=''/>

29, ఏప్రిల్ 2013, సోమవారం

పాపికొండల్లో మా ప్రయాణం (ఫోటోలు)

అటూ ఇటూ ఎత్తైన కొండలు ........ఎక్కడో దూరంగా అక్కడక్కడా కనిపిస్తున్న చిన్న చిన్న పల్లెలు ,అప్పుడప్పుడూ ఎదురవుతున్న జాలర్ల పడవల మధ్య గోదావరిలో  పురుషోత్తపట్నం నుండి పేరంటపల్లి వరకూ  తొమ్మిది గంటల లాంచీ  ప్రయాణం ..... మరచిపోలేని మధుర అనుభవం!

నాలుగేళ్ళ క్రితం ఒకసారి పాపికొండలు  వెళ్లేము .అప్పుడు మా  అమ్మాయి రాలేదు .తను అస్తమాను పాపికొండలు వెళ్దాం అంటుంటే  తన కోసమని  ఈ   మండే ఎండల్లో   ప్రయాణం చేసేము.అసలు పాపికొండలు వెళ్ళాలంటే నవంబర్ నుండి   మార్చి లోపైతే   ప్రయాణం హాయి హాయిగా చల్ల చల్లగా సాగిపోతుంది .

మా ప.గో.జిల్లా నుండి పట్టిసీమ ,పోలవరం ,సింగనాపల్లి నుండి లాంచీలు ఉంటాయి.మాకు పట్టిసీమ దగ్గరే కానీ మార్చి వరకే  పట్టిసీమ నుండి లాంచీలు తిరుగుతాయంటే  రాజమండ్రి వెళ్లి వెళ్లేము.రాజమండ్రి  నుండి  లాంచీలు వెళ్ళవని మాకు అక్కడకి వెళ్ళేవరకు తెలిలేదు.రాజమండ్రి నుండి పురుషోత్త పట్నం గంట కారులో తీసుకెళ్ళి అక్కడ లాంచీ ఎక్కించేరు.

 అది  ఏసీ లాంచీ  ఐనా వెళ్ళింది  ఏసీ లో కూర్చోవడానికి కాదుకదా! అని లాంచీ పైనే  ఉక్కపోతని,మండే ఎండని భరిస్తూ  గోదావరి అందాలను అస్వాదించాము .

ఉదయం పది గంటలకు బయలుదేరిన లాంచీని  మధ్యలో గండి పోసమ్మ గుడి  దగ్గర ఇరవై నిముషాలపాటు  ఆపారు .తిరిగి బయలుదేరిన మేము మధ్యాహ్నం రెండు గంటలకు పేరంటపల్లి వెళ్లేము .

పేరంటపల్లి  అనుభవం మాత్రం ఎప్పటికీ మర్చి పోలేము .

అప్పటి వరకూ  ఎండని భరించలేని మేము ఆ వేడి ,ఉక్కపోత భరించలేక తిట్టుకుంటూ కూర్చున్నాము .అక్కడ  దిగగానే  హోరున వాన కురవడం మొదలైంది. పేరంటపల్లిలో ఒడ్డున పెద్ద చింత చెట్టు వయస్సు చాలా ఉంటుంది .అక్కడ చాలా సినిమాల్లో పాటలు తీస్తారు.అవన్నీ పిల్లలకు  చూపించొచ్చు అనుకుంటే పాడు వానవలన ఏమీ కుదరలేదు.ఎక్కడా పెద్దగా మబ్బుల్లేవు అదే తగ్గిపోతుందనుకుంటే ఇరవై నిమషాలు ఆగకుండా కురిసింది.అలా ఆవర్షం లోనే తడుస్తూ  అక్కుడున్న శివాలయం చూసి ,తిరిగి లాంచీ  ఎక్కుదామని   మళ్ళీ వర్షం లోనే తడుస్తూ తిరిగి వచ్చేము. 

ఎలాగో వర్షంలో తడుస్తూ పరుగులు పెడుతూ వస్తే  ఇక్కడి సీను ఇంకా గొప్పగా ఉంది !

ఎత్తెన గోదారి గట్టు మీద నుండి ఒడ్డున ఉన్న లాంచీ ఎక్కడానికి   అరగంట పట్టింది.అడుగు తీసి అడుగు వేయాలంటే భయం.ఎక్కడ కాలుజారి  గోదారిలోకి జారతమో అని! ఒకరికొకరం సాయం చేసుకుంటూ ఆ బురదలో   పడుతూ ..లేస్తూ ,జారుతూ,దేకుతూ ... వళ్ళంతా ,బట్టల్నిండా  బురద  అంటుకున్నా లెక్కచేయకుండా  ...పిల్లలకు ధైర్యం చెపుతూ ఎలాగో అందరం క్షేమంగా లాంచీ ఎక్కేసేము.

దానిని భయంకరమైన అనుభవం అనాలో  సరదా  అనుభవం అనుకోవాలో .....ఆ  రోజు జరిగిన సంఘటన ని తలుచుకుంటే  ఎంత గండం గడిచింది అనిపిస్తుంది.అంతలోనే  అంత బురదలో జారుకుంటూ  అలా వెళ్ళడం  తమషాగా  ఉందనిపిస్తుంది.ఇంటికొచ్చాక కూడా ఆ సంఘటన ను తలుచుకుని  ,మా తిప్పల్ని గుర్తు తెచ్చుకుని తెగ నవ్వుకున్నాము.ముందు లాంచీ ఎక్కినోళ్ళెవరైనా మనల్ని విడియోకానీ ఫోటో కానీ  తీయల్సిందే! అని మా  పిల్లలు ...


లాంచీ ఎక్కేక కూడా కాసేపు వర్షం పడింది.అందరం  అలా తడిసిన బట్టలతోనే  కూర్చున్నాము . ఎవ్వరిలోనూ వచ్చినప్పటి  ఉత్సాహం  లేదు.అప్పటి వరకూ ఎండ భరించలేక తిట్టుకున్న మేము ఎండ కోసం ఎదురుచుసాం.దేవుడి దయవలన ఎలాగో కాసేపటికి మబ్బులు తొలిగి ఎండొచ్చింది.తడిసి ఉన్న మేము ఈ సారి ఆనందంగా  ఎండలో  కూర్చున్నాము.కాసేపటికి  ఎండ  తగ్గి చలిగాలి మొదలైంది .ఆ చలిలోనే కాసేపుండి  ఒక్కరోజులోనే  ఎండా,వానా,చలీ  మూడూ  చూసేసేం. 

తిరిగి లాంచీ  పురుషోత్తపట్నం వచ్చేటప్పటికి  రాత్రి ఎనమిది ...రాజమండ్రి  వెళ్ళేటప్పటికి  తొమ్మిది ...మా ఊరు చేరేటప్పటికి పదిన్నర .

అలా మా పాపికొండల ప్రయాణం  సరదా సరదా గా ,భయం భయం గా తమాషాగా  జరిగింది.




ఇదే  మా జలశ్రీ లాంచి 



జానికిరముడు,శ్రీరామదాసు  ఇంకా చాలా సినిమాలు  ఈ గుడిలో  తీసారట  















                                        ఇక్కడకూడా ఎదో తవ్వేస్తున్నారు .ఏ కొండలూ ఉంచరేమో!



                                             





























       పాపికొండల మధ్య గోదావరి!!











                    అక్కడ ఉన్న చిన్న గిరిజన పల్లె  పిల్లల ఆట పాటలు













చిన్న చిన్న గుడిసెలు వాటి ముందు వాళ్ళ పడవలు .మన ఇళ్ళ ముందు కార్లు,బైక్ లు  ఉన్నట్టు!





మనిషి ఆకారం లో ఉన్న ఈ కొండ పాపి అనే రాక్షసుని పేరుమీద  ఏర్పడిందని అక్కడివారు అంటారట .


తిరిగి వచ్చేటప్పుడు సూర్యాస్తమయ చిత్రాలు తీయాలని ఎంతగానో అనుకున్నా...కేమెరా చార్జింగ్ అవ్వకుండా ఉండాలని పిల్లల్ని ముట్టుకోనివ్వలేదు . బాగా మబ్బులు ఉండటంతో  తీయలేకపోయా :((   వీటితోనే సరిపెట్టుకున్నా.

29 వ్యాఖ్యలు:

  1. మీ పాపికొండల అనుభవం బాగుందండి. ఇలాంటి 'ప్రాక్టీసులు' ఉండాలండి. అప్పుడే మజా.మీ పాప తప్పకుండా ఎంజాయ్ చేసే ఉంటుంది:) ఫొటోలు చాలా బాగున్నాయి. నేను కూడా ఈ మధ్యనే పాపికొండలు వెళ్ళొచ్చాను.

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. మీరన్నది నిజమే ఆ సీను తలచుకుంటే ఇప్పటికి నవ్విస్తుంది .మీ హాపికొండల పోస్ట్చ చదివాను .మాకన్నా వరం ముందే వెళ్లారు .ధన్యవాదాలండి

      తొలగించు
  2. ఫోటోలు బాగున్నాయండీ.. అయితే మళ్ళీ ఇంకోసారి శీతాకాలంలో పాపికొండలు ప్రయాణం పెట్టుకుంటే సరి.. :)

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. ధన్యవాదాలు.అవునండి మళ్ళి వెళితే శీతాకాలం వెల్తాము

      తొలగించు
  3. చాలా కాలం నుంచి వెళదాం అనుకొంటున్నా ఇప్పటివరకూ వీలుకుదరలేదు. ఫోటోలు బాగా తీశారు.

    ప్రత్యుత్తరంతొలగించు
  4. బాగున్నాయండీ మీ ట్రిప్ కబుర్లు ప్లస్ ఫోటోలూనూ :-)

    ప్రత్యుత్తరంతొలగించు
  5. పాపికొండల ప్రయాణం బాగుంది ఫొటోలూ బాగున్నాయి
    మేమయితే ఇదే యాత్రను మా బందువుల్ల ఇంట్లో అక్కడే
    ఉంటూ 6 రోజులు గడిపం(1994 లో )

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. ధన్యవాదాలండి.అన్ని రోజులైతే బాగా ఎంజాయ్ చేసుంటారు

      తొలగించు
  6. అక్కడ ఉన్న చిన్న గిరిజన పల్లె పిల్లల ఆట పాటలు.. entha adrushtavantulo anipisthondi.. aa godavari theeram lo aadukontunna pillalni choosthe..

    ప్రత్యుత్తరంతొలగించు
  7. ఇలాంటివి అనుకోకుండా జరిగితే జీవితమంతా గుర్తుంటుంది. బావున్నాయి మీ ట్రిప్ విశేషాలు

    ప్రత్యుత్తరంతొలగించు
  8. ఇలాంటివి అనుకోకుండా జరిగితే జీవితమంతా గుర్తుంటుంది. బావున్నాయి మీ ట్రిప్ విశేషాలు

    ప్రత్యుత్తరంతొలగించు
  9. ఫొటోలూ బాగున్నాయి .. పాపికొండలు చాలా నల్లగా ఉంటాయి అని విన్నాను.. ఇక్కడ అంత నల్లగా ఎక్కడ కనపడలేదు???

    ప్రత్యుత్తరంతొలగించు
  10. ఫోటాన్గారు,Krishna Palakollu గారు ధన్యవాదాలు

    ప్రత్యుత్తరంతొలగించు
  11. మీ ఫొటోలే కాదు , మీ ప్రయాణాన్ని వర్ణించిన విధం కూడా చాలా బాగుంది . మీకు మంచి అభిరుచి ఉంది

    ".ఎలాగో వర్షంలో తడుస్తూ పరుగులు పెడుతూ వస్తే ఇక్కడి సీను ఇంకా గొప్పగా ఉంది !''

    ఈ వాక్యం చాలా బాగా నచ్చింది .

    ప్రత్యుత్తరంతొలగించు
  12. అద్భుతం గా ఉన్నాయండీ ఫోటోలు..పాపికొండలు చూడాలనే నా కల ఎప్పటికి నిజమవుతుందో !!

    ప్రత్యుత్తరంతొలగించు