నిరుడు ఇలాగే జ్యోతిగారు బ్లాగ్ వనభోజనాలు ఏర్పాటు చేసినప్పుడు ,నేనూ నాకూ తెలిసిన,వచ్చిన వంటతో వచ్చేను.అప్పుడు అందరూ చేసిన రకరకాల వంటకాలతో ..."బ్లాగ్ వనభోజనాల విందు" అదిరిపోయింది.
ఈ" బ్లాగ్ వనభోజనాలు"కి నేను వండుకొచ్చిన వంట....
"ఆకాకరకాయ ఇగురు".
మా వైపు వీటిని ఆకాకరకాయలు అంటారు. వీటిని బోడ కాకరకాయలు అని కూడా అంటారని ఈ మధ్యే తెలిసింది.ఈ ఆకాకరకాయలతో వేపుడు చేయవచ్చు.అలాగే ఇగురు కూరా వండుకోవచ్చు .మేము ఎక్కువగా పాలు పోసి ఇగురుకూర వండుతాము.

ఆకాకరకాయలు - 1/4
ఉల్లిపాయలు -4
పచ్చిమిర్చి-3
ఉప్పు
ఉల్లిపాయలు -4
పచ్చిమిర్చి-3
ఉప్పు
కారం-1/2
పసుపు-కొద్దిగా
పాలు-చిన్న గ్లాస్ లో సగం
అల్లం వెల్లుల్లి ముద్ద-అర స్పూన్
పసుపు-కొద్దిగా
పాలు-చిన్న గ్లాస్ లో సగం
అల్లం వెల్లుల్లి ముద్ద-అర స్పూన్
పోపు సామాను:
సెనగపప్పు ,మినప్పప్పు ,ఆవాలు,జీలకర్ర, కరివేపాకు.
ఆకాకరకాయ లు(వీటిలో చిన్న చిన్న గింజలు ఉంటాయి. ఇవి ఇష్టం లేనివారు తీసేసుకుని ముక్కలు కోస్తారు, కానీ గింజలు కుడా రుచిగానే ఉంటాయి.)ఉల్లిపాయలు ,పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ముందుగా గిన్నెలో నూని పోసి తాలింపు పెట్టుకుని (ఎండుమిరప అక్కర్లేదు) ,దానిలో ఆకాకరకాయ ముక్కలు వేసి ఐదు నిముషాలు వేయించుకోవాలి. అప్పుడు దానిలో ఉల్లి,పచ్చిమిర్చి ముక్కలు వేసి అన్నింటినీ కాసేపూ వేగనివ్వాలి.అవి వేగేక, ఉప్పు,కారం,పసుపు,అల్లం వెల్లులి ముద్ద వేసికలుపుకుని మూతపెట్టి , చిన్న మంటపై కాసేపు మగ్గనిచ్చి ,తరువాతకొద్దిగా నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. ఐదునిముషాలయ్యాక దానిలో పాలు పోసి ,కూర బాగా నీరు లేకుండా ఇగరనివ్వాలి. ఇలా పాలు పోసి ఆకాకరకాయ కూర వండితే కమ్మగా ..మంచి రుచిగా ఉంటుంది. ఈ కూర చపాతీలో కీ ,అన్నం లో కీ కూడా బాగుంటుంది.
ఇదండిమన" బ్లాగ్ వన భోజనాలకి " నేను కష్టపడి వండుకొచ్చిన వంట . రుచి చూసి ఎలా ఉందో చెబుతారు కదా!
మా ఊరి మహిళలం అందరం కలసి క్రితం సంవత్సరంకొబ్బరి తోటలో కార్తిక వన భోజనాలు పెట్టుకుని చాలా సరదాగా గడిపాము. ఈ సంవత్సరం ఇంకా అనుకోలేదు కానీ, పాపి కొండలు అనుకుంటున్నాము....ఏమవుతుందో?
మీ ఆకాకరకాయ కూర చాలా బాగుంది. అయితే ఈ సారి మీ వనభోజనాలు పాపికొండల్లోనన్నమాట...
రిప్లయితొలగించండిమేము బోడకాకరగాయాలనే అంటాం. మా ఇంటిల్లిపాదికీ ఇది చాలా ఇష్టమైన కూర. ఇవి దొరికే సీజన్లో దాదాపు రోజు మార్చి రోజైనా ఈ కూర ఉండాల్సిందే. photo super! :)
రిప్లయితొలగించండిఅయ్యో ఆకాకర కాయలు గుర్తు చేసారా..ఇక్కడ దొరకవు గాని అమ్మ చేసేది ఈ కూర.అబ్బా భలే బాగుంటుంది
రిప్లయితొలగించండిప్రతి వంటకి రొటీన్ గా, ముందు ఉల్లి, మిర్చి వేగాక కూరగాయముక్కలు వేయమంటారు. మీరు వెరైటీగా బాగాచెప్పారు, ట్రై చేస్తా.
రిప్లయితొలగించండిKumar
మేమూ భోడ కాకరకాయలనే అంటాం:) కూర చాలా బాగుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప మిగతా రెసిపీ మాత్రం అదే.
రిప్లయితొలగించండిమా ఫామిలీ అంతా బోడకాకరకాయ ఫాన్స్! కానీ ఎప్పుడూ ఒకేలా వేయించి తింటాం. ఈసారి ఇలాగ ట్రై చేస్తాను.
రిప్లయితొలగించండిమావారికి ఇష్టమైన వీ ఆకాకర్కాయలు . అల్లం వెల్లుల్లి తప్ప మిగితా అంతా మేమూ ఇలాగే చేస్తాము .
రిప్లయితొలగించండిపాపికొండలకు వెళుతున్నారా ? హాపీ ట్రిప్ .
చిత్రమేమిటంటే ఈ ఆగాకరకాయలు నాకు అమెరికాలో పరిచయమయ్యాయండీ :) అప్పటి నుండి నా ఫేవరిట్స్ లో చేరిపోయాయి. ఫోటో బాగుంది.
రిప్లయితొలగించండిమేము ఆగాకరకాయలనే అంటాము.బాగుందండీ మీ ఇగురుకూర :) పాపికొండలకు వెళుతున్నారా? నాకు చాల ఇష్టం ఆ ప్రాంతం. గోదారమ్మని అడిగానని చెప్పండే!!
రిప్లయితొలగించండిఆకాకరకాయ కూర అంటే నాకు చాలా ఇష్టం.fry చేయటమే తెలుసు.ఈ సారి మీరిచ్చిన రెసిపి ట్రై చేస్తాను.
రిప్లయితొలగించండి@గీతిక ,ధన్యవాదాలు.పాపికొండలు అనుకుంటున్నముకాని, ఇంకా టికట్లుతిసుకోలేదండి.తుఫాను ఉంది అంటున్నారు.చూడాలి....
రిప్లయితొలగించండి@మధురవాణి,మా ఇంట్లో పిల్లలు తినరుకాని,మా అందరికీ చాలా ఇష్టం.మేమూ ఎక్కువగానే వండుతాము.ధన్యవాదాలు.
@నేస్తం,మీ అమ్మగారిని గుర్తుచేసానా నా కూరతో ...ధన్యవాదాలు.
@కుమార్ , చేదు కాకరకాయ ,ఆకాకరకాయ ఈ రెండు కూరలకు ముందుకూర ముక్కలు వేయిస్తారు.తరువాత ఉల్లిపాయముక్కలు వేస్తారండి.వెరైటి కోసం కాదండి ,ముక్కకి పై తొక్క తీయరు కదా బాగా వేగుతుందని.ధన్యవాదాలు.
@జయ , ఈ సారి అల్లం వెల్లుల్లి పేస్టువేసి కూరచేసి... చెప్పండి నాకు ఎలాఉందో? ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@కృష్ణప్రియ,అస్తమానూ ఫ్రై ఏనా?ఇలాకూడా ట్రై చేయండి .ధన్యవాదాలు.
@,మాలాకుమార్,థాంక్స్ అండి.
@వేణు శ్రీకాంత్,ఏంటి!అమెరికా వెళ్ళే వరకూతెలియదా దీని గురించి??ధన్యవాదాలు.
@.ఇందు ,తప్పకుండా చెప్తా:))) ధన్యవాదాలు.
@అను ,తప్పకుండా ట్రై చేయండి .చాలా బాగుంటుంది.ధన్య వాదాలు.
మేం బోడకాకరకాయాలనే అంటాం ఆహా వీటి fry అడిరిపోతుందండి నాన్-వెజ్ తినని వాళ్లకు ఇదో స్పెషల్ అనొచ్చు. నాకిష్టమయిన ఐటెం
రిప్లయితొలగించండిnaku noru urutundi akka.... naku chala estam aa kura.....
రిప్లయితొలగించండి@భాను,అవునండి...ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@ బాబి,అవునా??:)))ధన్యవాదాలు.
aa kakara kai kura gurunchi baga chepparu ippudu tinalanipisthunnadi
రిప్లయితొలగించండిఇది చిరంజీవికి ఇష్టమైన కూరటండీ.. మొన్న ఎలక్షన్స్ కి ముందు సురేఖ, తనూ కార్లో వెళ్తుంటే ఒక బండి మీద ఇవి కనిపించాయట. సురేఖ కొందామని అడిగితె కేజీ యాభై రూపాయలు చెప్పాడట.. కొనలేక వెళ్లిపోయారట.. "నా పరిస్థితే ఇలా ఉంటె, ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏమిటి? ధారలా మండిపోతున్నాయో.. వీటిని తగ్గించాలంటే ప్రజారాజ్యాన్ని గెలిపించండి" అని ఆవేదన చెందాడు. మీ టపా చూడగానే అంతా మళ్ళీ గుర్తొచ్చింది.. మేమీ కూర తినడం తక్కువే..
రిప్లయితొలగించండిఆకాకరకాయ అనగానే వచ్చేసానండి. నెట్ లేక ఆ రోజు నాకు వంటకం రాయటం కుదరలేదండి. నాకూ, మా ఇంట్లో(అమ్మావాళ్ళీంట్లో) అందరికీ చాలా చాలా ఇష్టమైన కూరండీ ఇది. హిందీలో దీన్ని "కంటోలా" అంటారు. ఐదారు రకాల రెసిపీలు నేర్చుకున్నా వీటితో నేను. వీలున్నప్పుడూ నా బ్లాగ్లో పెడతా..:)
రిప్లయితొలగించండిఆకాకరకాయ అనగానే వచ్చేసానండి. నెట్ లేక ఆ రోజు నాకు వంటకం రాయటం కుదరలేదండి. నాకూ, మా ఇంట్లో(అమ్మావాళ్ళీంట్లో) అందరికీ చాలా చాలా ఇష్టమైన కూరండీ ఇది. హిందీలో దీన్ని "కంటోలా" అంటారు. ఐదారు రకాల రెసిపీలు నేర్చుకున్నా వీటితో నేను. వీలున్నప్పుడూ నా బ్లాగ్లో పెడతా..:)
రిప్లయితొలగించండి