చెట్టు బాగా పొడవై పోయి కాయలూ,ఆకులూ ఎప్పటికప్పుడు తీయించడం కుదిరేది కాదు . అప్పుడప్పుడు పైనుండి కాయలవీ ఎవరోకరి మీద పడేవి . కాయలు పెద్దగా కాయడంలేదు,పైగా అది అందరూ తిరిగే దారిలో ఉందని చెట్టు తీయించేసేరు.
నేను కొబ్బరి చెట్టు ఎలా తీసేస్తారో అప్పటివరకూ చూడలేదు.అదే మొదటిసారి.
ఒక చెట్టు తీయడానికి ఇద్దరొచ్చారు. వెయ్యి రూపాయలు తీసుకున్నారు.కొబ్బరి చెట్టు తీయడం కొద్దిగా ప్రమాదకరమైన పనే! చాలా జాగ్రత్తగా వ్యవహరిచాలి.
ఒకతను ముందు చెట్టెక్కి ఆకులవీ నరికేసేడు. తరువాత పెద్దమోకు (లావు తాడు) ని పైన కట్టి కొద్దిగా క్రిందికి దిగి చెట్టు సగం నరికి ,చెట్టు దిగేసి కట్టిన తాడుని లాగుతుంటే సగం నరికిన భాగం విరిగి క్రింద పడేది. అలా మూడొంతులు చెట్టు తీసేరు. తరువాత మొదలు త్రవ్వి తీసేసేరు.
నాలాగా ఎవరైనా చూడనివారి కోసం ఈ చిత్రాలు ..
ఎంత పొడవు గా ఉందో.. వెయ్యి రూపాయలా అనిపించింది మీరు రాసింది చదువుతున్నప్పుడు.. ఫొటోలు చూస్తే.. అవుతుంది లే..చాలా కష్టపడి ఉంటారు అనిపిస్తోంది..
రిప్లయితొలగించండిమా చిన్నప్పుడెప్పుడో చూశాను చాలా మాట్లే. కానీ సరిగ్గా గుర్తులేదు. కొబ్బరి చెట్టు కొట్టినప్పుడు కొబ్బరి మువ్వ కోసము ఎగబడే వాళ్ళమని లీలగా గుర్తు.తియ్యగా ఉండేది. కొంచెం వివరించగలరా? వాట్ ఈస్ దిస్ కొబ్బరి మువ్వ?
రిప్లయితొలగించండిEnko chettu ventane natandi...
రిప్లయితొలగించండిఅంత పెద్ద చెట్టు తీసేసారంటే బాధగా ఉంది. కాని అవసరమైతే తప్పదు లెండి. ఏంచేస్తాం. చాలా పెద్ద ప్రాసెస్. మీరు చాలా ఓపిగ్గా అన్ని ఫొటోస్ తీసి చూపించారు. నేనైతే ఎప్పుడూ చూడలేదు.
రిప్లయితొలగించండినేను చూసానండీ...అలాగే మామిడి చెట్టు...ఏపుగా ఎదిగిన కరివేపాకు చెట్టు తీయడం కూడా చూసా :( పాపం చెట్లు అలా నరికేస్తుంటే ఏడుస్తాయేమో కదా! :((
రిప్లయితొలగించండిరాధిక గారూ...
రిప్లయితొలగించండిచాలా బాగా వచ్చాయండి ఫొటోలు. ఒకదాని తర్వాత ఒకటి కొబ్బరాకు వలిచినట్టు చూపించారు.
కొబ్బరి మువ్వ అంటే ఏంటో మీరు చెప్తారా... నన్ను చెప్పమంటారా...? ఇంతకీ మువ్వ గురించి (ఎవరు తిన్నారో) చెప్పలేదు..
చిన్నప్పుడు కొబ్బరి చెట్టు కొట్టేస్తుంటే మొవ్వు తినొచ్చు కదా అని సంబరంగా ఉండేది.. కొంచం జ్ఞానం వచ్చాక ఆ చెట్టు ఇంకా ఉండదు అని బాధగా అనిపించేది.. ముచ్చెట్టు ఉండడం ఇబ్బందేనండీ.. పైగా ఇంట్లో ఇంతే అంటే మరీ కష్టం.. తీయించేయడమే మంచిది..
రిప్లయితొలగించండిసుబ్రహ్మణ్యం గారు, మురళి గారు, కొబ్బరి చెట్టు మొవ్వుని భలే గుర్తు చేసారండీ.
రిప్లయితొలగించండిఅంత రుచిగా జీడిపప్పు కూడా ఉండదు. చిన్నప్పుడు తిన్నాను.
చెట్టు కొట్టేసిన బాధకు తాయిలం మొవ్వు అన్న మాట.
కోపం వచ్చేస్తోంది. ఎవరూ చెప్పరేం? పై భాగం నించి తీస్తారా కింద భాగం నించి తీస్తారా మువ్వ. రెండు రోజుల్లో నాల్గు మాట్లు వచ్చాను ఇక్కడికి. ఆయ్ హన్నా.
రిప్లయితొలగించండిబులుసు సుబ్రహ్మణ్యంగారు ,క్షమించండి ..తీరికలేక మిరడిగిన దానికి సమాదానమివ్వలేదు.కొబ్బరిమువ్వ అంటే , లేతగా అప్పుడప్పుడే వచ్చేఆకులు మువ్వులా దగ్గిరికి ఉంటుంది. ఆకులన్నీ తిసేసేక కనిపిస్తుంది.దానిని తింటారు .
రిప్లయితొలగించండిమా తాతయ్య వాళ్ళ పొలం లో ముప్ఫై ఏళ్ల కొబ్బరి చెట్టు ఉంది రాధిక అక్క గారు. ఎప్పుడైనా వరంగల్ వెళ్ళినపుడు ఆ కొబ్బరి నీళ్ళో, లేత కొబ్బరినో తిని వస్తాను. చాల తియ్యగా ఉంటుంది. అదెప్పుడో మా నాన్న గారి తాత గారు నాటారట. పొలం మధ్య ఖాళి ప్లేస్ లో. ఇప్పటికి అలానే ఉంది.
రిప్లయితొలగించండిమీ బ్లాగ్ లో టపాలు చూస్తూ ఉంటె, మా తాతయ్య వాళ్ళ ఊరెళ్ళి వచ్చినట్టు ఉంటుంది. నిజంగా పల్లెలో వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది సుమండీ.