=''/>

19, ఫిబ్రవరి 2014, బుధవారం

నేనూ నడుస్తున్నా !


మా ఊళ్ళో    సాయంత్రపు నడకకు పోయే  లేడీస్ బాచ్ ఒకటుంది .బాచ్ అంటే ఓ పది మందుంటారు  కానీ ఎప్పుడూ మానకుండా వెళ్ళేది మాత్రం ఐదారుగురే . మిగిలిన వాళ్ళు అప్పుడప్పుడూ చుట్టపు చూపుగా  వెళ్ళే వాళ్ళు . 

వాకింగ్  కి వెళితే  నాలుగైదు కిలో మీటర్లన్నా  నడవాలి కదా అందుకే  పొలం  వెళ్ళే దారినే  వాకింగ్ కి  ఎంచుకున్నారు. 

సాయంత్రం  మూడు గంటలకే నడకకు పోయే వాళ్ళు అరుగుల మీదకి చేరిపోతారు.ఒకవేళ ఆ టైమ్లో ఎవరన్నా పెండ్లి పిలుపులకు వచ్చినా వాకింగ్  వెళ్ళేవాళ్ళు  ఎవరో ,ఎక్కడుంటారో తెలిసిన వాళ్ళైతే అక్కడికే వెళ్లి చెప్పేస్తారు .   

 అందరూ వచ్చి బయలుదేరే లోపు వాళ్ళ కబుర్ల  లో మూడు  వీదుల  విశేషాలూ దొర్లిపొతాయి.  అంటే మరీ సినిమాల్లో చూపినట్టు ,పుస్తకాల్లో రాసినట్టు కాదండోయ్ .. చింత పండు ఎవరు ఎక్కడనుండి తెప్పించారు? ఎక్కడ మంచిది దొరుకు తుంది?పండు మిరపకాయలు వచ్చాయా? వడియాలు  ఎవరెప్పుడు పెట్టుకుందాం ?ఇంకా  ఇలాంటి చాలా సంగతులన్న మాట ! వర్షా కాలం లో  సన్నగా వర్షం పడుతున్నా  గోడుగులేసుకుని  మరీ  వాళ్ళ నడక ను సాగిస్తారు . 

మా పిన్నైతే ఇంట్లో ఎంత పనున్నా వాకింగ్ మాత్రం మానదు. పనున్నప్పుడు కూడా వాకింగ్  ఎందుకు ? మానేయొచ్చుగా అంటే  ఆ టైం కి అలా వెళ్ళాల్సిందే  లేకపోతే  ఏదో  లేనట్టే  ఉంటుంది అంటుంది .  

అసలు ఇదంతా ఎందుకు చెప్పొచ్చానంటే ...  ఎప్పటినుండో అంటే ఐదారేళ్ళ నుండీ  సాయంత్రపు నడకకు పోవాలని బద్దకిస్తూ వస్తున్న నేను  ఎలాగో ఆ  బద్దకాన్ని కాస్త వదిలించుకుని ఈ మధ్యే  మా వాకింగ్ బాచ్  లో  
 జాయినయ్యా :)  . ఆబ్సెంట్లు ఎక్కువ లేకుండా  సాధ్యమైనంతవరకూ  రోజూ  మానకుండా  వాకింగ్ కి వెళ్లాలని గాట్టిగా  నిశ్చయించేసుకున్నా :) 

పచ్చని పొలాల మధ్య లో ,సాయం సంధ్య  వేళ  నడక  మాత్రం భలే  ఉంది . అసలు  నడిచినట్టే ఉండటం లేదు .చుట్టూ ఇలాంటి దృశ్యాలు కనబడుతుంటే  వాటిని చూస్తూ పోతుంటే  ఎంత దూరం వెళ్ళామో ? ఏం తెలుస్తుంది !

                      
                                                       

ఇప్పుడు పుగాకు సీజన్ కావడంతో ఎటు చూసినా పుగతోటలే కనిపిస్తాయి. 




                            

                                                          రేగి చెట్టు

                                                               
                                                                         పొలంలో చెరువు


                       

                                                           


  

16 కామెంట్‌లు:

  1. ఆహా ఆ పరిసరాలూ,చెట్టూ చేమా చాలా ఆహ్లాదకరం గా ఉన్నాయండీ :-) అదృష్టవంతులు :-)

    రిప్లయితొలగించండి
  2. చాలా నాచురల్ గా వున్నాయి, ఎప్పుటిలా ఆ మొక్కలు పువ్వులు కాకుండా.., పల్లె జీవనాన్ని ప్రతిబింబించే నేటి ఫోటోస్ మరింత చాలా ఫ్రెష్ గా వున్నాయి :)
    ఇలాంటి పిక్స్ మరిన్ని కావాలని మనవి, అలాగే ఆర్డర్ కుడా :))

    రిప్లయితొలగించండి
  3. chalc chala bagundi radhika garu. chala adrustavantulu chakkani paccchani vatavaranam lo untunaru

    రిప్లయితొలగించండి
  4. I love the bird photos taken by you. Why don't you submit them for contest. Here is the link.

    http://gbbc.birdcount.org/photo-subs-2014/

    రిప్లయితొలగించండి