=''/>

29, నవంబర్ 2010, సోమవారం

"పెద్దింటి"కష్టాలు .


ముఖేష్ అంబానీ ఇప్పుడు ఇరవై ఏడు అంతస్తుల తన కొత్త ఇల్లు "అంటిలియా"లో ఉంటున్నారు.

మొన్నీమధ్య రోజులాగే 15వ అంతస్తులో ఉన్న పడక గదిలో ఆయన నిద్రలేచి ,17వ అంతస్తులో ... స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసారు. 19వ అంతస్తులో అల్పాహారం తిని ,ఆఫీసు కు వెళ్లేందుకు 14వ అంతస్తులో డ్రెస్సింగ్ చేసుకున్నారు.ఫైలు ,బాగ్ తీసుకునేందుకు 21 వ అంతస్తులో ఉన్న వ్యక్తిగత ఆఫీసుకు వెళ్లారు.13వ అంతస్తులో ఉన్న నీతా అంబానీకి ,పిల్లలకు బై చెప్పి ,3వ అంతస్తులో ఉన్న కార్ పార్కింగ్ కీ చేరుకున్నారు.తన మెర్సిడెస్ బెంజ్ కారును స్వయం గా నడుపుతూ ఆఫీసుకు వెళ్లేందుకు కారు వద్దకు వెళ్లారు.

కానీ, అప్పుడే ఆయనకు తెలిసింది... కారుతాళం చెవులు పై అంతస్తుల్లో ఎక్కడో మరిచిపోయినట్లు.....

కానీ ....అది ఎన్నో అంతస్తు ??? 15, 17, 19, 14, 21 వ అంతస్తా ? ? ? ? లేక 13వ అంతస్తా? ? ?

వెంటనే ముఖేష్ తన పని మనుషులకు ,కార్యదర్శులకు ,అటెండర్ల కు ఇలా అందరికీ ఫోన్లు చేసారు.

అంతే భారీ " ఆపరేషన్ తాళంచెవి " మొదలైంది.అన్నీ అంతస్తుల్లోను ఉరుకులూ,పరుగులూ.....

అయినా తాళంచెవి దొరకలేదు.గంట తరువాత ముఖేష్ భాయ్ ఓ సాధారణ ఐకాన్ కార్లో ఆఫీసుకు వెళ్లి పోయారు .

కట్ చేస్తే ....

మరుసటి రోజు తెల్లవారు జామున పై అంతస్తుల్లో పెద్ద శబ్దం రావడంతో నీతా బాబి బయటకు వచ్చింది.బాల్కని లోంచి లోనికి వస్తున్న ముఖేష్ ని "ఏమైందని "అడిగింది ."అదా ...జర్మనీ నుంచి హెలికాప్టర్ వచ్చింది .మెర్సిడెస్ బెంజ్ వాళ్ళు మన కారు డుప్లికేట్ తాళంచెవి పంపించారు" అని చెప్పారు.


అప్పుడు నీతా "మీ తాళం చెవి నిన్న మధ్యాహ్నమే దొరికింది .నాలుగు రోజుల క్రితం 14వ అంతస్తులో గదిలోని మీ బట్టలు లాండ్రీ కీ వేస్తుంటే ....మీ ప్యాంట్ జేబులో కనిపించింది .నేనే 16 వ అంతస్తులో ని షెల్ఫ్ లో పెట్టాను" అని తీరిగ్గా చెప్పిందట.

ఇవండి మన ముఖేష్ భాయ్ గారి 27 అంతస్తుల కొత్తింటి(పెద్దింటి) కష్టాలు ...


.

8 కామెంట్‌లు:

  1. హ్హహ్హహ్హా..సూపర్! భలే చెప్పారు! :):)

    రిప్లయితొలగించండి
  2. ఏదో పేపర్లో చదివానండీ.. మీరే రాశారా అక్కడ?? బాగుంది..

    రిప్లయితొలగించండి
  3. @మధురవాణి,@వేణుశ్రీకాంత్,ధన్యవాదాలండి .
    @నిషిగంధ,ధన్యవాదాలు :))))
    @మురళి,ఆంధ్రజ్యోతి లోనండి .పేపర్లో నేను రాయలేదండీ బాబు ....పేపర్లో చదివి, ఫన్నీగా అనిపించి...వాళ్ళదే నేను రాసాను.పేపర్ చూడని వాళ్ళ కోసమని :)))ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  4. హ్హహ్హహ్హ.భలే ఉంది.నాలుగు గదులు ఉన్న ఇళ్ళలోనే ఎదన్న వెతకాలంటే కష్టం...ఇక 27 అంతస్తులంటే...మీరు చెప్పినట్టే అవుతుంది

    రిప్లయితొలగించండి