=''/>

13, సెప్టెంబర్ 2013, శుక్రవారం

గిజిగాడి గూళ్ళు

 ఉదయమే దొడ్లో ఉన్న కొబ్బరి  చెట్లు చెరపడానికి (తయారైన కాయలు,ఎండిపోయిన కొమ్మలు,మట్టలు తీసివేయడం )కూలీలొచ్చివాళ్ళ పని వాళ్ళు చేసుకుపోయారు .

వాళ్ళు వెళ్ళిన కాసేపటికి మొక్కల్లోకెల్తే ,గిజిగాడిగూళ్ళు ఉన్న కొబ్బరి కొమ్మలు చెట్టు కింద కనిపించాయి .కొబ్బరి కొమ్మలకి గూళ్ళు కట్టుకున్నట్టున్నాయి ..అయ్యో !నరికేటప్పుడు చూస్తే వద్దని వాళ్లకి  చెప్పుదునే అనుకున్నా.లక్కీగా ఆ గుళ్ళలో గుడ్లు,పిల్లలు లేవు .



  
పిల్లల్ని పోషించేబాధ్యత   ఆడ పక్షులదైతే, గూళ్ళు కట్టే పని పూర్తిగా మగ పక్షులదేనట. కొబ్బరి ఆకుల్ని చీల్చుకొచ్చి ఆపోచలతోఅల్లాయి గూడుని.   ఇంజనీర్ల నేర్పరితనంతో, ఎంత కళాత్మకంగా కట్టు కున్నాయో!మెత్తమెత్తగా భలే ఉన్నాయి చూడటానికి. దూరంగా చెట్లకి,కరెంట్ తీగలకి వేలాడుతూ చూడటమే కానీ ఎప్పుడూ ఇలాదగ్గరగా చూడలేదు .








12 కామెంట్‌లు:

  1. ఈ గిజిగాడి గూడు ఒక engineering marvel అని అంటారండి. దాని నిర్మాణం ఇమిడిఉన్న సూత్రం ఇంకా మిస్టరీయేనట.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజంగానే మిస్టరీలానే ఉంటుంది ఆ గూడు నిర్మాణం .Tejaswi గారు థాంక్స్ అండి

      తొలగించండి
  2. ఆ గూట్లో బుల్లి పక్షులు కువకువలాడుతూ ఉంటాయన్నమాట. ఎంత అందంగా కట్టుకున్నాయి!

    రిప్లయితొలగించండి
  3. నాకూ ఈ గిజిగాడి గూళ్ళని చూస్తే భలే ఆశ్చర్యంగా ఉంటుందండీ! ఎంత నేర్పుగా కడతాయో కదా!! ఒక్కోసారి సగం వరకూ అల్లి కూడా నచ్చకపోతే మళ్ళీ మొదటినించీ కడతాయంట! గూడు కట్టేప్పుడు ఆడ పక్షి, కట్టేశాక పిల్లల్ని సాకేప్పుడు మగపక్షి ఆ గూటి దగ్గర చాలా తక్కువగా కనబడతాయంట...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునట నేనూ ఈ మధ్యే చదివాను అలాఅని .మనలాగానే వాటికి నచ్చడం ,నచ్చకపోవడాలు తెలుసన్నమాట :)ధన్యవాదాలండి

      తొలగించండి
  4. బావుందండీ.నేనూ ఎప్పుడూ దగ్గరగా చూడలేదు .ఇంకా గుడ్లు పెట్టలేదన్నమాట.గిజిగాడు అంటే పిచ్చుకా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగరాణి గారు .. గిజిగాడు పక్షి పిచ్చుక రెండు వేరండి. చూడడానికి అచ్చం పిచ్చుకలానే ఉంటుంది. మరింత సమాచారం ఈ లింక్ లో చూడండి.
      Gijigaadu is a different than, and not a Sparrow, it is called as Baya_Weaver. (Ploceus philippinus). More details at http://en.wikipedia.org/wiki/Baya_Weaver

      Regards,
      Sridhar Bukya
      http://kaavyaanjali.blogspot.in/

      తొలగించండి
  5. మా నానమ్మ వాళ్ళ ఊరిలో బావిలో వేలాడుతున్న చెట్టు కొమ్మపై చూస్తూ ఉంటాను. ఒకసారి ఈ గిజిగాడిని తన గుడు బాల్కనీ లో కూర్చుంటే చూసా. చాల బాగా కడుతాయవి మంకీ కేప్ లాగ ఓ హెల్మెట్ లాగ, అవేప్పుడు కింద ఫున్నేల్ శాపే నుండే గూట్లోకి వెళ్తాయి.

    రిప్లయితొలగించండి
  6. చినప్పుడు కిందపడిపోయిన పిచ్చుక గూళ్ళని పోగేయడం ఒక సరదా.. అలానే తుమ్మ చెట్ల మీద గుర్రాల పందాలు కూడా..

    రిప్లయితొలగించండి