=''/>

3, ఏప్రిల్ 2013, బుధవారం

అంచులే ఇప్పుడు చీరలకి ఫాషన్! (నేను కుట్టిన చీరలు)


సిల్కు చీర కొన్నా ,పట్టు చీరైనా,ఆఖరికి కాటన్ చీరైనా మధ్యలో ఖాళీగా ఉందనో ..అందంగా ఉంటుందనో వాటి మీద జరీ వర్క్,పానీ వర్క్ ,కాంతా వర్క్ ,జర్దోసి వర్క్ ఇలా ఏదోక వర్కు చేయించడమో ,కుట్టడం వచ్చిన వాళ్ళు  కుట్టుకోవడమో చేసేవారు. ఇప్పుడు అలా చీరలకి  వర్కు చేయించడము,చేయడము తగ్గింది .

 ఏ చీరకు చూసినా కుట్టిన బోర్డర్ లే   ఉంటున్నాయి. ఉప్పాడ చీరలు ,నెట్ చీరలకి  అంచులు,పాటర్న్  బ్లౌజ్ లు ఇప్పటి ట్రెండ్ .

రెండేళ్ళ నుండీ చెయ్యట్లేదు కానీ , నేను వర్కులు చాలా బాగా చేసేదానిని .ఏది కొత్తగా వస్తే అది వదల కుండా కుట్టే దాన్ని .కుట్లు కుట్టక పోయినా టైలరింగ్ మానలేదు.ఆ ఇంటరెస్ట్ తోనే  ఈ మధ్య చీరలకి బోర్డర్ లు కుట్టుకోవడం మొదలు పెట్టా .ఇప్పుడు అందరూ బోర్డర్ కుట్టిన చీరలు  బాగా వాడటం వలన  మాకు రాజమండ్రి లోకూడా   అన్ని రకాల బోర్డర్లు  బాగానే దొరుకుతున్నాయి .

అంచులు కొత్తచీరలకే  కాదు  , పాత చీరలు (పాతవంటే  మరీ  ఎప్పటివో కాదు .బోర్డర్ వేస్తే  బాగుండేవి) కొత్త లుక్ రావడానికి  వాటికి కూడా కుట్టొచ్చు.పాత వాటికి కుట్టే టప్పుడు పల్లు లేనివి ,బుటా లున్నవి ఐతే బాగుంటాయి.ఈ ఫోటోలలో ఉన్నవన్నీ పాతచీరలపై చేసినవే .






                                        పెద్ద అంచుకి పైనా ,క్రిందా గోటులా ఉన్న లేసు అతికి కుట్టా





                                 ఇదికూడాఅంతే  పచ్చ అంచులు  బోర్డర్ కి  కలిపి కుట్టినవి


కాస్త ఓపిక ,సమయం ఉంటే ఈ బోర్డర్లుతో మనమే  చీరలు డిజైన్ చేసుకోవచ్చు.హైదరాబాదు లో ఉండేవాళ్లకి  అమీర్ పేట  నర్సింగ్ షాప్లో చీరలకి మంచి క్లాత్ దొరుకుతుందని , బోర్డర్లు,లేసులు, చీర అంచులకి వాడే మెటిరియల్  అంతా  చార్మినార్ లోహోల్ సేల్ షాప్ లలో కొంచెం తక్కువకే వస్తాయని  మా కజిన్ అంది . ఒక్కో బోర్డర్ కుట్టడానికి  రెండొందలు నుండి నాల్గొందలు  వరకూ  మనం ఇచ్చే బోర్డర్ను బట్టి ఉంటుందట.


ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ట్రై చేయండి .బొటిక్స్, షాప్స్ లో ,అలాగే పేస్ బుక్ లో డిజైనర్ల ఇలా అంచులు వేసిన చీరలు పరిశీలనగా చూస్తే మనకే బోల్డ్ ఐడియాలు వచ్చేస్తాయి. మనం  కుట్టించుకుంటే  కాస్త తక్కువకే వస్తాయి.కాక పొతే మంచి టైలర్ని వెతుక్కోవాలి,కాస్త కష్టపడాలి . మొదటి సారి కాస్త  కొత్తగా ఉంటుంది .అలవాటైతే మన చీరలకి మనమే డిజైనర్ల మవొచ్చు.



9 కామెంట్‌లు:

  1. బావున్నాయి డిజైన్లు.ట్రై చేయాలి..

    రిప్లయితొలగించండి
  2. మంచి కాలం!

    అంచులు మాత్రమే ఉన్న చీరలు ఇప్పటి ఫేషన్ అనలేదు !!


    జిలేబి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారు ,నా బ్లాగ్ కి స్వాగతం .నార్తంతా అదే ఫేషన్ అండి .మీ కామెంట్ కి ధన్యవాదాలు

      తొలగించండి
  3. బావున్నాయి రాధిక గారు

    జిలేబీ గారు మీ కామెంట్ పేలింది అంచులు అంత మాత్రమే ఉన్న చీరలు ప్యాషనే ! కానీ మనకి కాదు

    రిప్లయితొలగించండి
  4. ఎంత ఓపికండీ మీకు. చీరలు బావున్నాయి.

    రిప్లయితొలగించండి
  5. చాలా బావున్నాయి రాధిక గారు. నేను కుట్టలేదు కానీ రెండు మూడు పాత పట్టు చీరలకి అంచులు కొని కుట్టించాను, అలాగే నెత్ జూట్ బట్ట మీటర్ల లెక్కన కొని దానికి అంచు వేయించి డిజైనర్ చీరగా చేసాను.. చాలా బాగా వచ్చయి అవి కూడా..

    రిప్లయితొలగించండి