
మానవ ఉద్వేగాలలో "కన్నీరు "ఒకటి.బాగోద్వేగాల కలబోత లో ఎప్పుడో ఒకసారి మనందరమూ కన్నీరు పెట్టుకొన్నవారిమే.
దుఖం ,దిగులు, బాధ,దిగులు,వేదన వంటి సందర్భాలలోనే కాదు ,పట్టలేని సంతోషమొచ్చినా కూడా మన కళ్ళ వెంట నీళ్ళొస్తాయి .(వాటిని మనము ఆనందబాష్పాలంటామని అందరికీ తెలిసిందే.. )
కన్నిళ్ళతో తడిసిన కళ్ళే స్పష్టం గా చూస్తాయంటారు . ఎందుకంటే కన్నీళ్లు స్వచ్చమైనవి.
మా బందువు ఒకాయన ఉన్నారు . ఆయన తల స్నానం చేసేటప్పుడు కళ్ళలో కావాలనే కుంకుడు కాయ రసం పోసుకుంటారు .ఆరసం కళ్ళలో పడితే చాలా మంట పుడుతుంది .కళ్ళు ఎర్రబడి నీళ్ళు కారతాయి.ఆకన్నీళ్ళు కళ్ళకి మంచిదని ఆయనకి చిన్నప్పుడు ఎవరో చెప్పేరంట. ఆయన ఇప్పటికీ అలాగే చేస్తారు.
మాపిల్లలికి తలస్నానం చేయిస్తున్నప్పుడు పొరపాటున కళ్ళలో పడితే, ఏడుస్తున్న వాళ్ళకి ఆయన ని పెద్ద ఉదాహరణగా చెపుతూ ఉంటాము .ఆ తాతగారు చూడండి కళ్ళలో కావలని పోసుకుంటారు కళ్ళకి మంచిదని అంటూ . .పాపం ఏమి చేస్తారు మంటపుట్టినా అలాగే భరిస్తారు ( అసలు విషయము ఒదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయానా )
ఆడవారిలో బావోద్వేగాలు ఎక్కువ .దుఖమొచ్చినా పట్టలేరు , సంతోష మొచ్చినా పట్టలేరు అంటారు .చాలా వరకు ఇది నిజమే కదండి. ఏదైనా తీరని బాధ కలిగినా ,తెలియని దిగులు ఆవరించినా కళ్ళు తొందరగా చెమ్మగిల్లుతాయి .అటువంటప్పుడు మనసారా ఏడవడమే మంచిదని నా ఉద్దేశము .
ఆడవారైనా ,మగవాళ్లైనా తీరని విషాదం కలిగినప్పుడు కన్నీటి తో ఆ భాదను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తే , మనసులో బారం కొద్దిగా ఐనా తగ్గించుకో వచ్చంటారు .
కన్నీళ్ళు పెట్టుకోవడమూ ఒక గొప్ప వరమే .మన లోపల ఆర్ద్రత, ప్రేమ ,దయ ,ఉన్నాయని చెప్పడానికి కన్నీళ్ళే ఉదాహరణ. ఏందుకంటే కన్నీళ్ళు ఆరోగ్యకరమైన ఉద్వేగము .
nijame kadaa
రిప్లయితొలగించండి"కన్నీళ్ళు పెట్టుకోవడమూ ఒక గొప్ప వరమే .మన లోపల ఆర్ద్రత, ప్రేమ ,దయ ,ఉన్నాయని చెప్పడానికి కన్నీళ్ళే ఉదాహరణ" agree with u
రిప్లయితొలగించండికుంకుడుకాయ పోసుకుని తెప్పించుకునే కన్నీళ్ళ కన్నా , గ్లిసరీన్ పోసుకుని ఏడ్వటం బెటర్ అంటాను. లేదంటే వంటింట్లో వచ్చి ఉల్లిగడ్డ తరిగిపెట్టమని మీ బంధువుతో చెప్పండి. వంటింటి కార్యమూ తన ఏడుపూ తీరినట్టు అవుతుంది ( స్వామి కార్యము స్వకార్యము లాగా ). :))
రిప్లయితొలగించండికుంకుడు కాయలో క్షారాలు కొన్నాళ్ళకు కంటిశుక్లాలు త్వరగా వచ్చేలా చేస్తాయని ఆర్కన్సాస్ యూనివర్సిటీ లో చుంచెలుకల మీద పరిశోధనలో చూచాయిగా తేలిందట! మరి ఇక ఆయన ఇష్టం!
శంకర్
భావొద్వేకానికి తుది మెట్టు కన్నీరు. బాగుందండి మీ వివరణ.
రిప్లయితొలగించండికావాలని కన్నీళ్ళా.. ఇదేదో బాగుందే. :-)
రిప్లయితొలగించండి<<.మన లోపల ఆర్ద్రత, ప్రేమ ,దయ ,ఉన్నాయని చెప్పడానికి కన్నీళ్ళే ఉదాహరణ.>>
రిప్లయితొలగించండిబాగా చెప్పారండీ.
@ హను ,@ రాధిక ధన్యవాదాలండి .
రిప్లయితొలగించండి@బావనగారు ,@ జయగారు ,
రిప్లయితొలగించండి@శ్రావ్యగారు ,ధన్యవాదాలండి .