గడిచిన నాలుగు నెలలుగా వానలు ఏదో రూపంలో రైతులను దెబ్బ తీస్తూనే ఉన్నాయి.
ఈ సంవత్సరం సకాలంలో పడిన వర్షాల వలన వరిచేల ఊడ్పులు సరైన సమయం లో ఐపోయాయి . కానీ తరువాత విపరీతంగా కురిసిన వర్షాలకు మా వరిచేలు మునిగి రెండు రోజులున్నాయి .ఎలాగో నీళ్ళలో నుండి బయటపడి తేరుకు న్నాయనగానే , మళ్ళి నెలకు కురిసిన భారీ వర్షాలకు మా పొలం పక్కనున్న కాలవకు గండి పడి మూడు రోజులుమునిగి ,నానిపోయి చచ్చీచెడి ఎలాగో బయట పడ్డాయి..
మధ్య మధ్యలో జల తుఫానని ,అల్పపీడనాలని ,వాయుగుండాలని అడపా దడపా వానలు పడ్డాయి కానీ ఎలాగో వీటన్నిటి బారీనుండి తప్పించుకుని వరి చేలు కోతలకు వచ్చాయి. మిషన్ తోటేగా కోయడం మూడు రోజులలో అయిపోయాయి. అమ్ముడానికి ఇప్పుడు మంచి రేటులేదని ,బస్తాల్లో ఇంటికితెచ్చి నిలవ చేయడానికి అన్నీ సిద్దం చేసారు.. ఈ వెదవ వర్షాలు ఒక్క రోజాగితే ..కష్టపడి పండించిన పంట ఇంటికి చేరేది. ప్చ్ :( ఏంచేస్తాం??పైన ఎన్ని కప్పి ఉంచినా వర్షాలు బాగా పడటంతో కళ్ళం లో ఉన్న ధాన్యం తడిచి పోయి చేలోనే ఉంది.ఏంచేయడానికి లేదు.. రెండు రోజులనుండి కురిసిన వానలకు మడులన్ని నిండి అవి బయటకు తీయడానికి లేదంట. చాలా మందికి ఇలాగే అయింది.
వరిచేను గొడవ ఇలా ఉంటే ,పుగతోటల పని ఇంకా గొప్పగా ఉంది.
మాకు ఇప్పుడు" పుగాకు" సీజన్ .ఈ పుగతోటల పనులు మొదలైతే అంతా బిజీ బిజీగా ఉంటారు . నారుమళ్ళు కట్టడం దగ్గర నుండి ,పుగాకు గ్రేడింగై .. అమ్మకాలు అయ్యేవరకూ పుగతోటని, పుగాకు ని చాలా జాగర్తగా చూస్తారు.ఒక్క ఆకు కూడా పోకుండా చూడాలి.పెరిగే దశ లో వానలు అసలు పడకూడదు. వాన నీటిలో తడిసిన ఆకులు బరువును ,జిగురు కోల్పోయి ఉడికించేటప్పుడు నల్లగా మాడిపోతాయి.మంచి రంగురాదు .అలా ఐతే ఆ పుగాకు కు ధర సరిగారాదు.పెట్టిన పెట్టుబడి,శ్రమ అంతా వృదా అవుతుంది. అందుకే చాలా జాగర్తగా వాటిని చంటిపిల్లలను చూసినట్టు చూడాలి అంటారు.
పుగ తోట లకి జులై లో నారుమళ్ళు పెంచుతారు సెప్టెంబర్ నెల మధ్య నుండి తోట వేయడం మొదలుపెడతారు. ఇదిగో ఈ వర్షాలకు అలా అలా అక్టోబర్,నవంబర్ వరకూ వేస్తానే ఉన్నారు. అస్తమానూ కురుస్తున్న వానలకు చచ్చిపోయిన మొక్కల స్థానం లో కొత్తమొక్కలు వేస్తూ ఎలాగో ఇప్పటికి ఓ దశ పూర్తైందని ,కాస్త విశ్రాంతిగా ఉన్నారో లేదో మళ్ళి వర్షాలు బాగా పడటంతో నీళ్ళు నిల్వ ఉండి పోయి సగం మొక్కలు కుళ్ళి ,కొన్ని తలలు వాల్చి తోటలన్నీ నానా బీబత్సంగా ఉన్నాయంట.
మన ప్రభుత్వం వారు ఏరియల్ సర్వేలు చేసి ,రకరకాల ప్రకటనలు చేయడమే కానీ అవి రైతులకు ఏమేరకు ఉపయోగపడ్డాయో అని కూడా చూడరు.
ఎన్ని కష్టాలు ఎదురైనా రైతు తను నమ్ముకున్న ఆ భూమాత పైనే ఆధార పడి ముందుకు సాగాలిగా..
ప్చ్ చాల బాధనిపిస్తుంది, కానీ ఏమి చెయ్యగలను ప్చ్!
రిప్లయితొలగించండిchala baaga chepparu.
రిప్లయితొలగించండినిజమండీ,చేతికొచ్చిన పంట అలా అయిపొతే చాల బాధ గా ఉంటుంది. ఒకో సంవత్సరం మరీ వేధిస్తాయి వర్షాలు.
రిప్లయితొలగించండికానీ ఏమీ చెయ్యలేము కద
అవునండీ రాధిక,
రిప్లయితొలగించండివ్యవసాయం లో ఈ ఏడు చాలా నష్టం. కరువొస్తె అదోరకం . ఏం పనులు మొదలుపెట్టరు కాబట్టి కనీసం పెట్టుబడులయినా మిగులుతాయి. కనీ ఇలా చివరిదశలో వచ్చే వర్షాలవల్ల డబ్బంతా నేలపాలయ్యింది .
మాకూ పొగాకు వ్యవసాయం ఎక్కువుండేది. అది షేర్ మార్కెట్లాగా తయారయ్యేసరికి మానేసారు.
పొగాకు వ్యవసాయం ఎంత ఖర్చుతో కూడుకున్నదో నాకు తెలుసు. ఏం చేస్తాం చెప్పండి రైతులకి వ్యవసాయం ఆడక తప్పని జూదంలా తయారయింది .
నిజమేనండి ఈ అతివృష్టి వల్ల ఎందరు రైతులు నష్టపోతున్నారో. మీ టపా చదువుతుంటే బాదనిపించింది. కస్టపడి పంట చేతికొచ్చే సమయానికి వర్షాలతో పంట నాశానమయితే రైతుకు కన్నీల్లెగా మిగిలేది.
రిప్లయితొలగించండిమా ప్రాంతంలో శనగ పైరు వర్షాలవల్ల దెబ్బతినడంవల్ల మూడుసార్లు విత్తాల్సి వచ్చింది.మినుము,పెసర పైర్లు పురుగు,తెగుళ్ళబారిన పడి చాలా ఇబ్బందులు పడ్డాము.సోయాబీన్,వేరుశనగ పంట కోత సమయంలో అధిక వర్షాలవల్ల పూర్తిగా చేతికందకుండా పోయాయి.
రిప్లయితొలగించండిtoo sad :(
రిప్లయితొలగించండిప్చ్.. పంటలు చాలా దెబ్బతిన్నాయండి. ఎప్పటికప్పుడే మళ్ళీసారి బాగుంటుందని ఆశిస్తూ మళ్ళీ పనిలో పడడమే కొన్నాళ్ళనుండి రైతులు అలవాటు చేసుకోవలసొస్తూంది.
రిప్లయితొలగించండిఎన్ని కష్టాలు ఎదురైనా రైతు తను నమ్ముకున్న ఆ భూమాత పైనే ఆధార పడి ముందుకు సాగాలిగా.. true..
రిప్లయితొలగించండిఅయ్యో, చదువుతుంటే కళ్ళల్లో నీరు తిరిగింది. ఏమి చెయ్యలేని అసహాయత. నిజమే, అంతా సిద్దమయి ఫలం చేతికొచ్చే సమయానికి ఇలా జరగటం చాలా దురదృష్టం.
రిప్లయితొలగించండిపద్మవల్లి
అయ్యో! పాపం కదా :( చెట్లు అలా చచ్చిపోతుంటే ఎంత బాధగా ఉంటుందో! చేతికొచ్చిన పంట ఇంటికి రాకపోతే....ప్చ్! నిజంగా వానలు రైతులకి నేస్తం అలాగే శత్రువు కూడా..అకాల వర్షాలు ఆగిపోయి మీ పంటలు అన్ని సక్రమంగా పండాలని ఆశిస్తునా!
రిప్లయితొలగించండిఅతి వృష్టి అనా వృష్టి చాలా సహజంగా చక్రంలా పైకీ కిందికీ అవుతూనే ఉంటాయి కదా? ఏమీ చెయ్యగలిగింది లేదా, నిజంగా? ఈ కాలంలో కూడా? నిజంగా?
రిప్లయితొలగించండిఅమ్మకొట్టింది.ఎవరికి చెప్పుకోగలం?మరి ప్రకృతి మాత పగ పడితే ఎవరు దిక్కు?రైతు వేదన తెలిపే కవిత నా పోస్టులో రాసాను.
రిప్లయితొలగించండిమా వారు,మావయ్యగారు వాళ్ళు ఇలా ఉన్నాయి,అలాఉన్నాయి అని చెప్పుకుంటుంటే నాకు బాధగా అనిపించి ఏదో పోస్ట్ రాసేసాను.కానీ ఇంతలా అందరూ స్పందిస్తారనుకోలేదు.మీ అందరికీ చాలా థాంక్స్ అండి. వర్షాలు తగ్గాయి కదండీ.కాస్త లైన్లో పడ్డాయి. .
రిప్లయితొలగించండిhmm... sad sad sad Radhika garu.. inka koddo goppo manam niladokkugogalam.. asalu emi leni vaalla paristitiki chaala badhaga undi naaku.
రిప్లయితొలగించండిపక్రుతి పగబట్టినా
రిప్లయితొలగించండిఎవరూ సాయమందివ్వకున్నా
పడి లేచే వాడు రైతు
లేస్తాడు.. మనకొ ముద్దపెడతాడు
పక్రుతిపగబట్టినా
రిప్లయితొలగించండిఎవరూ సాయమందివ్వకున్నా
పడిలేచే వాడు "రైతు"
..లేస్తాడు,మనకొ ముద్దపెడతాడు
చల చల్లని కుండ పోత
రిప్లయితొలగించండిపెట్టింది చేలకు వాత
రైతన్నల గుండె కోత
ఓ ఎన్నెలమ్మా