ఇవి కొత్త పప్పులు వచ్చేరోజులు. మాకు(మా ఊళ్ళో చాలా మందికి)అపరాలు పండక పోయినా మినుములు,కందులు,పెసలు,బొబ్బర్లు కొనుక్కుని వాటిని తిరగలితో ఇసురుకుని ,బాగుచేసుకుని జాగర్త చేసుకోవడం అలవాటు.
ఇప్పుడు చాలామంది కొట్ల మీద కొనుక్కోవడమే... మీ ఊళ్ళోనే మరీ చాదస్తంగా చేయిస్తారని మా అమ్మమ్మాళ్ళు అంటారు కానీ ,మేమెప్పుడూ ఇలానే చేసుకుంటాము. నలుగురైదుగురం కలిపి తెప్పించుకుంటాము.
తెప్పించుకోవడంతోనే సరా!వాటిని బాగుచేయించుకున్నాక , మిగిలినవి పరవాలేదుకానీ మినుములిసురుకునే తిరగలికోసం వేట మొదలెట్టాలి.వేటెందుకంటే?మినుములు చిన్నగా ఉంటాయి కదా!సరైన తిరగలితో ఇసరక పోతే పప్పు సరిగ్గా రాదు నూక ఎక్కువగా వస్తుంది. అందుకని ఈరోజుల్లో మాఊళ్ళో మినుములిసురుకునే తిరగలికి మహా గిరాకీ అన్నమాట!
ఈతిరగళ్ళు రెండే ఉంటాయి. ఒకటి పై వీధిలో యెద్దనపూడోళ్ళది,ఇంకోటి మా ఆచంటోళ్ళ నలుగురికీ ఉమ్మడిది.అంటే ఎప్పుడో మా తాతమ్మ వాడింది .వాళ్ళ పిల్లలైన మా తాతలది.ఇప్పుడు వాళ్ళ పిల్లలది .
మా సాయికి ఇసరడమంటే చాలా ఇష్టం .తిరగలేసేటప్పటికి తయారైపొతాడు నేను నేనంటూ...
తిరగలేసుకుని కూర్చుంటే బస్తాడు ఇసిరే వరకూ అక్కడి నుండి కదిలే వాళ్లము కాదని నానమ్మ అస్తమానూ అనేది. మేమా ...పనోళ్ళు ఇసురుతుంటే సరదాగా ఇసరడానికి కూర్చున్నా గట్టిగా అరగంట కూర్చుంటే గొప్పే !అయినా మన నానమ్మలు,అమ్మమ్మల్లా ..మనం చేయగలమా?ఆ రోజుల్లో వాళ్ళు తిన్న ఆరోగ్యవంతమైన ఆహారాన్ని బట్టే అలా పనులు చేసే వాళ్ళేమో !
ఇలా ఇసరడం ,చాటతో చెరగడం వంటి పనులు పనులు చేయడం ఇప్పుడు మాకే కాదు ,పనోళ్ళ క్కూడా రావడంలేదు.
ఏదో చేసే వాళ్ళున్నారని కానీ ,ఇలా చేసే వాళ్ళెవరూ దొరకనప్పుడు మేమూ పప్పులన్నీ కొనుక్కోవడానికి అలవాటు పడక తప్పదుకదా!
ముచ్చటయిన చిన్న తిరగలి ఉంది కావాలంటే పంపుదును కదా :)
రిప్లయితొలగించండిమీరు నిజంగా పంపిస్తే ఎందుకు తీసుకోనండి?ఈ రోజుల్లోఅసలే చిన్న తిరగళ్ళు దొరకడంలేదు.. ధన్యవాదాలు
తొలగించండిభలే తిరగలి చూసి ఎన్నాళ్ళు అయిపోయిందో, బియ్యం నూక ఉప్మా కోసం, ఇంకా వేరే పప్పులు కోసం చిన్నప్పుడు ఇసరడం గుర్తొచ్చింది. దాని మీద గిలక ప్రతీ సారి ఊడిపోయేది. ఇసిరేటప్పుడు ఆ నూక కొంచెం నోట్లో వేసుకుని బయటకి ఆటలు కోసం పరిగేట్టేవాన్ని. నానబెట్టిన బియ్యం తింటే పెళ్లి నాడు వర్షం వస్తుందంటా ?? నిజమో కాదో తెలియదు ఇంకా చూడాలి నా పెళ్లి నాడు.
రిప్లయితొలగించండిఆ గిలకని మేము గురుజు అంటామండి .బాగుందండి...మీ పెళ్ళప్పుడు వాన పడిందోలేదో మర్చిపోకుండా నాకు చెప్పాలి అజ్ఞాత గారు .ధన్యవాదాలు
తొలగించండిఎన్నేళ్ళైపోయిందో తిరగలి చూసి!! తిరగలితో మాకు పనిబడేది అంటే అమ్మ పని చెప్పేది సమ్మర్‌లోనే! పొలంనించి మినుముల బస్తా వచ్చేది.. వాటిని కడిగీ, మేడ మీద ఆరబోసి, మళ్ళీ డబ్బాలకెత్తేదే పెద్ద ప్రహసనం అనుకుంటే... ఇహ తిరగలి పట్టడం ఇంకోటి! నా టర్న్ వచ్చినప్పుడల్లా పైన అజ్ఞాత గారు చెప్పినట్టు ఆ గిలక నిమిషం నిమిషానికి ఊడి పోయేది.. అది చూసి అమ్మమ్మ పిచ్చ తిట్లు! 'ఆడపిల్లవి, వాటుగా తిరగలి తిప్పడం కూడా రాకపోతే ఎట్లా!' అని.. ఆపైన, ఒక ఐధునిమిషాలకే చేతులు తెగ నొప్పి పుట్టేసేవి! అమ్మా వాళ్ళేమో వృత్తలేఖినితో సర్కిల్ గీస్తున్నంత సులువుగా ఓ ఆపకుండా తిప్పేసేవాళ్ళు!
రిప్లయితొలగించండిమీ పోస్ట్‌తో ఆరోజుల్లోకి మళ్ళీ లాక్కెళ్ళిపోయారండీ! :)
నాకు కూడా ఇసురుతుంటే గురుజు అస్తమానూ ఊడిఫోఅతుంది.కూర్చున్న పదినిముషాల్లో పదిసార్లూడుతుంది :) నిజంగానా??:)) ధన్యాదాలండి
తొలగించండిభలే ఉందండీ మీ బ్లాగు. మీ ఊరు, మీ కబుర్లు.. అలాగే ఈ పోస్టు.. అన్నీ చాలా చాలా బాగున్నాయి :)
రిప్లయితొలగించండిఇక తిరగలి సంగతేమో గాని రాధిక గారూ రుబ్బు రోలు కోసం ఈ చెన్నై పట్టణం లో వెదికి వెదికి అలిసిపోయానండీ :(
నచ్చినందుకు ధన్యవాదాలు ప్రియ గారు .మా అమ్మాయీ పేరు ప్రియానే :))
తొలగించండిఎన్నాళ్ళవుతుందోనండీ తిరగలిని చూసి, భలే ఉంది.. చిన్నప్పటి రోజులను గుర్తుచేశారు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు వేణూశ్రీకాంత్గారు
రిప్లయితొలగించండిఆహా...తిరగాలి చూసి చాలా ఏళ్ళయిపోయింది. మీరు ఊరి కబుర్లు భలే ఉంటాయండి.
రిప్లయితొలగించండి"తిరగలి కోసం తిరగాలి" ... బావుందండి ... అవునండి మరి ఈ రొజుల్లో "తిరగలి" కావాలంటే తిరగాలి మరి :) ... ప్రాస బాగా కలిసిందండి ... తెలుగు భాష ఎంత గొప్పదో కదండి . అక్షరం మారితే అర్ధమే మారిపొతుంది.
రిప్లయితొలగించండిచిన్ననాటి రోజుల్లో కి తిరిగి తొంగి చూసేలా చేసారండి ... తిరగలి ని చూపించి :) ...
మీకు ధన్య వాదాలు. ....
సుధీర్
ధన్యవాదాలు సుధీర్ గారు
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి