ఘంటసాల గారు ఆలపించిన ఈ అద్భుతమైన పాట ఈ మధ్య నే చనిపోయిన కె.బి.తిలక్ గారి దర్శకత్వంలో 1965 లో వచ్చిన ఉయ్యాల జంపాల సినిమాలోది. పెండ్యాల నాగేశ్వరరావ్ గారు స్వరపరిచారు .వ్రాసింది ఆరుద్ర గారు.
ఘంటసాల గారు పాడిన ఇటువంటి మెలోడి పాటలను , ఈ లోకాన్ని మరిచి పోయి ఆనందంగా ఎంతసేపైనా వినేయవచ్చు.
కొండగాలి తిరిగిందీ ..కొండగాలి తిరిగింది గుండె ఉసులాడింది
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది ఆ ఆ ఆ .....ఆ ఆ ఆ ...
పుట్ట మీద పాలపిట్ట పొంగిపోయి కులికిందీ ఆ ఆ ఆ .....ఆ ఆ ఆ ...ఆ ఆ
పుట్ట మీద పాలపిట్ట పొంగిపోయి కులికింది....గట్టు మీద కన్నె లేడి గంతులేసి ఆడిందిఆ ..ఆ..
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్య మాడింది ఆ ఆ ఓ ఓ ఆ ఆ ...
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్య మాడింది పట్టరాని లేతవలపు పరవశించి పాడింది
కొండగాలి తిరిగింది గుండె ఉసులాడింది
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది ఆ ఆ ఆ .....ఆ ఆ ఆ ... .. ఆ ఆ ఆ .....ఆ ఆ ఆ ...
మొగలిపూల వాసనతో జగతి మురిసి పోయిందదీ ....
మొగలిపూల వాసనతో జగతి మురిసి పోయింది నాగమల్లి పూలతో నల్లని జడ నవ్విందిఆ ఆ ఆ ... ఆ..ఆ..ఆ..
పడుచుదనం అందానికి తాంబులమిచ్చిందదీ ...ఆ ఆ ఆ ... ఆ..ఆ..ఆ...
పడుచుదనం అందానికి తాంబులమిచ్చింది ప్రాప్తమున్న తీరానికి పడవ సాగి పోయింది ఆ ఆ ఆ... ...
కొండగాలి తిరిగింది గుండె ఉసులాడింది
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది ఆ ఆ ఆ .....ఆ ఆ ఆ ...
నాక్కూడా ఈ పాట చాలా ఇష్టమండీ! మీరీ పోస్టు చూశారా?
రిప్లయితొలగించండిhttp://madhuravaani.blogspot.com/2010/01/blog-post_26.html
అవును.
రిప్లయితొలగించండిపడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది అనే వరుస తెలుగు సినిమా పాటల్లో అత్యద్భుతమైన కవిత్వం అని నా అభిప్రాయం.
manchi paatanu, ishtamaiana paatanu vinipinchinanduku thanksandi..
రిప్లయితొలగించండిబాగుందండీ పాట :)
రిప్లయితొలగించండినాకు ఇష్టం అండీ
రిప్లయితొలగించండికొండగాలి తిరిగింది అని క్లియర్గా చెబుతూన్నా, గోదావరి తీర పల్లపు ప్రాంతాలు చూపారు. పిక్చరైజేషన్, కృష్ణకుమారి నాకు నచ్చని సీన్లు. ఈ పాట వినడానికి అనువైన సమయం మధ్యాహ్నం ఎండపొద్దులో ఓ ఏకాకి చెట్టునీడన. MP3 ప్లేయర్ కాకుండా పాత బుష్, ఫిలిప్స్ రేడియో ఇంకాబాగుంటుంది.
రిప్లయితొలగించండి