=''/>

16, ఫిబ్రవరి 2010, మంగళవారం

లయ అయిపోయింది .




మాటీవీ లో వచ్చే లయ సీరియల్ ఐపోయింది .

నేను పెద్దగా టీవీ సీరియళ్ళు చూడను.కానీ మటీవీలో వచ్చే "లయ" మాత్రం మిస్సవకుండా చూసేదానిని .
గుణ్ణం గంగరాజు నిర్మించిన ఈ సీరియల్ నిజ జీవితాలను ప్రతిభింబించేదిగా ఉండేది . .ఒక దిగువ మధ్య తరగతి వ్యక్తి డాక్టర్ కావడానికి ఎంత కష్టపడ్డాడు ,డాక్టర్ అయ్యాక అతని ప్రవర్తన ఎలా మారింది , మరలా అతను మంచి డాక్టర్ గా మారిన విదానము బాగా తీశారు . పెద్దగా సాగ దీయకుండా తొందరాగానే ముగించేశారు .


దీనిలో ప్రధాన పాత్రలు పోషించిన వాళ్లు ,ఇదివరకు( గుణ్ణం గంగరాజుదే) రాద -మదులో నటించిన కళ్యాణ్ ,మోనిక లు .దానిలోకన్నా లయాలో బాగాచేశారు . ఈసీరియల్ టైటిల్ సాంగ్ కూడా బాగుంటుంది .అసలు సీరియల్ మొదలైన కొత్తలో సాంగ్ చూసేదానిని .తరువాత తరువాత సీరియల్ కూడా చూడడం మొదలుపెట్టాను. పిచ్చి ఏడుపు సీరియల్స్ ,ఆడవిలనిజాల సీరియల్స్ మధ్యలో లయ ఒక్కటే స్పెషల్ గా ఉండేది .


ఆయన తీసిన రాదా-మదు ,అమృతం, అమ్మమ్మ డాట్ కాం ,అన్నీ కూడా ఒక్కోటీ ఒక్కో రకం గా తీశారు .అన్నీ కూడా బాగుండేవి .ముఖ్యం గా అమృతం చాలా హస్యం గా ఉండి బాగుండేది . . అందరూ కాక పోయినా కొందరైనా ఇటువంటివి తీస్తే బాగుండును .


గుణ్ణం గంగరాజు గారు నాలాంటి వారికోసమైనా ఇటువంటి మంచి సీరియళ్ళు మరిన్ని తీయాలనుకొంటున్నాను .

7 కామెంట్‌లు:

  1. పిచ్చి ఏడుపు సీరియల్స్ ,ఆడవిలనిజాల సీరియల్స్ మధ్యలో లయ ఒక్కటే స్పెషల్ గా ఉండేది
    కరెక్ట్.
    నేను కూడా ఈ ఒక్క సీరియల్ చూసేదాన్ని. ఇలాంటిదే ఇంకొటి కొత్తది మొదలైతే బాగుణ్ణు.

    రిప్లయితొలగించండి
  2. అవును,మా ఇంటిల్లిపాది చూసి ఆనందించిన చిత్ర ధారావాహిక.పగలు,ప్రతీకారాలు లేకుండా ఇద్దరు ముగ్గురు భార్యలు,భర్తలు లేని పాత్రలతో అనవసర సాఆఆఆఆఆఆఆఆఆఆఆఆగతీతలు లేకుండా లయబద్ధంగా సాగిపోయింది.ధన్యవాదాలు గంగరాజుగారూ మంచి ధారావాహికలు తీస్తూనే ఉండండి.

    రిప్లయితొలగించండి
  3. అవునండీ. మేము కూడా ఈ సీరియల్ ని శ్రద్ధ గా చూసే వాళ్ళము. నాకు అమెరికా లొ అయిదు నెలలు, ఎవ్వరూ తెలియని స్థితి లో మంచి కాలక్షేపం జరిగింది.

    జీవితాలని, మనస్తత్వాలని, పరిస్థితులని, మానసిక బలహీనతలని చక్కగా ఆవిష్కరించారు.

    ఏ విధమైన ప్రతికూల పాత్రలు లేకుండా సీరియల్స్ ని హ్రుద్యం గా నిర్మించచ్చు అని జస్ట్ యల్లో ప్రొడక్షన్ వాళ్ళు నిరూపించారు.

    ఈ బ్యానర్ మళ్ళీ కొత్త సీరియల్ ని మొదలు పెడితే బాగుండు అని నేను కూడా ఎదురు చూస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  4. రాణీగారు,మీలాగే నేనుకూడా కొత్తదాని కోసం ఎదురు చూస్తున్నానండి .
    విజయ్ మోహన్ గారు ,సాఆఆఆఅగదీయ కుండా ఉండం వలనే ఎక్కడా బోర్ కొట్టకుండా ఐపోయిందికదండి .
    @అంతర్ యాగం,
    మీరన్నది అక్షరాలా నిజమండి .మేముకూడా అలాగే జెస్ట్ యెల్లో వారి కొత్త సీరియల్ కోసం వైట్ చేస్తున్నామండి .

    రిప్లయితొలగించండి
  5. సీరియల్ ఎప్పుడూ చూడలేదుగానీ ఆ సీరియల్ టైటిల్ ఆలాపన 'లలాల..లలలాలల..లలలాలలా లాల' అంటూ చాలా వినసొంపుగా ఉంటుంది. ఆయన అమృతం మాత్రం భలే ఫన్నీగా ఉంటుంది. మాఇంట్లోనూ జస్ట్ ఎల్లో సీరియల్స్ అంటే ఇష్టపడతారు.

    రిప్లయితొలగించండి
  6. నేను చూసిన టి. వి సీరియల్స్ , రాధ-మధు , అమ్ముమ్మ .కాం , లయ మాత్రమే . యద్దనపూడి నవల అని చూడటము మొదలుపెట్టాను . అంతా బాగా తీసారు కాని , అన్నింటినీ ఎవరో తరుముతున్నట్లు , రెండు మూడు ఎపిసోడ్ ల లో ముగించాల్సినవి ఒకే దాని లో ముగించేసారు . అదొక్కటే నచ్చలేదు . వారి మూడో సీరియల్ , ఇదే హీరో , హీరోయిన్ తో మొదలుపెట్టినా చూస్తాను . చాలా నీట్ గా , టెన్షన్ లేకుండా వుంటాయి .

    రిప్లయితొలగించండి
  7. ఈ పోస్ట్ చూడతం పెద్ద తప్పై పోయింది, జీవితం లో మొదటి సారి ఒక సీరియల్ చూస్తున్నాను, మీరు చెప్పినట్టు రాధ మధు బాగుంది, కాని అన్ని ఎపిసోడ్స్ దొరకటం లేదు youtube లో :(

    రిప్లయితొలగించండి