=''/>

20, సెప్టెంబర్ 2010, సోమవారం

మా ఊళ్ళో గణపతి నిమజ్జనాని కై కన్నుల పండుగగా జరిగిన ఉరేగింపు దృశ్యాలు .

నిన్న మా ఊళ్ళో గణపతి నిమజ్జనోత్సవం చాలా బాగా జరిగింది.ఆదివారం కావడంతో .పిల్లలంతా కూడాఎంతో ఉత్సాహంతో ఈ సంబరంలో పాల్గొన్నారు .మేళ తాళాలతో ,విచిత్ర వేషదారుల విన్యాసాలతో వినాయకుని విగ్రహం ఉంచిన ట్రాక్టర్ వెళుతుంటే,.వినాయకుడు, సీతా రాములు,శివపార్వతులు,భాలరామ కృష్ణులు, దుర్యోధనుడు,బీముడు,షిరిడి సాయి,లవకుశులు,,నారదుడు,అల్లూరిసీతారామరాజు(,ఇంకా రెండో ,మూడో వేషాలున్నాయనుకుంటున్నాను......గుర్తులేదు.)వేషాలేసిన వారు ఉన్న ట్రాక్టర్లు కుడా అనుసరించాయి.


ఇంకో విషయమండోయ్ ..........వేషాలేసిన వారంతా మా ఊరే నండి. పైగా నేనంటే నేనని అందరూ పోటీ పడి మరీ వేసారండి. మా బాబు లవకుశుల లో ఒకటి వేస్తానని అన్నాడు కానీ జత సరిగ్గా కుదరక వద్దన్నారు. కొంచెం నిరుత్సాహ పడ్డాడనుకోండి .ఐనా నిన్న ఆదివారం కావడంతో తను అందరితోను ఏంతో ఉత్సాహంగా తిరిగేడు.ఉదయం పదకొండింటికి మొదలుపెడితే రాత్రి పది గంటలకు కానీ ఈ నిమజ్జనోత్సవం పూర్తవలేదు. ఎటువంటి ఆటంకం కలుగకుండా జయప్రదంగా నిమజ్జనోత్సవ ఉరేగింపు జరిగింది..







ట్రాక్టర్లు తో నిండిన వీది .


సీతా రామ లక్ష్మణులు .

అల్లూరి సీతారామరాజు .

శక్తి వేషం






4 కామెంట్‌లు:

  1. ఊరేగింపు ఫోటోలు బావున్నాయండీ ....మా అమ్మమ్మగారి వూరిలో రాములవారి, గౌరమ్మ సంబరాలు గుర్తుకొచ్చాయి అప్పుడు ఇలాగే ఊరేగింపుతో వేషాల బళ్ళు వస్తాయి.

    రిప్లయితొలగించండి
  2. బాగున్నాయండి, మీ ఉత్సవాలు. ఎంతైనా పల్లెల్లో ఉన్న సంబరాలే వేరు.

    రిప్లయితొలగించండి