మాఇంటిలో అందరికీ మొక్కలు పెంచడం ఇష్టమే.అందరమూ ఏవోకటి మొక్కలు తెచ్చి వేస్త్తూ ఉంటాము. అలాగని మాదేమీ పెద్ద గార్డెన్ కాదు కానీ చిన్న సైజు అడవిలాగా ఉంటుంది . అంజూరు,బత్తాయి,కెజీ జామ,ద్రాక్ష,శ్రీగంధం,దాల్చినచెక్క మొక్క , తమలపాకు తీగ ఇలా చాలా రకాలున్నాయి. అలాగే పునాస, పంచదారకల్తీ అనే రెండు రకాల మామిడి చెట్లున్నాయి. మిరియంతీగకూడా వేసాముకానీ ఈమద్యే దానికి వాతావరణం కుదరక చనిపోయింది. అలాగే రకరకాల పూల మొక్కలు కుడా ఉంటాయి
ఇవన్నీ మా ఇంటిలో పూసిన గులాబీలే .
వర్షాకాలంలోనూ సీతాకాలములోనూ మాఇంటివద్ద గులాబీలు బాగా పూస్తాయికానీ, వేసవి కాలంలో ఎంత శ్రెద్ద తీసుకున్న సరిగా పూయవు.పైగా ఎండలు తట్టుకోలేక కొన్ని మొక్కలు చచ్చిపోతూ ఉంటాయి. మళ్ళీ వర్షాలు పడగానే కడియం నర్సరీల నుండి మొక్కలు సైకిల్ మీద తెచ్చి అమ్ముతూ ఉంటారు.వాళ్ళదగ్గర కొని వేస్తాము. హైబ్రీడ్ గులాబీలు మా వాతవరణంలో తొందరగా తెగుళ్ళు వచ్చి చచ్చిపోతుంటాయి. అందుకని ఎక్కువగా నాటు గులాబీమొక్కలే పెంచుతాము.అవైతే వర్షాకాలంలో కొమ్మలు కత్తిరించి పాతినా పెరుగుతాయి .
ఎలాఉన్నాయి మరి అందాలు చిందే గులాబీలు.
వావ్!! గులాబీ బాలల సొగసులు చూడతరమా?? నాటు గులాబి వయ్యారాలు లేకున్నా సువాసనలు చాలా బావుంటాయి..
రిప్లయితొలగించండికత్తి లా ఉన్నాయి పూలు.. శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిదాల్చిన చెక్క చెట్టు మొన్నీ మధ్య చూశాను. మామిడి చెట్టంత ఉన్నట్టుంది. మిగతా మొక్కలన్ కూడా ఉప్లోడ్ చేయండి వీలైతే!!!
కృష్ణప్రియ/
కత్తి లా ఉన్నాయి పూలు.. శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిదాల్చిన చెక్క చెట్టు మొన్నీ మధ్య చూశాను. మామిడి చెట్టంత ఉన్నట్టుంది. మిగతా మొక్కలన్ కూడా ఉప్లోడ్ చేయండి వీలైతే!!!
కృష్ణప్రియ/
భలే ఉన్నాయండి, ఒకప్పుడు మాఇంట్లో కూడా 12 రకాల గులాబీలుండేవి. అవన్ని గుర్తొచ్చయి నాకు.
రిప్లయితొలగించండిచాలా ముద్దుగా ఉన్నాయండీ మీ తోటలోని గులాబీలు! మిగతా మొక్కల్ని కూడా మాకు చూపిస్తూ ఉండండి మరి! :-)
రిప్లయితొలగించండిఅబ్బో భలే ఉన్నాయండి గులాబీలు.. ఇప్పుడే చూసా మీ బ్లాగ్ లో పాత పోస్ట్లు ..చీరల పై వర్క్ భలే చేసారండి ..ఎప్పుడన్నా కాపీ కొట్టేసుకుంటా.. :)
రిప్లయితొలగించండిtoo good andi super ga unnayi
రిప్లయితొలగించండి1st photo is excellent.
రిప్లయితొలగించండిజ్యొతిగారు,కృష్ణప్రియ,సౌమ్య గారు ధన్యవాదాలు
రిప్లయితొలగించండిమదురవాణీగారు ధన్యవాదాలు.నేస్తం గారు నావర్కులు నచ్చినందుకు థాంక్స్ .మీకు కావలిసినప్పుడు నిరబ్యంతరంగా తీసుకోవచ్చు.
రిప్లయితొలగించండిఓ ఐదు నిముషాలపాటు చూసాను.
రిప్లయితొలగించండిరాధిక, నాకు అంత ఎక్కువగా తెలియదు కానీ మా తాతగారు వేయించిన తోటలో అలా ఎక్కడెక్కడివో రకాల మామిడికాయ/పళ్ళ రకాలుండేవి. నాకు తెలిసి "పంచదార కలశం" కదా, పంచదారకల్తీ కాదనుకుంటా...మిగిలిన పూలు మాత్రం వర్ణనాతీతం. బావున్నాయి మీ అభిరుచులు.
రిప్లయితొలగించండి