తేలికగా ,తొందరగా చేసేయొచ్చు అనిపించేవి ఈ పెరుగుపచ్చళ్ళు.
తోటకూర,పాలకూర,బచ్చలికూర పెరుగుపచ్చడికి బాగుంటాయి. కూరగాయల్లో పొట్లకాయ పెరుగుపచ్చడికి చాలా బాగుంటుంది.ఆనపకాయ తో కూడా చేస్తారు కానీ, మావైపు ఎక్కువగా పొట్లకాయ తో చేస్తాము.
ఆకుకూరైనా ,కూరగాయలైనా ముక్కల్ని మరీ మెత్తగా కాకుండా ఉడకబెట్టుకుని, వాటిలో నీరు పిండుకోవాలి.పచ్చిమిరపకాయలు వేయించుకుని ఉప్పు ,పచ్చిమిర్చి,అల్లం కలిపి నూరి పెరుగులోవేసి పిండుకున్న ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి.నూరుకునేంత టైం లేకపోతే , మిరపకాయలు,అల్లం చిన్నముక్కలుగా కట్చేసి తాలింపు లో కలిపి వేయించుకున్నా పరవాలేదు.కానీ,వేయించిన మిరపకాయలు నూరి కలిపితే ఉప్పు ,కారం బాగా కలుస్తుంది . వేయించిన అల్లం ముక్కల రుచి బాగుంటుంది. . అలా ఇష్టమైనవారు అల్లం ముక్కలు కలుపుకోవచ్చు.
ఇక తాలింపు సంగతికొస్తే ... తాలింపు మినప్పప్పు , జీలకర్ర ,ఆవాలు,ఎండుమిరపకాయలు,కరివేపాకు ,తో పాటు మెంతులు కూడా వేసుకుని పెట్టుకోవాలి. మెంతులా... అని మొహం చేదుగా పెట్టకండి. వేగిన మెంతుల రుచి చాలా బాగుంటుంది. మాకైతే మజ్జిగచారు,పెరుగుపచ్చడి కి తాలింపు లో మెంతులు తప్పనిసరిగా ఉండాల్సిందే. తాలింపు పెట్టుకున్నాక ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కోసి కలుపుకోవాలి. వీటిని వేయించుకోవక్కర్లేదు.పచ్చి ముక్కలే బాగుంటాయి.
కొబ్బరి తో కూడా చేసుకోవచ్చు.కొబ్బరికోరు,మిరపకాయ తొక్కు,పెరుగులోకలుపుకుని తాలింపు పెట్టుకుకొవడమే.కానీ ,దీనిలో ఉల్లిపాయ ముక్కలేయరు.ఇది ఇడ్లీల్లోకి ,దోశల్లోకి చట్నీలా కూడా బాగుంటుంది. .

Wow :) Nice pic.
రిప్లయితొలగించండి