ఒకరోజు ఉదయాన్నే మా పనమ్మాయి ప్రణతి(అసలుపేరు పెంటమ్మ.కానీ బాగోలేదని మార్చుకుందంట.మాకూ ఈమద్యనే తెలిసింది.)పాపగారూ అంటూ నా దగ్గరకొచ్చి ఉడుత నీళ్ళకుండీలో పడిపోయిందంది.
అయ్యో అని గబగబా కుండీ దగ్గరకెళ్ళి చూస్తే అది పైకి ఎలా రావాలో తెలియక గుండ్రంగా ఆనీళ్లలో తిరుగుతుంది.పట్టుకుని పైకి తీద్దామంటే అదిచాలాసేపు దొరకలేదు ఎలాగో తీసేసాము.కుండీలో ఎప్పుడుపడిందో ఏమో ఒణికిపోతూ ఉంది.వదిలేద్దమనుకుని ,మళ్ళీ సాయి పట్టుకుంటానంటున్నాడుకదాని దానిని ఎలకల బోను ఉంటే దానిలో పెట్టేము.
రోజూ 7గంటలైనా లేపినా లేవడు . ఆరోజు సాయి.. ఉడుత బోనులో ఉంది లే పట్టుకుంటానంటున్నావు కదా అనగానే టక్కున లేచి కూర్చున్నాడు .అసలే అస్తమానూ ఏవోకటి ప్రశ్నలు వేస్తూ బుర్రతింటూ ఉంటాడు.లేపి ఉడుతిదుగో అనగానే పరిగెట్టుకుని వచ్చి దానిని చూస్తూ మళ్ళి ప్రశ్నలు మొదలు పెట్టాడు.ఇది ఎలావచ్చింది బోనులోకి,అసలు నీళ్ళలో ఎందుకు పడిందని ఇలా రకరకాలుగా అడిగి కాసేపు నా బ్రైన్ తినేసి దానికి ఆకలిగా ఉండేమో అని జామకాయ ముక్కలు ,వడ్లు (వాటిని ఉడుతలు తినడం రోజూ చూస్తూంటాడు)తెచ్చి పెట్టాడు.
అది అసలే స్వేచ్చగా తిరుగుతూంటుందికదా . దానికి ఆబోనులో ఉండడం నచ్చలేదు మేము ఏమి పెట్టినా తినలేదు .అమ్మా ఏంటి ఏమీ తినడం లేదు రోజూ తింటుందికదా అనికాసేపు బాదపడి ఏమీ తినటం లేదుకదా ,దాన్నిక వదిలేద్దాము అన్నాడు. కానీ ఒకసారి పట్టుకుని దానితో ఫొటో తీయించుకుంటానన్నాడు . సరే అని ఆ బోనుకి బయటకు వెళ్ళే దారి కిందకి ఉంటుంది .నేను ఆతలుపు తెరిచి అక్కడ చెయ్యి పెట్టాను పట్టుకుందామని . మామీద ఎంత కోపంగా ఉందో కానీ దానికి,పట్టుకుందామని తలుపుదగ్గర పెట్టిన నాచేతివేలిని చటుక్కుని కొరికేసి చిటుక్కున పారిపొయింది .మేము చుసేలోపే వెళ్ళి పోయింది. ఇక నావేలైతే రక్తం వచ్చి కొద్దిగా వాసింది కూడాను. నొప్పి రెండు రొజులుంది. దానిపళ్ళంత పదునుగా ఉన్నాయి.ఇది చూసి మావాడు మాబుక్ లో ఉంది ఉడుతల పళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి అందుకే గట్టివికూడా తింటాయి.అని వాడి పరిజ్ఞానమంతా కాసేపు ఏకరువుపెట్టేడు. ఉడుత నావేలు కొరికిన గొడవలో పడి దానిని పట్టుకుని ఫొటో తీయించుకోలేదన్న విషయం కూడా మర్చిపోయాడు.
అప్పటినుండీ రోజూ వాటిని చూస్తున్నాడుకాని, ఉడుతను పట్టుకోవాలి అని అనడంలేదు
నిజాం గా ఈ చెట్లు అన్ని మీ పెరటిలోనే ఉన్నాయా?నేనైతే నమ్మలేకున్నాను. నిజమైతే మీకు ఎంతో ఓపిక ....... సహనం .......పర్యావరణం పై మక్కువా ఉన్నందుకు మీమల్ని అబినందించక తప్పదు.
రిప్లయితొలగించండిథాంక్స్ సూరి గారు,మీరు నమ్మినా నమ్మక పోయినా అవన్నీ మా పెరట్లోవే ..
రిప్లయితొలగించండి