=''/>

8, జనవరి 2013, మంగళవారం

ఉడుతలు.


ఉరుకులు పరుగులుతో  ఏదో పనున్నట్టు అస్తమానూ  హడావిడిగా అటూ  ఇటూ  తిరుగుతూ ,కొత్తవాళ్ళెవరన్నా వస్తే ,వీళ్ళు ఉడుతలు పెంచుకుంటున్నారా?అనుకునేలా  తిరుగుతూంటాయి మా ఇంట్లో ఉడుతలు. 

ఒకదాన్నొకటి తరుముకుంటూ ,మధ్య మధ్యలో మా టామీ దగ్గరకొస్తూ,అప్పుడప్పుడూ దానిని కూడా కవ్విస్తుంటాయి.ఒక్కోసారి టామీ వాటి మీద పగ బట్టినట్టు అరుస్తాది.పాపం  ఇదేమో కట్టేసుంటుంది ...అవలా  స్వేచ్చగా తిరుగుతూ ,ఆడుకుంటూంటే ఇది చుడలేక వాటి మీద అలా అరుస్తాదేమో అనుకుంటాము.  

పిల్లలు హాస్టల్ నుండి ఇంటికొచ్చినా,మా చెల్లి పిల్లలొచ్చినా  వాటి వెనుకే తిరుగుతూ,గమనిస్తూ కలక్షేపం చేస్తుంటారు. (కరెంటు లేకపోతే)

సరుకులేవన్న ఎండలో పెడితే చాలు వచ్చేస్తాయి.అవెంత తింటాయిలే అని  పట్టించుకోము కానీ అస్తమానూ తింటానే  ఉంటాయి. 

ముద్దు ముద్దు  మా ఉడుతల   చిత్రాలు మీకోసం ....
గుమ్మడి గింజలు  వలవడానికి  ఎండలో పెడితే (మాకెమీ మిగల్చకుండా ) ఎంతందంగా  వలుచుకుని  తింటుందో ...


ఎండబెట్టడానికి  ఏవిపెట్టినా ఇలా  తయారైపోతాయి .


పొలంనుండి  తెచ్చిన గంటి కంకులు సరదాగా కుండీలో గుచ్చితే  మరునాడికి  ఇలా అయిపోయాయి.


మధ్య మధ్యలో  దాహమై  నీళ్ళు  తాగుతూ ....

ఎవరైనా వస్తారేమో  అని బెదురు  చూపులు  చూస్తూ ...

12 వ్యాఖ్యలు:

 1. very nice..thanks for sharing !
  వాటిని 'గంటి కంకులు' అంటారాండి? ఎక్కడీ దొరికినప్పుడు నేను వాటిని కోసుకొచ్చి రంగులు వేసి ఫ్లవర్ వాజ్ లో పెట్టాను..

  ప్రత్యుత్తరంతొలగించు
 2. భలే బాగున్నాయి. వీటితో మీకు మంచి కాలక్షేపమనమాట!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. so cute !
  కంకులన్ని బాగా లాగించాయి :)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. so cute !
  కంకులన్ని బాగా లాగించాయి :)

  ప్రత్యుత్తరంతొలగించు
 5. సూపర్ అండి భలే క్యూట్ గా ఉన్నాయి

  ప్రత్యుత్తరంతొలగించు
 6. తృష్ణ ,జయ,రసజ్ఞ,కృష్ణప్రియ,ఆ.సౌమ్య,చైతన్య.ఎస్

  కాస్త లేటుగా చెబుతున్నా.అందరికీ ధన్యవాదాలండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. Awww... really cute :)
  ఈ ఫొటోస్ అన్నీ మాతో పంచుకున్నందుకు థాంక్స్ రాధిక గారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. ఆహా ఫోటోలు ఎంత బాగున్నాయో మాటల్లో చెప్పలేనండీ...
  వెంటనే వీటితో దోస్తీ కట్టేయడానికైనా మీ ఇంటికి వచ్చేయలనిపించేంత బాగున్నాయ్ :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 9. Satya,

  I am a great fan of your Blog and you..the way you live and do things...cheppadam rakapodam sapam .. kanii cheppalanna atranni adi continue cheyinchadam andulo varam !

  mee fan
  sridevi

  ప్రత్యుత్తరంతొలగించు