=''/>

15, మార్చి 2010, సోమవారం

ఉగాది శుభాకాంక్షలు .



యుగాది సంస్కృత రూపానికి తెలుగు రూపమే "ఉగాది".అంటే యుగానికి ఆరంభం అని అర్ధం .
చైత్ర శుద్ధ పాడ్యమి రోజున శ్రీకృష్ణ నిర్వాణం తో ద్వాపర యుగం అంతమైంది,కలియుగం ఆరంభమైంది.


ఎప్పుడైతే యుగారంభం అయిందో అప్పుడే సంవత్సరానికి ఆది కాబట్టి "సంవత్సరాది" గా పరిగణించారు. వేద కాలం నుంచీ యుగాది పండుగ జరుపుకునే అచారమున్నట్టు శాస్త్రాలను బట్టి తెలుస్తుంది.


ఉగాది రోజున ఉదయమే లేచి,తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి,ఉగాది పచ్చడి తిన్న తరువాతే మిగిలినపనులు చేయాలి .

తీపి,పులుపు,చేదు, ఉప్పు కలగలిపిన ఈ ఉగాదిపచ్చడికి ఎంతో ఔషధ విలువ ఉన్న విషయం అందరికీ తెలిసిందే .

ఈ నూతన సంవత్సరం లో అందరూ సుఖ సంతోషాలతో ఆనందం గా ఉండాలని కోరుకుంటూ

వికృతి నామ సంవత్సరాది శుభాకాంక్షలు.

7 కామెంట్‌లు:

  1. మన మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  2. మీకు కూడా వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  3. మీకూ , మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు .

    రిప్లయితొలగించండి
  4. మీక్కూడా ఉగాది శుభాకాంక్షలు !

    రిప్లయితొలగించండి
  5. @ మందాకిని ,
    @చిన్ని,
    ధన్యవాదాలండి

    రిప్లయితొలగించండి
  6. @విజయమోహన్,
    @పరిమళ,
    @ మాలా కుమార్,
    ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి