ఇవి కొంగలకి (బహుశా పక్షులన్నింటికీనేమో....... ) గూళ్ళు కట్టుకునే రోజులనుకుంట !
మా పునాస మామిడిచెట్టు మీద ఎప్పుడు చేరాయో ? పచ్చని చెట్టుమీద తెల్ల తెల్లగా మెరిసిపోతూ బలే అందంగా ఉంటున్నాయి.
ఈ సెలవల్లో రోజూ కరెంటు పోతుంటే ... మా పిల్లలకి మంచి కాలక్షేపం దొరికింది.మా ప్రియ(మా అమ్మాయి ) రోజూ అవి వెళ్ళడం ,రావడం బాగా గమనించేది. కొంగలు గూళ్ళు కట్టుకోవడానికి ముక్కుతో పుల్లలు ,అప్పుడప్పుడు చిన్న చిన్న వైరుముక్కలు కూడా తెస్తుంటే ....అమ్మా !గూళ్ళకి డెకరేషన్ చేసుకుంటున్నట్టున్నాయి అంటూ ,నన్ను పిలిచి చూపించేది . హస్బెండ్ ఫుడ్ తెస్తుంటే ...వైఫ్ గూడు కట్టుకుంటుందా?వర్షమొస్తే ఎలాగమ్మా పాపం తడిసిపోతాయి కదా!అంటూ సాయి కూడా వాటి గురించి రకరకాల కామెంట్స్ చేసేవాడు.
హాయ్! కొంగలూ , మంచి మంచి పోజులు పెట్టండి! అమ్మ మిమ్మల్ని ఫోటోలు తీసి బ్లాగ్ లో పెడుతుంది .మిమ్మల్ని బోల్డు మంది చూస్తారు .మీరు కదల కుండా గుడ్ బర్డ్స్ లా ...ఉంటే ఫోటోలు బాగుంటాయి అంటూ, కొంగల్ని ఎంకరేజ్ చేస్తూ మరీ పిల్లలు నాతో ఈ ఫొటోలు తీయించారు .
Nice
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిchaalaa baagunnaayi .
రిప్లయితొలగించండిmeekaemi telisindi :)
ధన్యవాదాలండి. వర్షం పడుతుంటే ఆ చెట్టు చుట్టుపక్కల ఎక్కడా ఉండలేమండి. క పు భరించలేము:))
తొలగించండిsuper
రిప్లయితొలగించండిAfter a long time! Anyway welcome back. Looking forward to see your posts regularly. ఫక్తు పల్లెటూరు విశేషాలు మీ ద్వారానే తెలుస్తుంటాయి...అందుకని.
రిప్లయితొలగించండిwelcome back radhika garu :)
రిప్లయితొలగించండిchala bagunnay kongalu :)
@ అజ్ఞాత ,@ అజ్ఞాత ,@పరిమళం, @తెజస్వి, @ఇందు,ధన్యవాదాలండి
రిప్లయితొలగించండి