=''/>

10, మే 2014, శనివారం

గిజిగాళ్ళు -గూళ్ళు

మా ఇంటి పక్కనున్న కొబ్బరి తోటలో ..  ఈ మధ్య  ఉదయమే  బోల్డన్ని పిచ్చుకలు   సందడి సందడి గా  ,కిచ కచలాడుకుంటూ  అటూ ఇటూ ఎగురుతూ కనిపిస్తున్నాయి. ఇదివరకు ఇంతిలా  కనపడలే.. వినపడలే .. ఏమిటా అని ఓ రోజు కాస్త నిశితంగా గమనించి  .. పరికించి చూస్తే  ...   

ఇవిగో ఈ గిజిగాళ్ళ దన్నమాట  ఆ సందడి ! కొబ్బరాకుల్ని  సన్నని  ఈనెల్లా చీల్చుకుని ఈ గూళ్ళు కట్టుకుంటున్నాయి .. ఓ రోజు వట్టినే ఎలా గూళ్ళు కట్టుకుంటున్నాయో  చూద్దామని వెళ్ళా . నేనున్నా ఐదు  నిముషాల్లోనే  సగం  గూడు  కట్టేసిందో గిజిగాడు !

 ఈ రోజు  మబ్బు  మబ్బుగా  ఉంది  . మళ్లీ వర్షం పడితే అవుంటాయో వేరే చోటకి వెళ్ళిపోతాయో  అనుకుని   బద్దకించకుండా వెళ్లి  వాటిని  అట్టే విసిగించకుండా   ఐదు నిముషాల్లో ఓ పది స్నాప్స్  తీసుకుని వచ్చేసా .. 
అమ్మో ఐదు నిముషాలు మెడ పైకెత్తి వాటిని ఫోటోలు తీసేప్పటికి  నా మెడ పట్టేసింది .. కాసేపట్లో సర్దుకుంది లెండి. 

    భలే చిత్రం కదా వాటి నైపుణ్యం !  



















16 కామెంట్‌లు:

  1. నేతగాళ్లు పట్టుచీర నేసినట్టు...
    ఈ గిజిగాళ్లు గూళ్లను ఎంచక్కా భలే అల్లుతాయండీ.
    చిన్నప్పుడు విల్లంబులు ధరించి వీటి వేటకు వెడలేవాళ్లం. ఎక్కుపెట్టిన బాణాలు గూళ్లల్లో గుచ్చుకుని, అక్కడే ఇరుక్కుపోయి, పిచ్చుకలు దొరక్క, బాణాలు వెనక్కిరాక, బిక్కమొహాలేసుకుని ఇంటికొచ్చేవాళ్లం :-)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగ్ రాజ్ గారు గిజిగాళ్ల కోసమే విల్లంబులు ధరించేవారా ...బావుంది మీ జ్ఞాపకం :)

      తొలగించండి
  2. ఎంత బాగున్నాయో గిజి గాళ్ళు ,వాటి గూళ్ళు .వాటి ని కట్టడం లో ఎంత నైపుణ్యం ! మీ శ్రమ కి జోహార్లు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ అజ్ఞాత గారు .ఈ సారి కామేంట్ రాసినప్పుడు మీ పేరు కూడా రాయండి

      తొలగించండి
  3. చాలా బాగున్నాయి గిజిగాడి కబుర్లు, ఫొటోలు. ఇండియన్ బార్డ్స్ అనే ఫేస్ బుక్ గ్రూప్ ఉంది చూడండి. మీకు నచ్చుతుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ వర్మ గారు ..అప్పుడప్పుడూ చూస్తుంటానండీ

      తొలగించండి
  4. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి