పండుగ సీజన్ వస్తే చాలు `ఒకటి కొంటె ఒకటి ఉచితం,50%నుండి 70% వరకూ తగ్గింపుధరలు,మీ ఇంట్లో పాత వస్తువులు తెచ్చి ..మేమిచ్చే కొత్తవస్తువుతో వెళ్ళండని', ఇలా... రోజూ రకరకాల ఆడ్స్ తో పేపర్లలోనూ ,టివి ల్లోనూ.... మనల్ని ఊదరకొడుతూ ఉండడం చూస్తుంటాము.
నాకసలు ఇటు వంటిఆఫర్స్ లో బట్టలు అవి కొనడం ఇష్టముండదు. ఏం కొనాలన్నా,మేమెక్కువగా... రాజమండ్రే వెళ్తాము.పెళ్లి బట్టలు ,చిన్న చిన్న ఫంక్షన్స్ కీ విజయవాడ లో తీసుకుంటాము.
క్రితం గురువారం అనుకోకుండా షాపింగ్ కి వెళ్లి ఇటువంటి ఒక పిచ్చి,చెత్త, అతిచెత్త ,చెత్తాతిచెత్త , ....(ప్లిచ్ :( రాద్దామంటే నాకసలు తిట్లే రావడం లేదు!)ఆఫర్ మాయాజాలం వలలో చిక్కుకుని ...లాక్కుని ...పీక్కుని ,అతికష్టం మీద బయటపడి మా ఊరు చేరేటప్పటికి రాత్రి రెండైంది.
అలా ...మేము బయలుదేరి విజయవాడ వెళ్ళేటప్పటికే సాయంత్రం నాలుగైంది.(అంటే అందరూ పనులన్నీ ముగించుకుని వెళ్ళిపోయే సమయమం అన్నమాట). కళానికేతన్ లో బట్టలు బాగుంటాయి అంటారు కదా ...అని ముందు దీంట్లో చూద్దామని వెళ్లేము. అంతే!అక్కడే చిక్కడి పోయాము.
వెళ్ళగానే వాళ్ళ బట్టలమ్మే అమ్మయి వచ్చి,"మా కళానికేతన్ పెట్టి ముప్పైఐదేళ్ళు అయిందని" ....మంచి ఆఫర్ పెట్టాము. "మీరేమి కొన్నా దాంట్లో సగం డబ్బులు పెట్టి మళ్ళి బట్టలు కొనుక్కోవచ్చు"అంది.అది విని మా అత్తయ్య ఇదేదో బాగుంది .బట్టలన్నీ ఇక్కడే కోనేయవచ్చు! అనుకుంది. పరికిణి లు చూద్దామని చూసేము. ఒకటి బాగా నచ్చిందని కొందామని చూసేము.
మళ్ళి అది తీస్తే దాంట్లో సగం డబ్బులతో మళ్ళి బట్టలు కొనాలికదా .... అని అన్నీ చూసేము. ఏమీ పెద్ద నచ్చలేదు. వేరే కోట్టుల్లో చూద్దామని ...ఏడింటి నుండి తొమ్మిదింటి వరకూ అన్నీ తిరిగినా పరికిణీలు నచ్చలేదు .ఒకవేళ ఎమన్నా కొందామన్నా కళానికేతన్ లో లంగా కొంటే....మళ్ళి వాడి చెత్త ఆఫర్కి బట్టలు తీసుకోవాలి కదా అని," ఒక్క లంగా కోసం ఏమీ కొనకుండా", కాళ్ళు నెప్పి పుట్టేలా ... తిరిగి తిరిగి మళ్ళి ఆ కళానికేతన్ కే వెళ్లేము.
అప్పటికే తిండీ ..తిప్పలూ లేకుండా , అన్నీ తిరిగి తిరిగి ఉన్నాము .... ఇంటిదగ్గరనుండి పోన్లు మీద ఫోన్లు .ఇంకా బయల్దేరలేదా? అంటూ...ఇంకా ఏమైనా చూడలన్న ఉత్సాహం కుడా లేదు. వేరే ఏమీ చూడలేదు. మేము చూసి వెళ్ళిన లంగా ఎవరూ తీసుకోలేదు అనుకుని....ఆ పరికిణి తీసి పక్కన పెట్టి , తగ్గించిన బేలెన్స్ లో బట్టలు కొందామంటే.... రేటు నచ్చితే ,రంగు నచ్చదు.రంగు నచ్చితే ....క్వాలిటి నచ్చదు.ఎలాగో కిందా మీదా పడి ... ఆ ఉన్న వాటిల్లోనే ,నచ్చినా నచ్చక పోయినా ఒక్క పరికిణి కోసం నానా తిప్పలూ పడి .... వాడు కొట్టు కట్టేసి పొమ్మనే వరకూ అక్కడే ఉండి , వాడిని తిట్టుకుంటూ అన్నీ తీసుకుని వాడి" 50% కొనుగోలు ఉచితం" ఆఫర్కి ఒక దణ్ణం పెట్టి బయల్దేరి ఇంటికొచ్చేటప్పటికి అర్ధరాత్రి రెండైంది.
అవునండీ,ఈ ఆఫర్లతో నిజంగానె విసుగు వస్తుంది.
రిప్లయితొలగించండిఅన్నట్టు మీ తోట అందులోని పూలు, మొక్కలు చాల బావుంటాయి.
ayyo ala ayinda :(
రిప్లయితొలగించండిvijayawada lo bagane untaye battalu, enduko naku ila impression padindile vijayawada mida unna love kabolu :)
హ్హహహ! మీరు మాలాగే అన్నమాట.నాకు,మా అమ్మకి ఆఫర్లో బట్టలు కొనడమంటే ఎంత చిరాకో! ఎవరన్నా తోడు రమ్మన్నా అక్కడికి వెళ్ళాలంటే కంపరంగా ఉంటుంది.మీరు చందనా బ్రదర్స్ కి వెళ్ళండి ఒకసారి.....ఐదు నిమిషాలు కూడా ఉండలేరు.కొట్టుకుంటూ...మీద పడిపోతు...ఆ చీర నాదంటే...ఈ డ్రస్సు నీదని అబ్బొ! రచ్చరచ్చ లేండీ....పైగా వాడు అమ్మేవి అన్నీ పాతబడిపోయినవి.ఆఫర్ అది ఇది అని బిల్డప్ ఇస్తాడు.అంతే.మనవల్ల కాదులేండీ ఈ ఆఫర్లగోల :)
రిప్లయితొలగించండి:)
రిప్లయితొలగించండిచాలా ఇబ్బంది పడ్డారండీ పాపం.. వీళ్ళు ఇచ్చే ఆఫర్లు కూడా భలే చిత్రంగా ఉంటాయి.. వాళ్లకి మాత్రమే ఉపయోగ పడేలా..
రిప్లయితొలగించండి