మా చెవుల్లో తుప్పు వదిలించేస్తారు .చందాలు బాగా వసూలవడంతో ఆఖరి రోజు ఊరేగింపుకే ముప్పైఐదు వేలు ఖర్చు పెడుతున్నారు .(మా వారు కుర్రాళ్ళకు హెడ్ లాంటివారు కావడంతో ఇటువంటి విషయాలు నాకూ తెలుస్తాయనమాట).ఇంకా మ్యూజికల్ ఆర్కెష్ట్రా ,ఇలా ఒకటో రెండో ప్రోగ్రామ్స్ పెట్టారు .మా ఊళ్ళో ప్రోగ్రామ్స్ చేయడానికి ఒకసారి వచ్చిన వాళ్ళు ఇంకోసారి రావడానికి ఇష్టపడరెమో అనిపిస్తుంది .ఎందుకంటే ఊరు చిన్నది కావడంతో ఏ ప్రోగ్రాం జరిగినా చూడడానికి వచ్చేవాళ్ళు గట్టిగా లెక్కేస్తే వంద మందికి మించరు.మ్యూజికల్ ఆర్కెష్ట్రా లాంటివైతే మా పక్కఊళ్ళ నుండికూడా చూడడానికి వస్తారు .ఐనా ఎంతకంతే...జనం లేకుంటే వాళ్ళ కు హుషారు ఎక్కడుంటుందండీ....
తొమ్మిది రోజులూ పూజలందుకున్న మా వినాయకుడి నిమజ్జనానికి ఉరేగింపు చాలా బాగా జరుగుతుంది.ఉళ్ళో ఇంచుమించు అందరి ట్రాక్టర్లు ఊరేగింపులో పాల్గొంటాయి.ఉన్నవి నాలుగు వీధులైనా ఉదయం మొదలుపెట్టిన ఉరేగింపు సాయంత్రం ఐనా అవ్వదు.
మా గణేశుని ఉరేగింపు చిత్రాలు మీకూ చూపించడానికి ట్రై చేస్తానండి...తరువాత టపాలో .
.
bagundi alankarana
రిప్లయితొలగించండిఎంతైనా పల్లెటూళ్ళల్లో ఏ పండుగలైనా బాగుంటాయండి. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మరి,మీ ఊళ్ళో ఊరేగింపు ఫొటోల కోసం ఎదురుచూస్తాను.
రిప్లయితొలగించండిumm..బాగుంది మీ ఊరిలో విగ్రహం , కొంచం విగ్రహం చిన్నగా ఉన్నట్లుంది
రిప్లయితొలగించండిథాంక్స్ స్వప్నగారు.@జయగారు,అలాగేనండి మీ కోసమైనా ఫోటోలు పెడతాను
రిప్లయితొలగించండి@ప్రియమైన, విగ్రహం ఎత్తు ఐదడుగులేనండి .