=''/>

29, అక్టోబర్ 2010, శుక్రవారం

కొండగాలి తిరిగింది

"కొండగాలి తిరిగింది ..కొండగాలి తిరిగింది గుండె ఉసులాడింది "ఎంత చక్కని పాట!ఎన్ని సార్లు విన్నా విసుగురాదు.చిన్నప్పుడు రేడియో లో వినటమే కానీ ఈ మధ్య వినలేదు .ఒకరోజు ఎఫ్ ఎం రేడియోలో విని , డౌన్ లోడ్ చేద్దామని చూస్తుంటే ఇదిగో ఇలా మిక్స్ చేసిన వీడియో దొరికింది .

ఘంటసాల గారు ఆలపించిన ఈ అద్భుతమైన పాట ఈ మధ్య నే చనిపోయిన కె.బి.తిలక్ గారి దర్శకత్వంలో 1965 లో వచ్చిన ఉయ్యాల జంపాల సినిమాలోది. పెండ్యాల నాగేశ్వరరావ్ గారు స్వరపరిచారు .వ్రాసింది ఆరుద్ర గారు.
ఘంటసాల గారు పాడిన ఇటువంటి మెలోడి పాటలను , ఈ లోకాన్ని మరిచి పోయి ఆనందంగా ఎంతసేపైనా వినేయవచ్చు.







కొండగాలి తిరిగిందీ ..కొండగాలి తిరిగింది గుండె ఉసులాడింది
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది ఆ ఆ ఆ .....ఆ ఆ ఆ ...


పుట్ట మీద పాలపిట్ట పొంగిపోయి కులికిందీ ఆ ఆ ఆ .....ఆ ఆ ఆ ...ఆ ఆ
పుట్ట మీద పాలపిట్ట పొంగిపోయి కులికింది....గట్టు మీద కన్నె లేడి గంతులేసి ఆడిందిఆ ..ఆ..


పట్టపగలు సిరివెన్నెల భరతనాట్య మాడింది ఆ ఆ ఓ ఓ ఆ ఆ ...
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్య మాడింది పట్టరాని లేతవలపు పరవశించి పాడింది

కొండగాలి తిరిగింది గుండె ఉసులాడింది
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది ఆ ఆ ఆ .....ఆ ఆ ఆ ... .. ఆ ఆ ఆ .....ఆ ఆ ఆ ...

మొగలిపూల వాసనతో జగతి మురిసి పోయిందదీ ....
మొగలిపూల వాసనతో జగతి మురిసి పోయింది నాగమల్లి పూలతో నల్లని జడ నవ్విందిఆ ఆ ఆ ... ఆ..ఆ..ఆ..

పడుచుదనం అందానికి తాంబులమిచ్చిందదీ ...ఆ ఆ ఆ ... ఆ..ఆ..ఆ...
పడుచుదనం అందానికి తాంబులమిచ్చింది ప్రాప్తమున్న తీరానికి పడవ సాగి పోయింది ఆ ఆ ఆ... ...

కొండగాలి తిరిగింది గుండె ఉసులాడింది
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది ఆ ఆ ఆ .....ఆ ఆ ఆ ...

6 కామెంట్‌లు:

  1. నాక్కూడా ఈ పాట చాలా ఇష్టమండీ! మీరీ పోస్టు చూశారా?
    http://madhuravaani.blogspot.com/2010/01/blog-post_26.html

    రిప్లయితొలగించండి
  2. అవును.
    పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది అనే వరుస తెలుగు సినిమా పాటల్లో అత్యద్భుతమైన కవిత్వం అని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
  3. కొండగాలి తిరిగింది అని క్లియర్గా చెబుతూన్నా, గోదావరి తీర పల్లపు ప్రాంతాలు చూపారు. పిక్చరైజేషన్, కృష్ణకుమారి నాకు నచ్చని సీన్లు. ఈ పాట వినడానికి అనువైన సమయం మధ్యాహ్నం ఎండపొద్దులో ఓ ఏకాకి చెట్టునీడన. MP3 ప్లేయర్ కాకుండా పాత బుష్, ఫిలిప్స్ రేడియో ఇంకాబాగుంటుంది.

    రిప్లయితొలగించండి