=''/>

22, అక్టోబర్ 2009, గురువారం

పోషకాలు మెండుగా వుండే శ్రీ ఫలం .

కొబ్బరికాయను అందరూ శుభప్రదముగా భావిస్తారు. మనదేశములో శుభకారార్యాలకు కొబ్బరికాయ తప్పనిసరి.కొబ్బరికాయ లేని పండుగ లేదంటే అతిశయోక్తి కాదు.కేరళీయులకైతే రోజూ అన్నింటిలోనూ కొబ్బరికాయ ,కొబ్బరినూనె తప్పనిసరిగా వుండి తీరవలసినదే .వారి ఆరోగ్యమూ ,సంపదా కొబ్బరిపంట మీద అదారపడివున్నాయి .కోట్లాదిమంది జనం కొబ్బరిపంటనే జీవనాదారం చేసుకుని వుంటున్నారు .
కొబ్బరికాయలో నలబైతొమ్మిది శాతం లారిక్ యాసిడ్ వుంటుంది .ఇది తల్లి పాలకు దాదాపు సరిసమానం అంట. కొబ్బరినూనెలో వుండే పాటియాసిడ్స్, వైరల్ ,ఫంగల్ ,బ్యాక్టీరియల్ వంటి మానవజాతి ఎదుర్కునే రుగ్మతలను తగ్గించడములో సహాయపడతాయి. పోషకాలతో కూడిన ఆహారాన్ని ,పానీయాన్ని అందిచడముతో పాటు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది .కొబ్బరిచెట్టు లో ప్రతీ భాగము అన్నిరకాలగాను ఉపయోగపడుతొంది .అందుకే దీనిని మానవుల పాలిట కల్పవృక్షము అంటారు .
మీకు తెలుసా ? కొబ్బరికాయకు కూడా ఒక రోజు ఉందని .అదే ప్రపంచ శ్రీ ఫల దినోత్సవము (కోకోనట్ డే)ప్రతీ సంవత్సరము సెప్టెంబర్ రెండు న జరుపుతారు .

3 కామెంట్‌లు:

  1. శ్రీఫల దినోత్సవం గురించి చెప్పినందుకు ధన్యవాదాలు. కొత్త విషయం తెలుసుకున్నాను.

    రిప్లయితొలగించండి
  2. అయినా శ్రీ ఫలానికి సంవత్సరానికో రోజేంటండి వీళ్ళ పిచ్చి కాకపోతే, ప్రతిక్షణం శ్రీ ఫలానిదే.

    రిప్లయితొలగించండి
  3. అవునండి.కొబ్బరికాయను మనము వుపయోగించినట్టు ఏ దేశము లోనూ వుపయోగించరు.పండుగలకు,శుభకార్యాలకు,ఆహారపదార్దాలలోనుదేనికైనావుండాల్సిందే.

    రిప్లయితొలగించండి