=''/>

30, జులై 2010, శుక్రవారం

మా ఇంట్లో ఈ రోజు ఇద్దరి పుట్టినరోజు .


ఈ రోజు మా" సాయి" (మా అబ్బాయి )తొమ్మిది సంవత్సరాలు పూర్తిచేసుకుని"పదో సంవత్సర ము "లోకి అడుగుపెడుతున్నాడు .

పిల్లలు ఎంత తొందరగా ఎదిగి పోతారో .అప్పుడే వాడికి పదేళ్లు వచ్చేసాయా అన్పిస్తుంది.

వాడి అల్లరి చేష్టలు,చిలిపి పనులు ,చిన్నప్పటి సంఘటనలు ముద్దు ముద్దు కబుర్లు ,అక్క తో వాడి పోట్లాటలు చాలా గుర్తున్నాయి కానీ ,

ఇంకా చాలా తీపి జ్ఞాపకాలను కాలగమనం లో మర్చిపోయి ఉంటాను . పిల్లల చిన్నప్పటి విషయాలు ఎప్పటికప్పుడు డైరి లోరాసి వుండవలిసింది అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు ..

సాయి చిన్నప్పుడు (ఎల్.కే. జీ.లో ఉండగా )అందరమూ డాక్టర్లు గురించి మాట్లాడుకుంటుంటే వాడు నేను డాక్టర్ నై మన ఉళ్ళో హాస్పటల్
కట్టి తాతగారు వాళ్లందరినీ బాగా చూస్తాను అన్నాడు. మా నాన్న గారు,మావయ్యగారు వాళ్ళు సంబరపడిపోయారు వాడి మాటలకి.
ఎందుకంటే మాది పల్లెటురుకదా డాక్టర్లు అందుబాటులో ఉండరు ,వచ్చిన రోగం ఎంతచిన్నదైనా పట్నానికి పోవలసిందే . .

అలాగే తనకి పాటలంటే బాగా ఇష్టం .బాగా వింటాడు .ఇప్పటి పాటలే కాదు ,ఇళయరాజా వి ,ఇంకాపాతవి కుడా ఇష్టం. అప్పుడప్పుడూనేను పెద్దైయ్యాక మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను అంటుంటాడు.అలా అంటే మేము సరదాగా "డాక్టర్ సాయి మ్యూజిక్ డైరెక్టర్ "అని పిలుస్తుంటాము.

తను ఈ పుట్టినరోజు కోసం ఇంచు మించు కొత్త కేలండర్ కొన్నప్పటి నుండి అంటే జనవరి నుండి ఎదురు చూస్తున్నాడు (ప్రతీ సంవత్సరమూ అంతే అనుకోండి)
.ప్రతీ నెలా ౩౦ తారీకు వస్తే వచ్చేస్తుంది జూలై నెల అనేవాడు. ,జులై నెల వచ్చేక కౌంట్ డౌన్ మొదలు పెట్టాడు.

ఇదిగో తను ఇంతో ఎదురు చూసిన "జులై ౩౦ " వచ్చేసిందిగా .

"సాయి"నువ్వెంత గానో ఎదురుచూసిన నీ పుట్టినరోజు వచ్చేసింది నాన్న . ఇటువంటి "పుట్టినరోజు "లు జీవితాంతం ఆనందంగా జరుపుకోవాలని
మేమంతా మనసారా ఆశీర్వదిస్తున్నాము .


ఇంతకీ రెండో పుట్టినరోజు ఎవరిదో చెప్పలేదు కదా. ఏ విషయములో నైనా నన్ను ఎంతగానో ప్రోత్సాహించే ది మావారు తనది కుడా ఈ రోజే పుట్టిన రోజు .


సాయి నీకు ,నాన్న కి ఇద్దరికీ
######### ##పుట్టినరోజు శుభాకాంక్షలు"#############

20 కామెంట్‌లు:

  1. పుట్టినరోజు శుభాకాంక్షలు. చి"సాయికి, మీశ్రీవారికి.

    రిప్లయితొలగించండి
  2. Many many happy returns of the day,, to
    chi.sai and your beloved hubby,,

    రిప్లయితొలగించండి
  3. ఇద్దరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. :)

    సత్యప్రియ గారు, మీ అబ్బాయి గురించి అంత రాసి, మీ వారి గురించి మరీ అంత తక్కువ రాసారు, అంతా తొండి :P

    రిప్లయితొలగించండి
  4. పుట్టిన రోజు జై జై లు చిట్టి అబ్బాయి కి మరియు పెద్ద అబ్బాయి గారికి .
    మీకు ఒకటి తెలుసా , మీ వారి పుట్టిన రోజు అయినా , మీ పుట్టిన రోజున అయినా , మీరు మీ వారి కాళ్ళకు నమస్కారం చేసి ఆసీసులు తీసుకోండి . మంచిది :)
    మా ఆవిడ అలాగే చేస్తది . అవును నిజం అండి

    రిప్లయితొలగించండి
  5. Sweet post! సాయికి, సాయి నాన్న గారికి ఇద్దరికీ జన్మదిన శుభాకాంక్షలు. మీరి భలే లక్కీ అండీ.. ఎంచక్కా ఇంట్లో ఒకే రోజున రెండు బర్త్డే celebrations . :-)

    రిప్లయితొలగించండి
  6. సాయికి, సాయి నాన్న గారికి ఇద్దరికీ జన్మదిన శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  7. మీవారికీ ... '" రవిబ్రహ్మ " అందించిన అందాల " సాయి " కి ( కాస్త ఆలస్యంగా ) పుట్టినరోజు శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  9. రాణిగారు,ఆ ఒక్క వాక్యంలోనే అంతా ఉంది కదండీ .మీ శుభాకాంక్షలుకు ధన్యవాదాలు.
    @ఖమ్మం ,అలాగంటారామల్లిసారి ట్రై చేస్తాను.ధన్యవాదాలు
    @ మదురవాణి ధన్యవాదాలు. అవునండిఆరోజు మాకు ఇంట్లో పండగేనండి .
    @విజయ్ మోహన్ ధన్యవాదాలు.@దివ్యవాణి ధన్యవాదాలండి.
    @ధరణి రాయ్ గారు,ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  10. @జ్యోతి,@శివరంజని,@సూర్యలక్ష్మి,@రాజి,
    @సవ్వడి,@మంజు,@మలాకుమార్,
    ఎంతోఆప్యాయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిజేసినందుకు ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  11. రాధిక గారూ మీ బ్లాగ్ ఈ రోజే చూస్తున్నాను తరువాత తీరిగ్గా చదువుతాను. అన్నట్టు మా బాబు పుట్టిన రోజు కూడా జూలై 30 నేనండి. మీ వారికి మీ బాబుకి belated wishes. మళ్ళీ కలుద్దాం.

    రిప్లయితొలగించండి