=''/>

23, మార్చి 2011, బుధవారం

మాక్కూడా ఈ ఫీవర్ అంటుకుంది

"ఫీవర్" అంటే అలాంటి ఇలాంటి ఫీవర్ కాదండోయ్!

ప్రస్తుతం "పిల్లలనుండి పెద్దలవరకూ "వాళ్ళు వీళ్ళనే తేడా లేకుండా , అందరికీ ఇప్పుడు ఒకేరకమైన ఫీవర్ !

పల్లెలు ,పట్నాలు ,నగరాలు ఎక్కడ చూసినా ఈ ఫీవరేకదా! అదేనండి " క్రికెట్ ఫీవర్ "

ఈ" క్రికెట్ ఫీవర్ " ఇప్పుడు మా ఇంట్లో అందరికీ అంటించాడు మాసాయి .




ఇది వరకు పెద్దగా క్రికెట్ చూసేవాడు కాదుకానీ, వరల్డ్ కప్ క్రికెట్ మొదలైయ్యాక కొంచెం ఇంట్రెస్ట్ గా టివీ లో మ్యాచ్ లు చూడటం మొదలు పెట్టాడు." ఇంగ్లాండ్- ఇండియా మ్యాచ్ "అయ్యాక ఇంకా ఎక్కువైపోయింది.


మనదేశం ఆడే మ్యాచ్ లే కాదు,ఎవరాడినా ఆఖరికి "కెన్యా-కెనడా ,జింబాబ్వే-కెన్యా "మ్యాచ్ లు కూడా వదిలిపెట్టలేదు.స్కూల్ నుండి రావడం... మ్యాచ్ లు చూడడం! హోంవర్క్ ,భోజనం అన్నీ ...టివీ వద్దే! అవి చూస్తూ వాళ్ళు అవుటైనా,సిక్సర్ కొట్టినా ,ఫోర్ కొట్టినా , వాళ్ళు ఏం చేసినా ...అమ్మా!తొందరగా రా...అంటూ అరుస్తూ గోల గోల చేస్తుంటాడు. అలా తను చూస్తూ మా అత్తయ్య ,మావయ్య గారితో సహా అందరినీ
క్రికెట్ వ్యామోహం లో పడేసాడు.క్రికెట్ మ్యాచ్లు మొదలయ్యాక రోజూ పేపర్ చూడటం కూడా అలవాటు చేసుకున్నాడు.ఈ మూడు రోజులనుండి మ్యాచ్ లు లేవని రోజూ అన్ని మ్యాచ్ల హైలెట్స్ చూస్తూ ....ఈ రోజు మొదలయ్యే క్వార్టర్ ఫైనల్ "పాక్-వెస్టిండిస్ "మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాడు.


పిల్లలందరికీ ఇప్పుడు ఎగ్జామ్స్ టెన్షన్ కానీ, సాయి వాళ్లకి ఏప్రిల్ రెండోవారంలో ఉంటాయి.అందుకే ఏ టెన్షన్ లేకుండా హాయిగా మ్యాచ్లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.


ఎప్పుడో ......నా చిన్నప్పుడు మనకి వరల్డ్ కప్ వచ్చింది అని చెప్పుకోవడమే కానీ , ఇప్పటి వరకు మనవాళ్ళు మళ్ళి కప్ గెలవలేదు.ప్రతీ వరల్డ్ కప్ కీ ఒకటే హడావిడి మనవాళ్ళు చాలా బాగా అడేస్తున్నారు కప్ ఖచ్చితంగా మనకే అని .కానీ ఎప్పుడూ నిరుత్సాహపరుస్తారు. ప్రతిసారీ మనవాళ్ళు వరల్డ్ కప్ లో ఓడిపోగానే ఇక క్రికెట్ అసలు చూడకూడదు అనుకుంటా కానీ ఒకటి రెండు మ్యాచ్లు గెలిస్తే చాలు "కుక్కతోక వంకర"లా మళ్ళి టివికి అతుక్కు పోతా! ఈ వరల్డ్ కప్ కీ అంతే చూడకూడదు అనుకున్నాను కానీ మా సాయి చూస్తూ నాకూ అటించేసేడు.

ఈ సారి ఎలాగైనా మనకు "వరల్డ్ కప్" వస్తుందని సాయి ,రాదనీ నేను పందెం వేసుకున్నాము.

ఆస్ట్రేలియా తో రేపటి మ్యాచ్ గెలిస్తే మనకి కప్ వచ్చేసినట్టే లేకపొతే అంతే !ఇక సర్డుకోవడమే !

రేపు ఇండియా ఎలాగైనా గెలవాలి ...గెలవాలి ...

ఆల్ ది బెస్ట్ ఇండియా

6 కామెంట్‌లు:

  1. ఈ వరల్డ్ కప్ తర్వాత, మూన్ కప్పు , సన్ కప్పు , యూనివర్స్ కప్పు ఇలా సంవత్సరం పొడవునా క్రికెట్ టి.వి.లో రావాలి. రోజూ ఇండియా ఆడాలి ...ఎందుకేంటండీ, ఇండియా మేచ్ ఉన్నరోజు మనకి నో పవర్ కట్ కదా అందుకు .

    రిప్లయితొలగించండి
  2. అవునండి లలితగారు.రోజు కాకపోయినా కనీసం ప్రతి సంవత్సరం వేసవికాలం లో వరల్డ్ కప్ జరిగితే బాగుండును :)

    రిప్లయితొలగించండి
  3. నాకెందుకో క్రికెట్ పెద్దగా ఇష్టం ఉండదండీ.. చాలాసార్లు చూడాలని ప్రయత్నించాను కానీ....

    రిప్లయితొలగించండి
  4. Radhika garu, All the best to you. ఇండియా తప్పకుండా గెలుస్తుందండి. మనిషి ఆశాజీవి.History repeats itself, కాబట్టి ఈ సరి ఆ కప్పు మనదేనన్నమాట.

    రిప్లయితొలగించండి