మార్చ్ 27 న రాత్రి ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర వరకూ ప్రపంచములో అందరూ విద్యుత్ వినియోగించ కుండా ఉండి ,పర్యావరణాన్ని కాపాడాలని "వరల్డ్ ఎర్త్ అవర్ "వాళ్లు విజ్ఞప్తి చేస్తున్నారు. వారి ప్రచారకర్త గా స్మాల్ బి "అభిషేక్ బచ్చన్ " దీనిని ప్రచారం చేస్తున్నారు.
27 వ తేదీన ఆఒక్క గంటా ఏ విధం గానూ విద్యుత్ వినియోగం జరగకుండా అమలయ్యేలా ప్రతీఒక్కరూ ఎస్.ఎం.ఎస్ లు, ఈ మెయిళ్ళు, ఇంకా ఇతర సందేశాల ద్వారా విజ్ఞాపనలు చేస్తే ప్రపంచవ్యాప్తంగా , చాలా విద్యుత్ అదా అవడమే కాకుండా ,పర్యావరణాన్ని పరిరక్షించిన వారవుతారు .
మార్చ్ 27 వ తేదిన ఒకే ఒక్క గంట విద్యుత్ వాడకుండా ఉండి మీరుకూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారుకదా.
ఎస్ఎంఎస్..email...ఐడియా బావుందండీ..అందరూ participate చేయాలని కోరుకుందాం...
రిప్లయితొలగించండిఎన్.ఎం.ఎస్‍లకు,ఈ-మెయిల్‍లకు,ఇతర సందేశాలకు ముందు ఖర్చు,కాలం ఎంత వృథా అవుతుందో ముందు ఆలోచించండి :)
రిప్లయితొలగించండిఒక్క రోజు ఒక్క గంటేమి? రోజూ 3గంటలు అఫిషియల్ , 6గంటలు అన్ అఫీషియల్ గా పవర్ కట్ చేస్తున్నారు గా! మన పెభుత్వానికి వర్ల్డ్ ఎర్థ్ అవర్ కన్నా దూరాలోచన ఎక్కువండి. అవి మనల్ను ఉద్దేశించినవి కావు లేండి. హూ.. ( నిట్టూర్పు ) :P
రిప్లయితొలగించండిశంకర్
ఆ టైం లో పవర్ కట్ లేకుంటే పవర్ కట్ చేసుకుంటాము. పవర్ కట్ వుంటే ' ఎలాగూ గాలికి పోయిన పిండి కృష్ణార్పణం ' అనుకుంటాము. అంతే కాని, అభిషేక్ కాదు గదా, ఆయన బాబు అమితాబ్ బచ్చన్ చెప్పినా ఆచరించే పరిస్థితి లేదు
రిప్లయితొలగించండికె.వి.ఎస్. వి.గారు,ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@విజయ్ మోహన్ ,అసలు చేయాలని మనసుండాలి కానీ కాస్త సమయం కేటాయించలేరా.ధన్యవాదాలు.
@ఎస్ ,పవర్ కట్ లేకుంటేనే ఆచరించండి.ధన్యవాదాలు.