=''/>

20, మార్చి 2011, ఆదివారం

మార్చ్20" స్పారో " డే

కిచకిచమంటూ సందడి చేసే బుల్లి పిచ్చుకలకు నేను తీసిన చిత్రాలు

ముగ్గు బియ్యపు పిండి తో పెడితే పిచ్చుకలకు పండగే ....
.


వడ్ల గింజల కోసం వరి కంకి పై ...


ఒంటరిగా కనిపించదు
వడ్లగింజల కవచాలని వొడుపుగా పొడుచుకుతింటూనో

నీళ్ళ గిన్నె అంచుపై కాళ్ళు బిగించి
వంగి ముక్కును తడుపుకుంటూనో

ఒకదాన్నొకటి
రుద్దుకుంటూనో ...ముద్దిడికుంటూనో

మచ్చిక చేసుకుని
మేతపెట్ట డానికి ప్రయత్నించే కొద్దీ
చప్పుడు కాకుండానే
గింజల్ని ముట్టకుండా తుర్రు తుర్రు ఎగిరిపోయేది

పెరటి చెట్టు పైకి గుంపుగా చేరినప్పుడు
విరులకు బదులు పిచ్చుకలు పూచాయా....?
కిచకిచమంటూ...మంద్ర సంగీతం
ఈ చెట్టు ఎప్పుడు నేర్చుకుంది చెప్మా ....?

పిల్లలు లేని ఇల్లు కూడా
పిచ్చుకల సందడి తో పురుడు పోసుకుంటుంది

అంతచిన్ని బుర్రలో
ఎంతగొప్ప ఇంజనీరు తనమో
ఏ చెట్టు కొమ్మ చూసినా
పిచ్చుక గూళ్ళ కాయల గుత్తులే

"పిచ్చుక "

కదిలే కమనీయమప్పుడు
కనపడ్డమే గగనమిప్పుడు

పండిన వరి తొలి ఎన్నుల్ని తెచ్చిజడకుచ్చుల్లా అల్లి
ఇంటి చూరికి వేలాడదీసే ఒపికేది...?
చేతలో బియ్యం చెరిగేటప్పుడు
వడ్లు ఏరి కింద పారేస్తుంటే
పొటుకు పొటుకు పొడుచుకుంటూ
పొట్టుని వేరు చేసి గింజల్ని తినే...

ప్రియాతి ప్రియమైన పిచ్చుక నెచ్చలి ఏది....?
సెల్ టవర్ల రేడియేషన్
పిచ్చుకపై బ్రహ్మాస్త్రం గా పనిచేస్తుందేమో ....!?

ఈ కవిత ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకం లో ఎస్.ఆర్.భల్లం గారు రాసారు


4 కామెంట్‌లు:

  1. మా ఇంటిముందూ అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి పిచ్చుకలు. మీ ఫోటోలు బాగున్నాయి. భల్లం గారి కవితా బాగుంది.

    నాదేనా మొదటి కామెంటు. హహహ.

    రిప్లయితొలగించండి
  2. మీ బుల్లి పిచుకలు బాగున్నాయండి .

    రిప్లయితొలగించండి
  3. ఇన్ని పిచ్చుకలని చూసి చాలా కాలమైంది. బహుశ ఇంకమీద పల్లెటూళ్ళల్లో మాత్రమే చూడగలమనుకుంట.ఎంత కన్నుల పండువగా ఉందో.

    రిప్లయితొలగించండి