=''/>

2, నవంబర్ 2010, మంగళవారం

ఎన్నాళ్ళ కెన్నాళ్ళకి ...

ఆడపిల్ల్లలు ఎన్ని రకాలు డ్రస్లు వేసుకున్నా...పరికిణి - జాకిట్టు లోఉన్న అందం దేనిలో వస్తుంది!అసలు పరికిణి లో ఎంత ముద్దుగా ఉంటారు.వాళ్లనే చూడాలనిపిస్తుంది. ఇప్పటి ఆడపిల్లలు పరికిణి లు వేసుకోవడానికే ఇష్ట పడటలేదు..ఫంక్షన్ లలో వేసుకున్నా ఆ కాసేపు వేసుకుంటారు అంతే. .

నాకు వర్కులు చేయడం ఇష్టం కదా .చీరలమీదే కాకుండా మా ప్రియాకి కూడా రెండు పరికిణి ల మీద వర్కు చేసాను.
నాలుగేళ్ల క్రితం అది హాస్టల్కి వెళ్లక ముందు వరుసగా రెండు పుట్టినరోజులకీ రెండు పరికిణి లమీద కుట్టాను .


ఫోటో తీస్తానురా .. అనగానే చప్పున అటుతిరిగింది.

అప్పుడు ఇంటివద్ద ఉండడంతో ఇష్టంగా వేసుకునేది.హాస్టల్ కి వెళ్ళాక అక్కడ ఎవరూ వేసుకోరు అని, వేసుకోమని పెట్టిన వాటిని వెనక్కి తెచ్చేసేది. ఈ నాలుగేళ్ల లో వాటిని రెండు మూడు సార్లు వేసిందేమో అంతే .

చాలా రోజుల తరువాత ఎలాగో ఈ రోజు పరికిణి వేసుకుంది .అదీ ...వారం రోజుల నుండి నాతో బ్రతిమాలించుకుని , రకరకాల గొంతెమ్మ కోర్కెలన్నీ కోరి. నాతో గులాబ్ జాం,పాలకోవ చేయించుకుని తిని,దానికి ఇష్టమైన ఈత పాయల జడ వేయించుకుని , తప్పదురా అను కుంటూ వేసుకుందామని తీస్తే అది కాస్తా కురసైపోయింది .మళ్లి దాని ఫిల్టు విప్పి సరిచేసి దానితో ఆడ్రస్ వేయించే టప్పటికి నాతల ప్రాణం తోకకి వచ్చినంత పనైంది . .
ఈత పాయల జడ .రెండు పాయలు తీసి ,మళ్ళి చిన్న పాయలు తీసి జడ లా అల్లుతారు.

12 కామెంట్‌లు:

  1. నాక్కూడా ఈతపాయల జడ వేయడం వచ్చోచ్ :) :) కొంచెం టైం పట్టినా పూర్తయ్యాక భలే ఉంటుంది చూడటానికి.. ముందు మీ పాప జడకి దిష్టి తీసేయండి :-)

    నిజంగా పరికిణీ జాకెట్, లంగా ఓణీల అందం ఏ డ్రెస్ కీ రాదు కదా.. ఈ మధ్య మళ్ళీ పిల్లలు ఎక్కువగానే వేసుకుంటున్నారని విన్నాను..

    రిప్లయితొలగించండి
  2. నాకైతే మీ అమ్మాయి జెడ పిచ్చపిచ్చగా నచ్చేసింది.పోస్ట్ చదవకుండా కాసేపు ఆ జడను చూస్తు ఉండిపోయా! ఎంత ముద్దుగా ఉందో! నాకు చిన్నప్పుడు మా అమ్మ వేసిన జడ గుర్తుకొచ్చింది. నిషిగంధ గారు చెప్పినట్లు ముందు మీ అమ్మాయి జడకి దిష్టి తీయండి :))

    రిప్లయితొలగించండి
  3. radhika గారు..నిజమేనండీ బాబు..ఇప్పటిపిల్లలు అస్సలు ఇష్టపడటం లేదు పరికిణీలు..మాదాన్ని కూడా బ్రతిమాలి,బెదిరించి ఒక రెండుగంటలు ఒప్పించడానికి నానా బాధలు పడాలి..కళ్ళు ముక్కు ఏకం చేసుకుని మరీ ఏడుస్తుంది..చిన్నప్పుడు మా అక్క ఎప్పుడు ఈ జడేవేసేది నాకు...నిషి నిషి నీ దగ్గరకొచ్చెస్తా..నాకూ నేర్పవా..

    రిప్లయితొలగించండి
  4. అవునండీ.. మీరు దిష్టి తీసేయాల్సిందే! మీ అమ్మాయి జడ ఎంత బాగుందో.. మీరు భలే అల్లారు. :)

    రిప్లయితొలగించండి
  5. ee sari jada mida poolu kuda kuttesi photo tiseyyandi. Ammayi baagundi.

    రిప్లయితొలగించండి
  6. chinnapudu ma amma chetha nenu kuda ee jada veyinchukunedanni. dinni memu ullipaayala jada antamu.

    naku kuda langaoni vesukovalani entha koriko. chinapudu oka 2,3 times veuskunna emo maha ante. ma amma ni ippatiki plz ma konipinchave ani bathiladutha unta. langoni ente chiralu kattalsina age lo ani konipinchadu. konipisthe enchakka prathi pandakki ade vesukunedanni, em cheddam adrushtam undali denikina. saree kattalsina age lo langaoni lu kattukovalanipistundi :(

    oka vela naku pelli anedi raasi unte matuku thappakunda ma ayana chetha koninchukoni apudu vesukunta ma amma ki theliyakunda :)

    రిప్లయితొలగించండి
  7. @మంజు,చెప్పాలంటే ,ధన్యవాదాలు.
    @నిషిగంధ ,అవునండి ఈ జడ ఓపికగా వేస్తే చాలా బాగుంటుంది.జడకి దిష్టి తియాలంటారా?.మీరన్నట్టు లంగా ఒనీలు బాగానే వేసుకుంటున్నారు కానీ ,ఫంక్షన్స్ కేనండి బాబు.
    @ఇందు,అంత నచ్చిందా జడ?థాంక్స్ .

    రిప్లయితొలగించండి
  8. @నేస్తం,అయ్యో !పాపం పాపని మరీ అలా ఏడిపిస్తున్నారా?మరిఅక్క దగ్గరఈ జడ ఎలా అల్లాలో నేర్చుకోలేదా?
    @మదురవాణి,మీరందరూ అంతలా చెప్పేక ఎలా ఊరుకుంటాను ...దిష్టి తిసేసాగా:)జడ అంతగా నచ్చినందుకు దన్యవాదాలు.
    @జాబిల్లి ,ఫోటో తీసాక నాకూ అలానే అనిపించిందండి.ధన్యవాదాలు.
    @స్వప్న ,లంగా ఒనీ లంటే అంత ఇష్టమైతే అమ్మకి తెలియ కుండా ఒకటి కొనుక్కుని వేసేసుకోండి.ధన్యవాదాలు .

    రిప్లయితొలగించండి
  9. amma ki theliyakunda konukkaovali ante adi impossible endukante money kavaliga konukkovalante :(

    రిప్లయితొలగించండి
  10. chaalaa baagundandee...mee tapaa+parikinee+ jada..annee baagunnaayi...asalu paapa chaala muddugaa undi. oka saari photolo choosanu...chaala muddugaa undi..
    Ennela

    రిప్లయితొలగించండి