మనకు అందుబాటు లో ఉండే వంటింటి దివ్యౌషదం" మిరియాలు ".
ఈ మిరియాలలో ఎన్నో ఔషద గుణాలున్నాయి.ముఖ్యంగా జలుబు ,దగ్గు తగ్గించడానికికి మిరియాలు చాలా బాగా పనిచేస్తాయి.
వర్షాకాలంలో అస్తమానూ జలుబూ,దగ్గు వస్తూఉంటాయి .ఇటువంటి చిన్న చిన్న వాటికి కూడా మాత్రలూ అవీ వాడకుండా మిరియాల కషాయం తాగి చూడండి. ..మీకే తేడా తెలుస్తుంది.
అమ్మో కషాయమా! అనుకుంటున్నారా? కషాయం అంటే సినిమాలలో అదీ చూపించినట్టు కష్టపడి తాగాలా అనుకోకండి. చేయడమూ కష్టం కాదు, తాగడము కష్టం కాదు .
మిరియాల కషాయం ఎలా చేయాలంటే...
ఒక స్పూన్ మిరియాల పొడి ,కొద్ది గా అల్లం ముద్దా ,గుప్పెడు తులసాకులు ఒక కప్పు నీళ్ళలో వేసి ఐదు నిమషాలు సేపు తక్కువ మంటపై మరగనివ్వాలి. దానిని ఒక గిన్నె లోకి తీసికుని , దానిలో ఒక స్పూన్ తేనె కలిపి ఉదయమూ ,సాయంత్రమూ తాగితే జలుబు తొందరగా తగ్గిపోతుంది .ఇది ఏరోజుకారోజే చేసుకోవాలి.
ఎవరికి జలుబు చేసినా మాఇంట్లో ఇదే మందు. . మా అబ్బయి మోదట్లో ఈ కషాయం తాగడానికి కొంచెం పేచీ పెట్టాడు కానీ ఇప్పుడు కాస్త తుమ్ములెక్కువగా వస్తే చాలు మిరియాల మందు కావాలి అని అడిగి మరీ చేయించుకుంటాడు.
మా ఇంట్లో మాములుగానే మిరియాలు ఎక్కువగా వాడుతుంటాము.అన్నిట్లోనూ వేస్తూ ఉంటాము. కొద్దిగా మిరియాలపొడి ,కొద్దిగా బెల్లమూ వేసి కలిపిన పాలు చాలా రుచిగా ఉంటాయి. ఎప్పుడైనా ఇలా తాగారా ? తాగి చూడండి .అలాగే ,ఆమ్లెట్ లోనూ కారం బదులుగా మిరియాల పొడి వేస్తే బాగుంటుంది. టి లో కూడా కొద్ది గా మిరియాలపొడి వేస్తే కొంచెం ఘాటుగా ఉండి గొంతుక్కి బాగుంటుంది .మిరియాల పొడి లేకుండా జున్ను అసలు వండరు .ఇలా అన్నిట్లోనూ మిరియాల పొడి ఉండాల్సిందే.
మిరియాలు , అల్లం రసం అజీర్ణ సమస్య ఉన్న వారు తీసుకుంటే బాగా పనిచేస్తుంది.అలాగే ఆకలి తక్కువగా ఉన్నవారు మిరియాల పొడిని ఒక స్పూన్ తేనే తో కలిపి తీసుకుంటే ఆకలి పుడుతుంది.మిరియాలు వేసి మరిగించిన నీరు పుక్కిలించి ఉమ్మితే పంటి నొప్పి తగ్గుతుంది.గొంతు నొప్పి ఉంటే కొన్ని మిరియాలు నోట్లో వేసుకుని చప్పరిస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది.ఇలా రక రాకాలుగా మిరియాలను ఉపయోగించొచ్చు.
ఇవన్నీ చిట్కాలే ఐనా వీటిని ఆచరించడం వలన ఒక్కోసారి తొందరగానే ఫలితం కనిపిస్తుంది .ఆచరించడం వలన నష్టమేమి ఉండదు కదా .ఇవన్నీ చేసినా ఎమీ లాభం లేక పొతేఇంక డాక్టర్ వద్దకు పరిగెత్తాల్సిందే.. .. .
అప్పుడెప్పుడో ఈనాడు ఆదివారం లో చదివాను, పోర్చుగీసు వారు రానంత వరకూ మనం వాడింది మిరియాలెనటా!!!
రిప్లయితొలగించండిపచ్చళ్ళ నుండి ఊరగాయల వరకూ కారప్పోడులనుండీ నుడికారం వరకూ మిరియాలనే వాడేవాళ్ళమట. ఇది శ్రీనాథ కవిసార్వభౌములవారు రాసిన పదకావ్యాల్లో కూడా ఉందిట
మంచిది మరి మిరియాలతో ఆవకాయ(మిరపకారం లేకుండా) ట్రై చేసి మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు పెట్టండి
అందరికీ ఉపయోగకరమైన టపా !
రిప్లయితొలగించండిబాగున్నాయి మీ చిట్కాలు. మిరియాలతో రసం పేడితే కూడా అదుర్స్...
రిప్లయితొలగించండిబాగున్నాయి మీ చిట్కాలు. పాలలో మిరియలపొడి కలిపి తాగితే కొంచెం జున్ను టేస్ట్ లా ఉంటుంది కదూ
రిప్లయితొలగించండి