=''/>

24, జనవరి 2013, గురువారం

హిందీ సీరియళ్ళు


రాధా మధు ,అమ్మమ్మ డాట్ కామ్ ,అమృతం వంటి మంచి సీరియళ్ళు   తీసిన గుణ్ణంగారి నుండి  ఈమధ్య  ఏమీ సీరియల్ రాలేదు.బాగుంటుంది  అనుకున్న ఆ మొగలిరేకులు  ఎన్ని రోజులున్నా  జీడిపాకంలా ఇంకా సాగుతూనే ఉంది.  మిగిలిన    సీరియళ్ళైతే  చెప్పక్కర్లేదు నాకైతే వాళ్ళ మేకప్పులు చూస్తే చాలు చానల్ మార్చయాలనిపిస్తుంది.

ఇన్ని తెలుగు  చానళ్ళు రాక ముందు   దూరదర్శన్ లో తెలుగులో ఋతురాగాలు,కస్తూరి  ,హిందీ లో ఉడాన్ ,సర్కస్  వంటి  సీరియళ్ళు  బాగా చూసేవాళ్ళము.అప్పుడు వారానికి ఒక్కసారే వచ్చినా ఆ ఎపిసొడ్ కోసం ఇంట్లో అంతా  ఆత్రుతగా ఎదురుచూసేవాళ్ళము. ఇప్పుడూ, ఏదైనా సీరియల్ కాస్త బాగుంటుంది... ఇది చూడొచ్చు అనుకునే టప్పటికి సాగదీయడం మొదలుపెట్టేస్తారు.మనకు విసుగొచ్చి చూడటం మానేయాలి.

పగలు మాకుండే కరెంట్  కోతల వలన  టీవీ చూడాలన్న ద్యాస ఉండదు  కానీ రాత్రి కాసేపు చూద్దామంటే   అన్ని సీరియళ్ళూ ఒకేరకం అత్తాకోడళ్ళ తగువులు,ఎత్తుకుపైఎత్తులు,వంకరనవ్వులూనూ.మన వాళ్ళని తక్కువ చేయడం కాదు కానీ  కాస్త కొత్తగా ఆలోచించి తీయోచ్చుకదా  అనిపిస్తుంది.

  ఇదివరకు అప్పుడప్పుడూ  స్టార్,జీ లో హిందీ సీరియళ్ళు చూసేదానిని కానీ రెండో టీవీ వచ్చాక హిందీ సీరియళ్ళుకు బాగా అలవాటుపడిపోయా .అలా అని అన్నీ చూసేయను .

నార్త్ లో నిజంగా ఉమ్మడికుటుంభాలు ఉంటాయో లేదోకానీ హిందీ సీరియళ్ళలో చాలామటుకు  ఉమ్మడికుటుంభాలకు సంభందించిన కథలే.  వాళ్ళ సెట్టింగులూ,డ్రెస్స్లూ అన్నీ చాలా రిచ్ గా చూపిస్తారు.ఒకదానిలో యాక్ట్ చేసిన వాళ్ళూ ఇంకోదానిలో ఉండరు.ఒకళ్ళిదరు ఉండొచ్చేమోకానీ చాలా వరకూ కొత్తవాళ్ళతోనే తీస్తారు . అందుకే కొత్త సీరియల్ ఏదైనా వస్తే కొన్ని రోజులు చూస్తాను.అసలు కథ ఐపోయి సాగదీయడం మొదలు పెడితే  ఇక చూడను.

జీ  లో 7.30 కి సప్నే సుహానా  బాగుంటుంది.8 గంటలకి  కలర్స్ బాలికావదు  బాగుంటుంది కానీ  సాగదీస్తున్నాడు. స్టార్ లో8.30కి  ఏక్ హజారోమె  మేరే బహెనా  , కలర్స్ లో మధుబాల రెండూ కలిపి ఒకేసారి చూసేస్తా.    స్టార్లోనే రాత్రి  10 గంటలకి వచ్చే ప్యార్ కా దర్ద్  మైనేప్యార్ కియ,హం ఆప్కే హై కౌన్   వంటి   సినిమాలు తీసిన  రాజశ్రీ వాళ్ళది  .టైటిల్  సాంగ్ చాలా బాగుంటుంది.పాత  హిందీ పాట


 


 కొన్నిరోజులు చూసి బోర్ కొట్టి చూడటమ్ మానేసిన వన్నీ  ఇప్పుడు మా టివీ లో డబ్  చేసి వేస్తున్నారు.మద్యాహ్నం 3 గంటలనుండి  7.30 వరకూ అవే.

4 వ్యాఖ్యలు:

 1. నేను హిందీ సీరియల్స్ చాలా వరకూ చూస్తాను. పగలంతా అదేపనిగా రీపీట్ అవుతూ వుంటాయికదా
  స్టార్ ప్లస్ లో దియా ఔర్ బాతి సీరియల్ బావుంటుంది.
  సోనీలో పర్వరిష్ కూడా చూడొచ్చు .

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. దియా ఔర్ బాతీ హం ఇదివరకు రోజూ చూసేదానిని .అది మా గోల్డ్లో ఈ తరం ఇల్లాలు అని వేస్తున్నాడు.పరివారిష్ అప్పుడప్పుడూ చూస్తాను.అల్ల్

   థాంక్స్ లలితగారు.

   తొలగించు
 2. colors చానల్ లో 08.00 to 9:30 రెండు మూడు సీరియల్స్ నాకు నచ్చుతాయి. బాలిక వధు, మధుబాల , సంస్కార్ ,

  ప్రత్యుత్తరంతొలగించు