
మేము గత మూడేళ్ళ నుండి ప్రతి సంవత్సరము వనభోజనాలు ఎవరో ఒకరిపోలములో పెట్టు కొంటున్నాము .ఇప్పుడు మా కొబ్బరితోటలోపెట్టుకొన్నాము .అంతా కలసి ఓయాభైమందయ్యాము .
మేము (అంటే నేను , రజనిఅని నాకజిన్ ,మాకు అత్తగారు అవుతుంది ( కానీచిన్నదే )రత్నం అని తను ,)ముగ్గురమే అన్నీ చూసుకొన్నాము. ముందు రోజు రాత్రిపనస పొట్టుకూర ,కొత్తిమీర పచ్చిచింతకాయపచ్చడి చేసేసుకొన్నాము.( పనసపొట్టుకూర మరునాడుకి వూరి బాగుంటుంది.).అలాగే మిగతా కూరగాయలు అన్నీసిద్దము చేసుకొన్నాము.
ప్రొద్దుటే వంటమనిషి ,నలుగురు సాయం చేసేవారు వెళ్లి ,మేము అందరమూ వెళ్ళే టప్పటికి వంటకానిచ్చేసారు. ఆరోజు మా మెనూలో ఇంకా యేమిటంటే ...దొండకాయ వేపుడు , కాలీఫ్లవర్ చిక్కుడు ,గుమ్మడికాయదప్పలము, పప్పు ,వుసిరికాయ పచ్చడి .స్వీట్ పాలతాలికలు ,హాట్ పచ్చిమిరపకాయ బజ్జి .
ఇక,మాకు పనేమి లేదు .మేము వెళ్లిన వారిని పెద్దవాళ్ళు ,పిల్లలుగా విడదీసి వారినందరినీ ,మ్యూజికల్ చైర్స్ ,స్పూన్లో నిమ్మకాయ ఆటలు ఆడించాము (మేము కూడా ఆడాము అనుకొండి.) .పెద్దవాళ్ళు అలవాటులేక మేము ఆడము అన్నారు కానీ ఎలాగో ఆడించేసాము .
మేము అందరమూ ఆడవాళ్లమే వెళ్లాము .కావాలనే వెళ్ళాము.మగవాళ్ళు వుంటే సరిగా ఆటలుఆడరు,సిగ్గుపదతారని.. కడుపులో ఎలుకలు పరిగెట్టేవరకూ అలా ఆడుతూనే వున్నాము. కాసేపటికి అందరికి సిగ్గు ,బిడియమూపోయి లైన్లో పడ్డారు. తరువాత కబాడీ ,కో కో ఇలామాయిష్టమొచ్చిన ఆటలన్నీ... అలసిపోయేవరకూ ఆడుతూనే వున్నాము. టైము కూడాతెలియలేదు .అసలే సీతాకాలము కదా ,ఐదున్నరకే చీకటిపడిపోయింది.అందరమూ చాలాబాగా గడిపాము. అందరూ... అప్పుడే వెళ్ళిపోదామా ,ఇంకా కాసేపు ఉందాము అని అంటే అలా అలా ఆరింటివరకూ ఉండిపోయేము .
ఇలా ఆటపాటలతో , ఒక్కకార్తీక వనబోజనా లప్పుడే ఎందుకు గడపాలి ,నెలకో రెండునెలలకో పెట్టుకోవచ్చుకదా అనిపించింది. పెద్దవాళ్ళు ఎప్పుడూ ఏదోఒక పని తో బిజీ గావుంటారు .ఇలాపెట్టుకొంటే వాళ్ళకి కాస్త సరదాగా ఆట విడుపుగా ఉంటుందికాదా ...
ఇవండి మరి మా వనభోజనాల విశేషాలు..
మొత్తానికి బాగా ఎంజాయ్ చేసారన్నమాట. మేం కూడా మా తోటలో వనభొజనాలు పెట్టుకున్నాం . అవునూ ....పిల్లలేరి? అన్ని ఆటలూ మీరే ఆడేసుకున్నారా!
రిప్లయితొలగించండిభలే ....బావున్నాయి మీ ఆటపాటలు !
రిప్లయితొలగించండిపిల్లలూ వచ్చారండీ,వాళ్ళను ఆటలు ఆడించడంలోపడి ఫొటోలు తీయడం కుదరలేదు.
రిప్లయితొలగించండిbale unde mi kobbari thota
రిప్లయితొలగించండిnenu ippude choosa.bhale unnayi mee vanabhojanala muchchatlu :)
రిప్లయితొలగించండి