=''/>

2, నవంబర్ 2009, సోమవారం

బ్లాగ్ వనంలో వనభోజనాలు -గుమ్మడికాయ దప్పళం .

మా వైపు ఫంక్షన్లలో ఎక్కువగా గుమ్మడికాయ దప్పళం వండుతారు.
దీనికీ కావలసిన పదార్దాలు ...
గుమ్మడికాయ -చిన్నది ఒకటి .
ఉల్లిపాయలు -రెండు .
పచ్చిమిర్చి -ఆరు
బెండకాయలు -పది .
టమాటాలు -మూడు .
ములక్కాడ -ఒకటి .
వంకాయలు -రెండు .
కొత్తిమీర-ఒకకట్ట .
పోపు పెట్టుకోవడానికి ..
మెంతులు -అర స్పూను
ఆవాలు -అరస్పూను
జీలకర్ర -అరస్పూను

ఎండుమిరపకాయలు-నాలుగు.కరివేపాకుకొద్దిగా .
చింతపండు కొద్దిగా .
బెల్లం కొద్దిగా .
తయారుచేసేవిదానం .....
..
స్టవ్ మీద గిన్నె పెట్టి వెలిగించి దానిలో నీరు పోసి,గుమ్మడికాముక్కలువేయాలి .అవి ఉడుకుతుండగా , ముక్కలుగాకోసుకొన్న కూరగాయముక్కలు దానిలోవేయాలి. ఉల్లిపాయలను చీరికలుగా కోసుకోవాలి.అవి, పచ్చిమిర్చి ముక్కలులుకూడా వేసుకోవాలి .కొద్దిగా వుడికాక ,కారము ,ఉప్పు ,పసుపు వేసుకొని,చింతపండుపులుసు ,బెల్లముకొద్దివేసుకోవాలి.కాసేపు ఉడికేక స్టవ్ కట్టేసుకొని తాలింపు పెట్టుకొని ,కొత్తిమీర జల్లుకోవాలి .

దీనిని ముద్దపప్పులొకలుపుకొని తింటే ఉంటుందీ ..........

పపపపప్పు ..దప్పళం ......వేడి వేడి అన్నం మీద....కమ్మనిపప్పు కాచిన నెయ్యి ...కలిపితే ..భొజనం వనభొజనం ......

9 కామెంట్‌లు:

  1. dappalam gurinchi vinatamae kaani eppuduu chuudalaedu , tinalaedu .

    ippudu meeru cheppaarugaa , chaesi chuustaanu .

    రిప్లయితొలగించండి
  2. దప్పళం--ఎన్నాళ్లయిందో తిని..మా నాయనమ్మ చేతి దప్పళం రుచే వేరు..మా ఊర్లో అందరూ భోజనాలప్పుడు ఆమె చేతే దప్పళం పెట్టించుకునేవారు (అప్పట్లో వంటవాళ్లు వండటం, క్యాటరింగులు ఇవేవి లేవు లేండి). ఆ వాసన తలుచుకుంటేనే పొట్ట నిండిపోతుంది.

    రిప్లయితొలగించండి
  3. మీరు తయారు చేసిన దప్పళం ఫొటో కూడా ఇక్కడ పెట్టుంటే మేము లొట్టలేస్కుంటూ అది చూస్కుంటూ అన్నం తినేవాళ్ళం ( అహనా పెళ్ళంట లోలా) ...చాలా బాగుందండి...

    రిప్లయితొలగించండి
  4. రధిక గారు,
    దప్పలం అన్నా అప్పడం అన్నా ఒకటెనా చిన్న డౌటు!

    రిప్లయితొలగించండి
  5. భవానిగారు,,
    కాదండి. దప్పళం పులుసులాంటిది.

    రిప్లయితొలగించండి
  6. ఎన్నాళ్ళైందో అసలు దప్పళం అనే మాటే విని. దానిని తయారుచెయ్యడం కూడా ఎంచక్కా చెప్పారు. బాగుంది. తప్పకుండా చేస్తాను.

    రిప్లయితొలగించండి