తాజా తాజా చింతకాయలు
చూడగానే చటుక్కున కొరకాలనిపించే .... ఆ పులుపుకి మనతోటి ఆబ్బా అనిపించే "పచ్చి చింతకాయలు "వచ్చేసాయి.
చింతకాయలు అక్టోబర్ నుండి ఉంటాయి.(ఇప్పటి వరకూ ఫోటో తీయటం కుదరక నా టపా లేటైంది:)) కార్తీక మాసంలోవచ్చే వనభోజనాల కి, పెళ్ళిళ్ళ లొ భోజనాలకి ఈ" పచ్చిచింత కాయలకి "మాంచి డిమాండ్ .
పచ్చి చింతకాయ-కొత్తిమీరపచ్చడి,చింతకాయ-గోంగూర పచ్చడి పచ్చిచింతకాయ తో వేరుసెనగ, కొబ్బరి కలిపి పచ్చడి ,ఇలా రకరకాల పచ్చళ్ళు చేస్తారు..ఎవరి పొలంలో ఉన్నా దులిపేస్తుంటారు.
పచ్చి చింతకాయలుతో పప్పుచారు చాలా బాగుంటుంది. చింతకాయలు నీటిలో ఉడకబెట్టి పిసికి పిప్పితిసేసి ,ఆ రసం పప్పులో కలపడమే.చేయడం కొద్దిగా సాంబార్ లాగానే ఉంటుంది కానీ ముక్కలు ఎక్కువ వేయరు.సాంబార్ పొడి కుడా వేయకుండా ,మామూలు పప్పుచారు లాగానే చేస్తారు.
చింతకాయ-కందపులుసు,ఆనపకాయపులుసు ఇలా అన్నిపులుసు కూరలు ,చేపల పులుసు కూడా ఈ చింతకాయల తోటే చేసుకోవచ్చు.అలాగే పచ్చళ్ళు చింత పండు బదులు పచ్చి చింతకాయల తో చేస్తే మాంచి రుచిగా ఉంటాయి.కూరలకు ,పప్పు,పప్పుచారుకి ఐతే ఉడకబెట్టు కోవాలి. కానీ ,పచ్చళ్ళ లో కి చింతకాయలను మధ్య కు కొస్తే ,గింజ గట్టిబడదు కాబట్టి పప్పులా ఉంటుంది అది తీసేసి వేసుకోవాలి. ముక్కలతో పాటు కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది.
చింతకాయలు దొరికి నన్ని రోజులు చింతపండు వాడకుండా చింతకాయలతోటే కూరలు వండుకోవచ్చ.చింతపండు నిల్వ ఉండి ఈ రోజుల్లో అంత ఫ్రెష్ గా ఉండదు .కాబట్టి దొరికితే వాటితో చేసి చూడండి. చింతకాయలు ఎక్కువగా ఉంటె ప్రిజ్ లో పెట్టినా వారం కంటే నిల్వ ఉండవు.అటువంటప్పుడు వాటిని మధ్యకి కోసి దానిలో పప్పు తీసి ,ఉప్పు తో కలిపి రుబ్బుకుని ప్రిజ్ లో పెట్టు కుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది . కావలిసినప్పుడు కాస్త కాస్త వేసుకోవచ్చు.
అన్నట్టు ఈ రోజు నేను దోసకాయ పచ్చడి పచ్చి చింతకాయలోతోనే చేశానండోయ్ ... :)
బావుందండీ,అప్పుడప్పుడు కూరల మామ్మ దగ్గర చూస్తాను కాని ఎప్పుడూ తేలెదు.ఈసారి తెచ్చి ట్రై చేస్తాను
రిప్లయితొలగించండిరాధిక గారు,
రిప్లయితొలగించండిటూ మచ్ మీరు. లంచ్ టైం లో వేస్తారు ఇలాంటి పోస్టులు. పొరపాటున తెరిచాను మీ బ్లాగ్. మీ పోస్ట్ చూస్తూ నా లంచ్ తినటం.. నరక ప్రాయం గా ఉంది :)
aahaa(.....!!!!!!!!!!!!!1
రిప్లయితొలగించండిమా చిన్నప్పటి రుచులు అన్నీ గుర్తు చేస్తున్నారు. చింతచిగురు పప్పు నా అభిమాన వంటకాలలో ఒకటి. ఆతరువాత కొత్త చింతకాయ పప్పు.చింతకాయ కొత్తిమీర పచ్చడి తిన్నాను కానీ కొబ్బరి, వేరుశెనగ పప్పు లతోటి తిన్న గుర్తులేదు.
రిప్లయితొలగించండిఇది చదివిన తర్వాత ఒక 55 ఏళ్ళు వెనక్కి వెళ్ళి మాతాతగారి ఊరు కానూరు అగ్రహారం లో చింతచెట్లు ఎక్కి చిగురు కోసి కిందపడిన రోజులు గుర్తుకు వచ్చాయి. థాంక్యూ.
గింజ పట్టని లేట చింతకాయల్ని మా వూర్లో వామన చింతకాయలు అంటారు. వాటితో పప్పు చాలా బాగుంటుంది. అలాగే పచ్చడి కూడా!ఈ పచ్చడిలో ఇంగువ పోపు వేస్తే,,,ఇహ చెప్పక్కర్లేదు.
రిప్లయితొలగించండిపండుమిర్చి,చింతకాయ పచ్చడి కూడా వేడన్నంలో అదుర్స్!
@లత,ట్రై చేయండి అలవాటుపడితే వదలరు...ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@కృష్ణప్రియ,హహ్హహ్హ...:))ధన్యవాదాలు.
@మందాకిని,ధన్యవాదాలు.
బులుసు సుబ్రహ్మణ్యంగారు మొదటిసారి నా బ్లాగ్ లోమీ కామెంటుకి ధన్యవాదాలండి.నా పోస్ట్ కాసేపు మిమ్మల్ని ఫ్లాష్ బాక్ లోకి తీసుకెళ్ళిందాఐతే!
రిప్లయితొలగించండి@సుజాత,వామన చింతకాయలు ఇప్పుడే వింటున్నానండి.పండుమిర్చి,చింతకాయ పచ్చడి కూడా వేడన్నంలో అదుర్స్.అవునండి ..నెయ్యి కుడా జత కలిస్తే ఆహా..:)..ధన్యవాదాలు..
అయ్యొ! రాధికగారు...నేను అప్పుడే వచ్చాను...మీరు చాట్ లీవ్ చేసారు :(
రిప్లయితొలగించండివావ్...రాధికగారు..మీరు అలా చినతకాయల్తో చేసె పచ్చళ్ళు...అవీ చెబుతూ ఉంటే నూరూరిపోతోందీ....నాకు కొంచెం పండిన చింతకాయలు ఇష్టం.వాటిని ఆలాగె చీక్కుంటూ తినేస్తా! ఎప్పుడన్నా పల్లెటూళ్ళవైపు వెళ్ళినప్పుడు..చింతచెట్టు కనపడితే మా కార్ డ్రైవర్ చేత కాయలు కోయించి...అక్కడికక్కడే తినెసేవాళ్లం మేము...హ్మ్!..ఐ మిస్ చింతకాయలు :(
రిప్లయితొలగించండి@దోసకాయ పచ్చడి పచ్చి చింతకాయలోతో
రిప్లయితొలగించండిnorooruthondi ...poto ayinaa pettandeee :)
సుజాత గారన్నట్లు వాటిని మేం వనగాయలు అని అంటాం, వాటితో పప్పు భలే రుచిగా ఉంటుంది. వన గాయాలను వాటిని అలాగే ఉప్పుతో కలిపి తింటే అబ్బో ఆ రుచే వేరు. నోట్లో నీల్లూరుతునాయి చెబుతుంటేనే. ఇక పచ్చి చింతకాయ పచ్చడి వేడివేడి అన్నం .. సన్న మిరపకాయ నంజుకుని తింటే అబ్బో ఆ రుచి చెప్పలేం
రిప్లయితొలగించండిచింత చిగురు తో పప్పు చాలా రుచిగా ఉంటుంది. మార్కెట్లో చింత చిగురు కొరకు వెతుకుతుంటా లెండి. చిన్నప్పుడయితే ఊళ్ళో ఎంతంటే అంట, చింత కాయలు ఎన్ని కావాలంటే అన్ని, ఈ సిటీల్లో వాటికొరకు వెతుక్కోవాల్సిందే,, అందని ద్రాక్షలు పుల్లన అన్నట్లు.. చింత కాయలు దొరికినా పుల్లనే , దొరకకున్న పుల్ల గానే:))
రిప్లయితొలగించండిచింత చెట్టు చిగురు మీద,చింతపూల రవిక మీద పాటలు రాసారు కవులు.అంతకుమించి ఆకట్టుకునేలా మీ చింతకాయల వంటకాలు నోరూరించాయి.చింతకాయలపై చింతన మొదలాయె,చింత తీరు మార్గాన్వేషణలో చిక్కుపడితిమి మేమెల్ల!
రిప్లయితొలగించండి@ఇందు,అక్కడా దొరుకుతాయని విన్నాను కొని ట్రై చేయండి..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@మౌళి,అయ్యో ఫోటో తీయటం మర్చిపోయా ..ధన్యవాదాలు.
@భాను,మీరింకా కొత్త రుచులతో నోరురిస్తున్నారు.చింతచిగురుతో పప్పు మేము చెస్తాం..పల్లెలో నే ఇటువంటి రుచులన్ని దొరుకుతాయి .ధన్యవాదాలు.
@ఉమాదేవి ,చింతకాయలపై చింతన మొదలాయె,చింత తీరు మార్గాన్వేషణలో చిక్కుపడితిమి మేమెల్ల! :)) బాగుందండి.ధన్యవాదాలు.
maa ammaki ee storage chitkaa cheppaali.. koneyyadam, vaadelopu avi fungus patteste tanu pareyyadam aipotundi.. thanks for the tip.
రిప్లయితొలగించండి@శ్రీ ,ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమాకు శ్రావణ మాసము లో వచ్చే కొత్తచింతకాయల తో పచ్చడి చేసి అమ్మవారి నైవేద్యానికి పెట్టడము అలవాటు . బాగుంది మీ పోస్ట్ .
రిప్లయితొలగించండిచింతాకాయ చిన్నచేపలు ..ఇంక పచ్చళ్ళు, పప్పులు వద్దు :-)
రిప్లయితొలగించండిరాధిక గారు.... తేగల ఫొటొ బాకీ ఉన్నారు... ఇంటికి ఫొన్ చెస్తే ...చెరుకుపానకం (బెల్లం వండినప్పుడు తీస్తారు కదా అది) లొ నంచుకుని తింటున్నా అని చెబుతుంటే ... నాకు తెగ నోరూరుపొతుంది :-))
@మాలా కుమార్ ,ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@మంచు,తప్పక పెడతానండి.మీరు చెరుకు పానకం అంటే నాకూ నోరూరుతుంది.:))..ధన్యవాదాలండి.
mee site chala bagundi.photos anta kanna..all the best..tyres tolatam chuste flashback ki poyindi manasu..
రిప్లయితొలగించండి