నాకు కవితలు చదివి ఆనందించడమేకానీ రాసే అంత పాండిత్యంలేదు .ఈకవిత ముప్పై సంవత్సరాల
క్రిందటిది.రాసినామె పేరు దుర్గ . మా అత్తయ్య అప్పటి వీక్లీలలో వచ్చే చాలా సీరియళ్ళను బైండింగ్
చేయించింది. ఒకదానిలో ఈకవిత చదివి బాగుందని దాచాను. మీఅందరికోసం ఈకవితలో కొద్దిగా
మార్పులు చేసి అందిస్తున్నాను .
గడచినవత్సరపు ప్రౌడ...
లేత వన్నెల చీర
గోరంచుల రాపిడితో ....
గతపులోగిలి గడపదాటి
మల్లె సుగంధాలతో అడుగిడింది...
నవ యౌవ్వన జవ్వని
జిలుగు వెలుగుల సోయగాల
"నవయుగాది"
"నేనులేని సందడి ఎక్కడిదని" ని
గారాలు పోతుంది కోయిలమ్మ .
"ఈ సంబరాలెందుకా" అని...
కొండదారి మలుపులో
క్షణమాగి చూస్తుంది చిట్టేరు.
భవితవ్యంలోకి ....
సందేహంగా చూస్తున్న కనులకు
సమాదానమిస్తున్నాయి...
లేలేత చిగురుల కొమ్మలు .
ఈ వసంతాగమన శుభవేళ ...
నిశ్శబ్ద స్వాగతగీతిని ఆలపించడానికి
ప్రకృతి శృతులు సరిచూసుకుంటున్నది .
************************************
చాలా బాగుంది కవిత
రిప్లయితొలగించండిbaagundi andee
రిప్లయితొలగించండిముప్పై ఏళ్ళైనా నవ యౌవ్వన జవ్వని లాగానే ఉందీ కవిత...
రిప్లయితొలగించండిChaalaa chaalaa bagundi
రిప్లయితొలగించండిఅందమైన కవితని ఇన్నేళ్ళు భద్రంగా దాచి ఉంచిన మీరు నిజంగా అభినందనీయులు !
రిప్లయితొలగించండి@రవిచంద్ర,@పరిమళ ,
రిప్లయితొలగించండి@సరిత,@స్నేహితుడు,
ధన్యవాదాలండి.