మా ఊరిలో" వినాయక చవితి" సంభరాలు బాగా జరుగుతాయి.ప్రతీ సంవత్సరమూ లైబ్రెరీలోపెట్టి అక్కడే పూజ చేస్తారు.(లైబ్రెరీ లో వినాయకుడేంటి అనుకుంటున్నారా? మా ఊరి లైబ్రెరీ {ఆల్ ఇన్ } పోస్ట్ చదివితే తెలుస్తుంది)ఈ సారి మా గ్రామ కూడలి లో గణేశుని విగ్రహం నిలబెట్టారు.
ఈ సంవత్సరం మా ఊరి కుర్రాళ్ళు మంచి జోరుగా గణపతి ఉత్సవాలు జరిపించేస్తున్నారు.ఇక ఈ నాలుగు రోజులూ మైక్ ఫుల్ సౌండ్ లో పెట్టి మా చెవుల్లో తుప్పు వదిలించేస్తారు .చందాలు బాగా వసూలవడంతో ఆఖరి రోజు ఊరేగింపుకే ఏభై ఐదు వేలు ఖర్చు పెడుతున్నారు .ఇంకా మ్యూజికల్ ఆర్కెష్ట్రా ,ఇలా ఏవో ప్రోగ్రామ్స్ పెట్టారు .
ఆరు కేజీల లడ్డు .వేలం లో 5500 రూపాయలకి పాడారు.
మా ఊళ్ళో ప్రోగ్రామ్స్ చేయడానికి ఒకసారి వచ్చిన వాళ్ళు ఇంకోసారి రావడానికి ఇష్టపడరెమో అనిపిస్తుంది .ఎందుకంటే ఊరు చిన్నది కావడంతో ఏ ప్రోగ్రాం జరిగినా చూడడానికి వచ్చేవాళ్ళు గట్టిగా లెక్కేస్తే వంద మందికి మించరు.మ్యూజికల్ ఆర్కెష్ట్రా లాంటివైతే మా పక్కఊళ్ళ నుండికూడా చూడడానికి వస్తారు .ఐనా ఎంతకంతే...జనం లేకుంటే పాడే వాళ్ళ కు హుషారు ఎక్కడుంటుందండీ....

మా వినాయకుడి నిమజ్జనానికి ఉరేగింపు చాలా బాగా జరుగుతుంది.ఉళ్ళో ఇంచుమించు అందరి ట్రాక్టర్లు ఊరేగింపులో పాల్గొన్నాయి .ఉన్నవి నాలుగు వీధులైనా ఉదయం మొదలుపెట్టిన ఉరేగింపు ,నిమజ్జన కార్యక్రమమం అయ్యేటప్పటికి రాత్రి పదకొండు అయ్యింది.
ఈ సంవత్సరం స్పెషల్ కోయ డాన్సు
చాలా బాగున్నాయి మీ ఉత్సవాలు రాధిక గారు. మా దగ్గర గణపతి లడ్డూ ఇవాళే 12,000/- కి వేలం అయింది. ఊరేగింపు, కోయ డాన్స్ ఎంతో బాగున్నాయి.
రిప్లయితొలగించండిఫోటోలు బాగున్నాయండీ. ప్రేక్షకులు ఎక్కువమంది లేకపోయినా ఉన్న నలుగురు హుషారుగా చప్పట్లతో ఎంకరేజ్ చేస్తుంటే కళాకారులకి అదే తృప్తి కదండీ.
రిప్లయితొలగించండిమీ ఊరు బాగుందండి. మీ పోస్టులు కొన్ని చదివాను చక్కగా రాస్తున్నారు.
రిప్లయితొలగించండిజయగారు,వేణూ శ్రీకాంత్ గారు,Kishore Varma Dantuluri ధన్యవాదాలండి.
రిప్లయితొలగించండిlast photo is highlight, Ramudu active gane vunnadu kani, Lakshmandu weak ipoyyadu, konchem panakam evvochu ga ..
రిప్లయితొలగించండియాదృచ్చికంగా మీ ఈ ఫోటోలని ఈరోజే చూసాను. మీరు చాల అదృష్టవంతులండీ .... చక్కటి సంప్రదాయాలు ఇంకా బ్రతికి ఉన్న వాతావరణంలో ఉంటున్నారు. మీ ఊరిలో ఐకమత్యం బాగా ఉంటుందనుకుంటా .. ?? అందుకే కార్యక్రమాలు చక్కగా చేస్తున్నారు. ఈ సంవత్సరం టపా కూడా ప్రచురించండి .
రిప్లయితొలగించండి