ఏమీ తోచక ఈ మధ్య ఫొటొషాప్ మీద పడ్డాను.
అస్తమాను ఏంకెలుకుతాలే.... యూట్యూబ్ లో వీడియో చూసి ఏమనా నేర్చుకోవచ్చేమో అనుకుంటే... నెట్ కనెక్ట్ ఐతే కరెంట్ పోవడం ,కరెంట్ ఉంటే నెట్ కనెక్ట్ కాకపోవడం .మాకు ఈమధ్య నెట్ సరిగ్గా కనక్ట్ అవ్వడం లేదు. ఒకవేళ కనక్టైనా చాలా స్లో ....ఎన్ని కంప్లైంట్లిచ్చినా అంతే.. ఏమన్నా అంటే మీకు కనెక్షన్ ఇవ్వక ముందే చెప్పాము మీ ఊరికి వచ్చే కేబుల్స్ సరిగా లేవని అంటారు.
ఎప్పుడన్నా మామీద కరెంటూ ,నెట్టూ రెండూ కలిపి దయ చూపితే మాకు పండగన్నమాట.
అలా క్రితం వారం రెండూ కరుణించినప్పుడు యూట్యూబ్ లో ఫొటోబాగ్రౌండ్ మార్చడం గురించి వీడియో దొరికింది. దానిని ఒక వంద సార్లు చూసి చూసీ అరగ్గొట్టి ఫొటోబాగ్రౌండ్ మార్చడం నేర్చేసుకున్నా!!
నేను మిక్స్ చేసిన ఫొటోలు ...
కొద్ది కొద్దిగా తేడాలున్నాయికానీ ,పరవాలేదనుకుంటున్నాను. ఇంకా బాగారావడానికి ట్రై చేస్తున్నాను.
మీరు ఫోటోషాప్‍కన్నా గింప్ ను ఉపయోగించండి. http://www.gimp.org/
రిప్లయితొలగించండిఫోటోషాప్ కంటే తక్కువ మెమొరీ, మంచి ఔట్‍పుట్, ఇంకా అన్నింటికన్నా మించి తెలుగులో రాయవచ్చు.
Woww! Bhale undandi :) Parledu ilaaa nerchesukondi ave vachestaay :)
రిప్లయితొలగించండిit's nice
రిప్లయితొలగించండి